MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?

EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?

EPFO : ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లకు గుడ్ న్యూస్. ఇకపై పీఎఫ్ అకౌంట్ నుండి ఏటీఎం, యూపీఐ ద్వారా నేరుగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. దీని కోసం ఈపీఎఫ్ఓ తమ సేవల్లో మార్పులు చేస్తోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 08 2026, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు గుడ్ న్యూస్
Image Credit : Asianet News

పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు గుడ్ న్యూస్

మీరు ఉద్యోగం చేస్తున్నారా? ప్రతి నెలా మీ జీతం నుండి పీఎఫ్ కట్ అవుతోందా? అయితే మీకో గుడ్ న్యూస్. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇకపై అత్యవసర సమయాల్లో మీ పీఎఫ్ అకౌంట్ నుండి డబ్బులు తీసుకోవడం మరింత ఈజీ కానుంది.

ఇప్పటివరకు పీఎఫ్ డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం లేదా ఆన్‌లైన్‌లో రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ త్వరలోనే మీరు మీ ఇంటి పక్కన ఉండే ఏటీఎం కి వెళ్లి లేదా ఫోన్‌లో యూపీఐ ద్వారా పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.

25
ఈపీఎఫ్ఓ 3.0 తో పెను మార్పులు
Image Credit : Gemini

ఈపీఎఫ్ఓ 3.0 తో పెను మార్పులు

ప్రభుత్వం ఈపీఎఫ్ఓ డిజిటల్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించే పనిలో ఉంది. ఇందులో భాగంగానే ఏడాది క్రితం 'EPFO 3.0'ను లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటంటే.. పీఎఫ్ ప్రక్రియను అత్యంత పారదర్శకగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చడం. 2026 మధ్య నాటికి ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్, ఉద్యోగి కోరుకున్న బ్యాంక్ ఖాతాలోకి సులభంగా డబ్బులు పంపే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల మధ్యవర్తుల బెడద ఉండదు, పనులు కూడా స్పీడ్‌గా పూర్తవుతాయి.

Related Articles

Related image1
Blue Moon : ఆకాశంలో అద్భుతం బ్లూ మూన్.. నిజంగానే చందమామ నీలం రంగులోకి మారుతుందా?
Related image2
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!
35
ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా ఎలా?
Image Credit : AI

ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా ఎలా?

మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఏడాది మే చివరి నాటికే ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం ప్రారంభం కావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈపీఎఫ్ఓ తన సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏటీఎం కార్డులను జారీ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ కార్డు నేరుగా మీ పీఎఫ్ ఖాతాతో లింక్ అయి ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, మీరు ఏ ఏటీఎంకైనా వెళ్లి క్యాష్ తీసుకోవచ్చు. అలాగే యూపీఐ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల పీఎఫ్ డబ్బుల కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

45
విత్ డ్రా పరిమితులు, నిబంధనలు ఇవే
Image Credit : our own

విత్ డ్రా పరిమితులు, నిబంధనలు ఇవే

సదుపాయం సులభంగా ఉన్నప్పటికీ, దీనికి కొన్ని పరిమితులు ఉండే అవకాశం ఉంది. సంబంధిత వర్గాల ప్రకారం.. యూపీఐ లేదా ఏటీఎం ద్వారా మీ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్ఠంగా 50 శాతం వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫెసిలిటీ పొందాలంటే కొన్ని కండిషన్స్ తప్పనిసరి:

1. మీ యూఏఎన్ (UAN) యాక్టివ్‌గా ఉండాలి.

2. మీ కేవైసీ (KYC) డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలి.

3. మీ పాన్, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఆధార్ కార్డు వంటివి యూఏఎన్‌తో లింక్ అయి ఉండాలి.

55
రికార్డు స్థాయిలో క్లెయిమ్‌లు
Image Credit : Freepik

రికార్డు స్థాయిలో క్లెయిమ్‌లు

కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈపీఎఫ్ఓ గత ఆర్థిక సంవత్సరం 2025–26లో ఏకంగా 8.31 కోట్ల క్లెయిమ్‌లను సెటిల్ చేసి రికార్డు సృష్టించింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. వీటిలో సుమారు 5.51 కోట్ల క్లెయిమ్‌లు అడ్వాన్స్ విత్ డ్రాకు సంబంధించినవి కావడం విశేషం. ఆటో మోడ్ ద్వారా దాదాపు 71.11 శాతం అడ్వాన్స్ క్లెయిమ్‌లను కేవలం 3 రోజుల్లోనే పరిష్కరించడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.2 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Price: సామాన్యులకు గుడ్ న్యూస్: భారీగా దిగివచ్చిన పసిడి.. నేటి గోల్డ్ రేట్ ఎంతంటే?
Recommended image2
రిచ్ ఏరియాల్లో ఉండే దుకాణాల్లో క‌స్ట‌మ‌ర్లే క‌నిపించ‌రు.. కానీ ల‌క్ష‌ల్లో లాభాలు ఎలా వ‌స్తాయి.?
Recommended image3
ఆరోజు రూ. ల‌క్ష పెట్టుబ‌డి పెట్టుంటే.. ఈరోజు రూ. 14 కోట్లు అయ్యేవి. స్టాక్ మార్కెట్ మ్యాజిక్ అంటే ఇదే
Related Stories
Recommended image1
Blue Moon : ఆకాశంలో అద్భుతం బ్లూ మూన్.. నిజంగానే చందమామ నీలం రంగులోకి మారుతుందా?
Recommended image2
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved