Jio Recharge Plan: జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. ఒక్క రీఛార్జ్ తో 12 OTT యాప్స్ ఫ్రీ!
జియో తమ యూజర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు వినోదాన్ని అందిస్తోంది. జియో తాజాగా ప్రకటించిన ప్లాన్ తో 2GB డైలీ డేటా, 100 SMSలు,12కి పైగా OTT ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. ప్యాక్ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

జియో రీఛార్జ్ ప్లాన్..
భారతదేశంలో అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్న టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో ఒకటి. వినియోగదారులకు తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిచడంతో పాటు వినోదాన్ని చేరువ చేస్తోంది. కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది.
జియో ఆఫర్లు..
సాధారణంగా జియో వినియోగదారులకు జియో క్లౌడ్ వంటి వివిధ యాప్‌ల యాక్సెస్ లభిస్తుంది. ఏ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నా.. ప్రతిరోజూ 100 SMSలు, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ ఉచితం.
జియో రీఛార్జ్ ప్లాన్..
జియో 1 రోజు నుంచి 365 రోజుల వరకు ప్లాన్‌లను అందిస్తోంది. అయితే తాజా ప్లాన్‌లో వినియోగదారులకు 10కి పైగా OTT ప్లాట్‌ఫామ్‌ల యాక్సెస్ లభిస్తుంది. ఇది జియో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్‌లలో ఒకటి. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB డేటా, 100 ఉచిత SMSలు లభిస్తాయి.
ప్లాన్ ధర ఎంతంటే?
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.445. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వినియోగదారులకు 2GB డేటా, 100 SMSలు, 12కి పైగా OTT యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
ఈ యాప్ లు ఫ్రీ..
JioHotstar, Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, FanCode, Hoichoi, JioTV, JioAICloud వంటి యాప్‌ల యాక్సెస్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేయచ్చు. SMSలు ఎక్కువగా చేసేవారికి, ఓటీటీ ఎక్కువగా చూసేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరం.