MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • BSNL బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే 1 GB డేటా..! IPL చూసే వారికి పండగే!

BSNL బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే 1 GB డేటా..! IPL చూసే వారికి పండగే!

BSNL అదిరిపోయే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అందుబాటు ధరల్లో కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ.. ప్రైవేటు టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. తాజాగా ఒక రూపాయికే 1 GB డేటా ప్లాన్ ప్రకటించి ఓటీటీ, IPL లవర్స్ ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.   

2 Min read
Author : Kavitha G
Published : Apr 01 2025, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

BSNL వరుస ఆఫర్లతో కస్టమర్ల మనసు దోచేస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్ ఫ్లాన్స్ ధరలు భారీగా పెంచడంతో చాలామంది యూజర్లు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. నూతన ఉత్సాహంతో దూసుకుపోతున్న BSNL మరో కొత్త రీఛార్జ్ ప్లాన్ ని ప్రకటించింది. అదెంటో ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందో ఇక్కడ చూద్దాం.

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
IPL అభిమానులకు పండగే..

IPL అభిమానులకు పండగే..

BSNL క్రికెట్ అభిమానులను అలరించడానికి ఒక స్పెషల్ రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. IPL సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఎలాంటి ఖర్చు లేకుండా IPL మ్యాచ్లను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

35
రూ. 251 రీఛార్జ్ ప్లాన్..

రూ. 251 రీఛార్జ్ ప్లాన్..

రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 251GB హై స్పీడ్ డేటాను అందిస్తోంది. అంటే కేవలం ఒక రూపాయికి 1GB డేటాను పొందవచ్చు. రోజువారీ పరిమితి లేదు. ఈ ప్లాన్ డేటా ప్యాక్ మాత్రమే. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్ లేదా SMS సేవలు అందుబాటులో లేవు. ఈ ప్లాన్ తక్కువ ధరలో హై స్పీడ్ డేటా కావాల్సిన యూజర్లకు బెస్ట్ ఎంపిక.

45
ఈ ఆఫర్ ఎవరికి బెస్ట్?

ఈ ఆఫర్ ఎవరికి బెస్ట్?

IPL సీజన్‌లో క్రికెట్ అభిమానుల కోసం స్పెషల్‌గా స్టార్ట్ చేసిన ఈ BSNL 251 రూపాయల ప్లాన్ చాలామందికి బాగా ఉపయోగపడుతుంది. ఆటంకం లేని మొబైల్ డేటా కావాల్సిన యూజర్లు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా OTT ప్లాట్ ఫామ్స్ ఎక్కువగా ఉపయోగించే వారికి, గేమింగ్ లవర్స్ కి ఈ ఆఫర్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది డేటా టెన్షన్ లేకుండా IPL మ్యాచ్‌లు చూడటానికి బెస్ట్ ఆప్షన్. 

55
బీఎస్ఎన్ఎల్ విస్తృత సేవలు

బీఎస్ఎన్ఎల్ విస్తృత సేవలు

రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో BSNL తన 4G నెట్‌వర్క్‌ను ఫాస్ట్‌గా ఎక్స్‌పాండ్ చేస్తోంది. తద్వారా ఎక్కువమంది యూజర్లు తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్‌లతో హై స్పీడ్ డేటాను పొందవచ్చు. 4G నెట్‌వర్క్ కవరేజ్ పెంచడానికి BSNL భారతదేశం అంతటా టవర్లు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు, 75,000 కంటే ఎక్కువ 4G టవర్లు ఏర్పాటుచేయగా.. త్వరలో వాటిని లక్ష టవర్లకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
భారతీయ టెలికాం
యుటిలిటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Portronics Vayu: పాకెట్‌లో ప‌ట్టే ఈ ప్రొడ‌క్ట్‌ ఉంటే చాలు.. ఎక్క‌డికైనా బిందాస్‌గా వెళ్లొచ్చు
Recommended image2
Realme 16T 5G: ఏఐ టూల్స్‌తో ఫొటోలు, వీడియోలు.. రియ‌ల్‌మీ నుంచి క‌ళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్
Recommended image3
AI Tool: పని చేయకపోతే ఎవరైనా అంతే.. సరిగా పనిచేయడం లేదని రోబోని పీకి పారేశారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved