Amazon Sale : 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. బిగ్ డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE6 స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించారు. 8000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 చిప్‌సెట్, 144Hz డిస్‌ప్లే వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ధర ఎంతో తెలుసా..?

వన్ ప్లస్ నార్డ్ సిఇ 6 పై అదిరిపోయే ఆఫర్..
ఆన్‌లైన్ షాపింగ్ ప్రపంచంలో సమ్మర్ సేల్స్ కొనసాగుతున్నాయి. అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ సమ్మర్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్ నార్డ్ CE6 మోడల్ మొదటి సేల్‌లోనే పెద్ద ఆఫర్‌తో అందుబాటులోకి రావడం విశేషం. పెర్ఫార్మెన్స్, బ్యాటరీ, గేమింగ్ అనుభవంపై దృష్టి పెట్టి ఈ మొబైల్‌ను రూపొందించారు. అందుకే యువతలో దీనికి మంచి క్రేజ్ ఉంది.

వన్ ప్లస్ నార్డ్ సిఇ 6 డిస్కౌంట్...
ఈ నార్డ్ CE6 మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8GB + 256GB వేరియంట్ ధర రూ.32,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్ కింద రూ.2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.27,999, రూ.30,999కి తగ్గుతాయి. దీనికి అదనంగా EMI, నో-కాస్ట్ EMI సదుపాయాలు కూడా అందిస్తుండటంతో కొనుగోలుదారులకు ఇది మరింత ఆకర్షణీయంగా మారింది.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే 6.78-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ముఖ్యమైన హైలైట్స్. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 4nm టెక్నాలజీతో తయారైన ఈ చిప్ 144FPS వరకు గేమింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
నార్డ్ సిఇ 6 గేమింగ్ ప్రియులకు పర్ఫెక్ట్ ఎంపిక...
ఈ నార్డ్ సిఇ 6 BGMI వంటి గేమ్‌లను ఎక్కువసేపు ఆడే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు మరో పెద్ద బలం దాని 8000mAh భారీ బ్యాటరీ. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, IP66/IP68/IP69 ప్రొటెక్షన్ రేటింగ్స్, ఆక్సిజన్‌ఓఎస్ 16 వంటివి దీనిని పూర్తి "పెర్ఫార్మెన్స్ + పవర్" ప్యాకేజీగా మార్చేశాయి.

