- Home
- Technology
- Croma Black Friday Sale: క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్ లో రూ.45490కే ఐఫోన్ 16.. మ్యాక్‌బుక్, గెలాక్సీ ఎస్26 అల్ట్రాపై భారీ డిస్కౌంట్లు
Croma Black Friday Sale: క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్ లో రూ.45490కే ఐఫోన్ 16.. మ్యాక్‌బుక్, గెలాక్సీ ఎస్26 అల్ట్రాపై భారీ డిస్కౌంట్లు
Croma Black Friday Sale: క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్ 2026 నవంబర్ 30 వరకు లైవ్‌లో ఉంది. ఎలక్ట్రానిక్స్‌పై 50% వరకు తగ్గింపుతో ఐఫోన్ 16 రూ.45,490కే లభిస్తోంది. అలాగే, మ్యాక్‌బుక్ నియో రూ.42,714కే లభిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం.

గ్యాడ్జెట్ లవర్స్‌కు పండగే.. క్రోమా సేల్‌లో సగం ధరకే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు
నవంబర్ 30 వరకు క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్ 2026 ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా భారత్‌లో తన బ్లాక్ ఫ్రైడే సేల్ 2026ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. నవంబర్ 26న ప్రారంభమైన ఈ సేల్, నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా స్టోర్లతో పాటు ఆన్లైన్లో కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన కొనుగోళ్లపై కస్టమర్లకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్, ఈఎంఐ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆపిల్, శాంసంగ్, ఒప్పో, లెనోవో, హెచ్‌పీ, ఏసర్, సోనీ, ఎల్జీ వంటి టాప్ బ్రాండ్లపై క్రోమా ప్రత్యేక డీల్స్ ఇస్తోంది.
ఐఫోన్, మ్యాక్‌బుక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు
ఈ సేల్‌లో ఆపిల్ ప్రొడక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎంపిక చేసిన ఐఫోన్లు, మ్యాక్బుక్లు కొనేవారు బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కలిపి పొందవచ్చు. అన్ని ఆఫర్లు పోను ఐఫోన్ 16 (128GB) ధర రూ.45,490 వద్ద ప్రారంభమవుతుందని క్రోమా తెలిపింది. ఈ ధరలో రూ.2,000 వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్, పాత ఐఫోన్ 14 (128GB) ఎక్స్ఛేంజ్పై రూ.24,000 వరకు విలువ, అదనంగా రూ.8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కలిసి ఉన్నాయి.
అలాగే, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (256GB, ఆరెంజ్) రూ.4,000 వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో కలిపి రూ.96,290 ప్రారంభ ధరతో లభిస్తోంది. ఇక మ్యాక్‌బుక్ నియో (8GB ర్యామ్, 256GB స్టోరేజ్) ధర రూ.42,714గా ఉంది. ఇందులో రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ.7,000 వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఉన్నాయి. అయితే, అసలు ధరలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ విలువ, పాత డివైస్ కండిషన్‌పై ఆధారపడి ఉంటాయి.
శాంసంగ్, ఒప్పో, రెడ్మీ స్మార్ట్‌ఫోన్ డీల్స్
ఆపిల్ మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లపై కూడా క్రోమా భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. బడ్జెట్ ధరలో 5జీ ఫోన్ కావాలనుకునే వారికి ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ (6GB + 128GB) రూ.11,761 ప్రారంభ ధరకే లభిస్తోంది. అలాగే, రెడ్మీ 17సీ 5జీ (4GB + 128GB) మోడల్ రూ.11,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ కోరుకునే వారి కోసం శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా (12GB + 256GB) రూ.85,999 ప్రారంభ ధర వద్ద లిస్ట్ అయింది.
ల్యాప్‌టాప్ కొనుగోలుదారులకు ప్రత్యేక ప్రయోజనాలు
కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఈ సేల్ మంచి అవకాశం. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై 20 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. దీనితో పాటు ఎంపిక చేసిన మోడళ్లపై క్యాష్‌బ్యాక్, సులభమైన ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. లెనోవో యోగా ఎస్7 14 అంగుళాల ల్యాప్‌టాప్ ఎఫెక్టివ్ ధర రూ.1,02,392గా ఉంది.
హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 ఏఐ ల్యాప్‌టాప్ (16GB ర్యామ్, 512GB స్టోరేజ్) రూ.69,810 వద్ద ప్రారంభమవుతోంది. ఇక బడ్జెట్లో ల్యాప్‌టాప్ చూసే వారి కోసం ఏసర్ ఆస్పైర్ లైట్ ల్యాప్‌టాప్‌లు రూ.43,609 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి.
సోనీ, ఎల్జీ టీవీలతో పాటు హోమ్ అప్లయెన్సెస్ ఆఫర్లు
ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, సౌండ్బార్లపై కూడా ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. ఎల్జీ 55 అంగుళాల ఏఐ నానో టీవీ ధర రూ.44,990 కాగా, ఎల్జీ 75-అంగుళాల 4K ఏఐ నానో టీవీ రూ.89,990 వద్ద లిస్ట్ అయింది. సోనీ 65-అంగుళాల బ్రావియా 3II టీవీ ధర రూ.1,16,990గా ఉంది. కొన్ని టీవీలపై క్రోమా రూ.26,000 వరకు క్యాష్‌బ్యాక్, ఈఎంఐ డిస్కౌంట్లు ఇస్తోంది.
అంతేకాకుండా, టీవీతో పాటు ఎంపిక చేసిన సౌండ్బార్లను కొనుగోలు చేస్తే వాటిపై 12 శాతం వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. చిన్న గృహోపకరణాల విషయానికి వస్తే, ఫిలిప్స్ డిజిటల్ ఎయిర్ ఫ్రయర్ రూ.7,299గా ఉంది. ఎంపిక చేసిన ఫిలిప్స్ పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 30 శాతం వరకు, హ్యావెల్స్ గ్రూమింగ్, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.













