- Home
- Technology
- JBL Earbuds : ఈ ఇయర్ బడ్స్ కు 10 నిమిషాల చార్జింగ్ చాలు... 4 గంటలు నాన్ స్టాప్ పాటలు వినొచ్చు
JBL Earbuds : ఈ ఇయర్ బడ్స్ కు 10 నిమిషాల చార్జింగ్ చాలు... 4 గంటలు నాన్ స్టాప్ పాటలు వినొచ్చు
ట్రాన్స్లూసెంట్ డిజైన్, ఏఎన్సీ (ANC) ఫీచర్‌తో పాటు 48 గంటల బ్యాకప్ ఇచ్చే కొత్త జేబీఎల్ ట్యూన్ బడ్స్ 3 ఇయర్‌బడ్స్ మార్కెట్లోకి వచ్చాయి. వీటి ధర, పూర్తి ఫీచర్ల వివరాలు చూద్దాం.

జేబీఎల్ ట్యూన్ బడ్స్ 3 లాంచ్
ఆడియో పరికరాల తయారీలో అగ్రగామి అయిన జేబీఎల్ (JBL), తన పాపులర్ 'ట్యూన్ బడ్స్ 3' (Tune Buds 3) వైర్లెస్ ఇయర్‌బడ్స్‌కి సంబంధించి కొత్త వెర్షన్‌ను చైనాలో లాంచ్ చేసింది. లోపలి భాగాలు స్పష్టంగా కనిపించే 'ట్రాన్స్లూసెంట్' డిజైన్ ఈ కొత్త మోడల్‌కి ప్రధాన ఆకర్షణ.
కొత్త ట్రాన్స్లూసెంట్ డిజైన్ కలిగిన జేబీఎల్ ట్యూన్ బడ్స్ 3 ఇయర్‌బడ్స్ ధర సుమారు రూ.10,100. డిసెంబర్ 3 నుంచి సేల్ మొదలవుతుంది. డీప్ బ్లాక్, మూన్ వైట్, జేడ్ అనే 3 రంగుల్లో ఇవి లభిస్తాయి. ఇండియా సహా ఇతర దేశాల్లో లాంచ్‌పై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అదిరిపోయే డిజైన్, స్పెసిఫికేషన్లు
ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్ రెండూ పారదర్శక డిజైన్‌ను కలిగి ఉంటాయి. దీనివల్ల లోపల ఉన్న హార్డ్‌వేర్ భాగాలను మనం బయటి నుంచే చూడొచ్చు. వాడుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉండేలా ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 5.9 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఛార్జింగ్ కేస్ బరువు 40 గ్రాములు. అంతేకాకుండా నీళ్లు, దుమ్ము నుంచి రక్షణ కల్పించే IP54 రేటింగ్‌ను కూడా ఇవి పొందాయి.
బెస్ట్ ఆడియో, ANC టెక్నాలజీ
బెస్ట్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఇందులో డ్యూయల్-లేయర్ కాంపోజిట్ పాలిమర్ డయాఫ్రాగమ్లతో కూడిన 10mm డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. హార్మన్ (Harman) సంస్థతో కలిసి వీటిని డిజైన్ చేసినందువల్ల ఆడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 'Personi-Fi 3.0' ఫీచర్ సాయంతో యూజర్లు తమ ఇష్టానికి తగ్గట్టుగా ఆడియోను కస్టమైజ్ చేసుకోవచ్చు.
బయటి శబ్దాలను తగ్గించే 'యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్' (ANC) కోసం ఇందులో 4 మైక్రోఫోన్లు ఉన్నాయి. ఇవి తక్కువ, మధ్యస్థ, అధిక ఫ్రీక్వెన్సీ శబ్దాలను సమర్థంగా ఫిల్టర్ చేస్తాయి. వేగవంతమైన, అంతరాయం లేని కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్ 6.0 (Bluetooth 6.0) టెక్నాలజీని అందించారు.
ఎక్కువసేపు వచ్చే బ్యాటరీ లైఫ్
బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే, ఈ ఇయర్‌బడ్స్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 12 గంటల పాటు వాడుకోవచ్చు. ANC ఆన్ చేస్తే 10 గంటల వరకు బ్యాటరీ వస్తుంది. ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 48 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను ఇవి ఇస్తాయి. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 4 గంటల పాటు పాటలు వినొచ్చు. ఫుల్ ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.
అదిరిపోయే డిజైన్, లేటెస్ట్ బ్లూటూత్ 6.0 టెక్నాలజీ, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో జేబీఎల్ ట్యూన్ బడ్స్ 3 మ్యూజిక్ లవర్స్‌లో భారీ అంచనాలను పెంచుతోంది.











