- Home
- Technology
- Best Smartphones 2026 : రూ.15000 నుంచి రూ.1.8 లక్షల వరకు.. 2026 లో వచ్చిన బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్లు ఇవే
Best Smartphones 2026 : రూ.15000 నుంచి రూ.1.8 లక్షల వరకు.. 2026 లో వచ్చిన బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్లు ఇవే
2026లో ఇండియాలో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏవో తెలుసుకుందాం. బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వరకు వాటి ధరలు, ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.

2026 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు
స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ముందుగా కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్‌ప్లే క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ ఫీచర్లు లాంటివి చూస్తాం కదా. అందుకే ప్రతి మొబైల్స్ తయారీ కంపెనీ సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తెస్తుంటాయి. ఇలా 2026లో ఇండియాలో బడ్జెట్ ఫోన్ల నుంచి లక్షల రూపాయల ప్రీమియం మోడల్స్ వరకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఈ లిస్ట్‌లో బడ్జెట్ ధరలో మంచి బ్యాటరీ ఉన్న ఫోన్లు, గేమింగ్ స్మార్ట్‌ఫోన్లు, బెస్ట్ కెమెరా ఉన్న ఫ్లాగ్‌షిప్ మోడల్స్, ఫోల్డబుల్ ఫోన్లు.. ఇలా బెస్ట్ 9 ఫోన్లు ఏవో తెలుసుకుందాం.
మోటో జి37 పవర్ (Moto G37 Power)
తక్కువ ధరలో ఎక్కువసేపు వాడేందుకు ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారికి మోటో జి37 పవర్ ఒక బెస్ట్ ఆప్షన్.
- ధర: రూ.14,999 నుంచి మొదలు
- బ్యాటరీ: 7000mAh
- ప్రాసెసర్: MediaTek Dimensity 6400
- డిస్‌ప్లే: 6.7 ఇంచ్, 120Hz LCD
- కెమెరా: 50MP మెయిన్ కెమెరా
- ఛార్జింగ్: 30W టర్బో పవర్
దీనిలో పెద్ద బ్యాటరీ, 5G సపోర్ట్, 120Hz డిస్‌ప్లే మెయిన్ ఫీచర్లు. అంతేకాకుండా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, MIL-STD-810H క్వాలిటీ సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి.
మోటారోలా ఎడ్జ్ 70 ఫ్యూజిన్ (Motorola Edge 70 Fusion)
మిడ్ రేంజ్ బడ్జెట్‌లో మంచి డిజైన్, బెస్ట్ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.
- ధర: రూ.34,999 నుంచి మొదలు
- ప్రాసెసర్: స్పాప్ డ్రాగన్ 7s జెన్ 4
- డిస్‌ప్లే: 6.8 ఇంచ్ Extreme AMOLED, 144Hz
- బ్యాటరీ: 7,000mAh
- ఛార్జింగ్: 68W టర్బో పవర్
అలాగే దీంట్లో IP68/IP69 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఎక్కువ సేపు వీడియోలు చూడటం, ఇంటర్నెట్ వాడటం లాంటి అవసరాలకు ఇది బాగా సెట్ అవుతుంది.
మోటారోలా ఎడ్జ్ 70 ప్రో (Motorola Edge 70 Pro)
- ధర: రూ.39,999 నుంచి మొదలు
- ప్రాసెసర్: MediaTek Dimensity 8500 Extreme
- డిస్‌ప్లే: 6.8 ఇంచ్ AMOLED, 144Hz
- బ్యాటరీ: 6,500mAh
- ఛార్జింగ్: 90W టర్బో పవర్
- కెమెరా: Sony LYTIA 710 మెయిన్ కెమెరా
ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ ప్రాసెసర్, 144Hz డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ లాంటివి ఉన్నాయి. ఒకే ఫోన్‌లో అటు ఫొటోగ్రఫీకి, ఇటు గేమింగ్ కి రెండింటికీ వాడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
వన్ ప్లస్ నార్డ్ 6 (OnePlus Nord 6)
వన్‌ప్లస్ తీసుకొచ్చిన ఈ మోడల్‌లో ప్రధాన ఆకర్షణ దీని 9,000mAh బ్యాటరీనే. ఎక్కువసేపు ఫోన్ వాడేవారికి, గేమింగ్ ఇష్టపడేవారికి ఇది చాలా బాగుంటుంది.
- ధర: రూ.46,999 నుంచి మొదలు
- ప్రాసెసర్: స్పాప్ డ్రాగన్ 8s జెన్ 4
- డిస్‌ప్లే: 6.78 ఇంచ్ AMOLED, 165Hz
- బ్యాటరీ: 9,000mAh
- ఛార్జింగ్: 80W SUPERVOOC
- కెమెరా: 50MP Sony LYTIA OIS మెయిన్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా
వీటితో పాటు IP66, IP68, IP69, IP69K సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. ఆరేళ్ల పాటు సిస్టమ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని వన్‌ప్లస్ తెలిపింది.
పోకో X8 ప్రో మ్యాక్స్ 5G (POCO X8 Pro Max 5G)
గేమింగ్, పెర్ఫార్మెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారికి పోకో X8 ప్రో మ్యాక్స్ ఒక మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.
- ధర: రూ.48,999 నుంచి మొదలు
- ప్రాసెసర్: MediaTek Dimensity 9500s
- డిస్‌ప్లే: 6.83 ఇంచ్ AMOLED, 120Hz
- బ్యాటరీ: 9,000mAh
- ఛార్జింగ్: 100W హైపర్ చార్జ్ వైర్డ్ చార్జింగ్
- కెమెరా: 50MP మెయిన్ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ కెమెరా
పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పవర్‌ఫుల్ ప్రాసెసర్ దీని మెయిన్ హైలైట్స్. ముఖ్యంగా ఎక్కువసేపు మొబైల్ గేమ్స్ ఆడేవారికి ఈ ఫోన్ బాగా సూట్ అవుతుంది.
శామ్సంగ్ గెలాక్సి S6 అల్ట్రా (Samsung Galaxy S26 Ultra)
కెమెరా, డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్ లలో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారి కోసం శాంసంగ్ తీసుకొచ్చిన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఇది.
- ధర: రూ.1,54,999 నుంచి మొదలు
- ప్రాసెసర్ : Snapdragon 8 Elite Gen 5
- డిస్‌ప్లే: 6.9 ఇంచ్ Dynamic AMOLED 2X, 120Hz
- కెమెరా: 200MP మెయిన్ + 50MP అల్ట్రా వైడ్ + 50MP టెలిఫోటో + 10MP టెలిఫోటో
- బ్యాటరీ: 5,000mAh
- ఛార్జింగ్: 60W వైర్డ్ ఛార్జింగ్
ఫొటోలను ఎడిట్ చేయడానికి, ఏఐ (AI) ఫీచర్లను ఉపయోగించడానికి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా, లాంగ్ టర్మ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ దీనికి మరో ప్లస్ పాయింట్.
శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్8 (Samsung Galaxy Z Fold8)
సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను, చిన్న ట్యాబ్లెట్‌ను ఒకే డివైజ్‌లో వాడాలనుకునే వారికి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు మంచి ఆప్షన్. ఈ విభాగంలో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్8 బెస్ట్ మోడల్ గా ఉంది.
- ధర: రూ.1,79,999 నుంచి మొదలు
- ప్రాసెసర్: Snapdragon 8 Elite Gen 5 ఔటర్
- డిస్‌ప్లే: 5.5 ఇంచ్ ఇన్నర్
- డిస్‌ప్లే: 7.6 ఇంచ్ Dynamic AMOLED 2X
- కెమెరా: 50MP మెయిన్ + 50MP అల్ట్రా వైడ్
- బ్యాటరీ: 4,800mAh
- ఛార్జింగ్: 45W
ఈ ఫోన్ తెరిచినప్పుడు పెద్ద డిస్‌ప్లే వస్తుంది కాబట్టి ఒకేసారి మల్టిపుల్ యాప్స్ వాడటానికి, వీడియోలు చూడటానికి, డాక్యుమెంట్స్ చదవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో (Apple iPhone 18 Pro)
ఆపిల్ అభిమానులకి, వీడియో రికార్డింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి ఈ ఐఫోన్ 18 ప్రో ఒక ప్రీమియం ఛాయిస్ గా ఉంటుంది.
- ధర: రూ.1,64,900 నుంచి మొదలు
- ప్రాసెసర్: Apple A20 Pro
- డిస్‌ప్లే: 6.3 ఇంచ్ Super Retina XDR OLED, 120Hz ProMotion
- కెమెరా: 48MP మెయిన్ + 48MP అల్ట్రా వైడ్ + 48MP టెలిఫోటో ఫ్రంట్ కెమెరా: 18MP
- స్టోరేజ్: 256GB నుంచి మొదలు
ఇందులో అడ్వాన్స్‌డ్ కెమెరా ఫీచర్లు, 8x ఆప్టికల్ క్వాలిటీ జూమ్, 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఉన్నాయి.
వివో X300 అల్ట్రా (VIVO X300 Ultra)
ఫొటోలు, వీడియోలు తీయడం అంటే పిచ్చి ఉన్న వాళ్ల కోసం వివో ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రీమియం మోడల్ ఈ X300 అల్ట్రా.
- ధర: రూ.1,59,999
- ప్రాసెసర్: Snapdragon 8 Elite Gen 5
- డిస్‌ప్లే: 6.82 ఇంచ్ AMOLED
- కెమెరా: ZEISS ట్రిపుల్ ప్రైమ్ కెమెరా సిస్టమ్
- టెలిఫోటో కెమెరా: 200MP
- బ్యాటరీ: 6,600mAh
- ఛార్జింగ్: 100W FlashCharge
200MP ZEISS గింబల్-గ్రేడ్ APO టెలిఫోటో కెమెరా, 4K 120fps డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీనిలో మెయిన్ ఫీచర్లు.
ఏ బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ కొనాలి?
2026లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్లు ఒక్కొక్కటి ఒక్కో అవసరం కోసం డిజైన్ చేశారు. అందుకే కేవలం ధర మాత్రమే కాకుండా, మీ అవసరాలకు తగ్గ ఫీచర్లను కూడా పోల్చి చూసుకుని ఫోన్ కొనుక్కోవడం ముఖ్యం.
- తక్కువ ధరలో: పెద్ద బ్యాటరీ, బేసిక్ 5G ఫీచర్ల కోసం Moto G37 Power.
- మిడ్ బడ్జెట్: మంచి డిస్‌ప్లే, బ్యాటరీ కోసం Motorola Edge 70 Fusion.
- పెర్ఫార్మెన్స్: Motorola Edge 70 Pro లేదా OnePlus Nord 6.
- గేమింగ్: POCO X8 Pro Max.
- ప్రీమియం ఆండ్రాయిడ్: Samsung Galaxy S26 Ultra.
- iOS ఎక్స్‌పీరియన్స్ కోసం: Apple iPhone 18 Pro.
- ఫొటోలు, వీడియోల కోసం: vivo X300 Ultra.
- ఫోల్డబుల్ ఫోన్ కావాలంటే: Samsung Galaxy Z Fold8.
కొత్త ఫోన్ కొనేముందు ర్యామ్, స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, వారంటీ లాంటివి కంపేర్ చేసుకోండి. ఆన్‌లైన్ ధరకు, ఆఫ్‌లైన్ ధరకు తేడా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొనేటప్పుడు ఒకసారి ధరలు క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది.











