MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Online Scams: ఆన్ లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఇవి కచ్చితంగా పాటించండి!

Online Scams: ఆన్ లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఇవి కచ్చితంగా పాటించండి!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్ లైన్ లావాదేవీలే జరుగుతున్నాయి. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఏమైనా చేసేయచ్చు. అయితే ఇదే అదనుగా కొందరు మోసాలకు పాల్పడతున్నారు. క్షణాల్లోనే అకౌంట్లోని సొమ్మును ఖాళీ చేస్తున్నారు. మరి ఈ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Kavitha G
Published : Aug 11 2025, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
How to Protect Yourself from Online Scams
Image Credit : Getty

How to Protect Yourself from Online Scams

ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ మన జీవితాలను ఎంత మార్చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండింటి వాడకం ద్వారా చాలా పనులు ఈజీగా మారిపోయాయి. ఒకప్పుడు ఏదైనా కొనాలి అంటే చేతిలో కచ్చితంగా డబ్బులు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు.. అకౌంట్లో ఉన్న డబ్బులను డైరెక్ట్ గా వాడుకోవచ్చు. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. దానికి సంబంధించిన నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోవడం బాధకరమైన విషయం. మరి ఆన్ లైన్ మోసాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

25
వ్యక్తిగత సమాచారం ఎవరితో షేర్ చేసుకోవద్దు
Image Credit : Getty

వ్యక్తిగత సమాచారం ఎవరితో షేర్ చేసుకోవద్దు

బ్యాంకు అకౌంట్ నంబర్, OTP, ATM పిన్, ఆధార్ నంబర్ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోకూడదు. కొందరు బ్యాంకు ఉద్యోగులమని చెప్పి ఫోన్ చేసి వివారాలు అడుగుతుంటారు. అలాంటి వారిని నమ్మవద్దు. నిజమైన బ్యాంకు ఉద్యోగులు ఎప్పుడూ ఓటీపీ అడగరనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

ఫిషింగ్ ఇమెయిల్స్‌, ఫేక్ మెసేజ్‌లతో జాగ్రత్త

“మీ అకౌంట్ బ్లాక్ అయింది”, “మీకు గిఫ్ట్ వచ్చింది” అనే మెసేజ్‌లు లేదా ఇమెయిల్స్ వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేయకూడదు. కొన్నిసార్లు మీరు తెలియని లింకులు ఓపెన్ చేయడం ద్వారా మోసానికి గురికావాల్సి వస్తుంది. కొన్ని లింకులు మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు.

Related Articles

Related image1
Business Idea: జాబ్ చేస్తూనే ఈ బిజినెస్ చేయచ్చు.. నెలకు రూ.30 వేలు గ్యారెంటీ!
Related image2
ఈ 4 కరెక్టుగా చేస్తే మిమ్మల్ని కోటీశ్వరులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు!
35
పాస్‌వర్డ్, టూ స్టెప్ వెరిఫికేషన్
Image Credit : Getty

పాస్‌వర్డ్, టూ స్టెప్ వెరిఫికేషన్

ఏ పాస్‌వర్డ్ అయినా అక్షరాలు, నంబర్లు, ప్రత్యేక గుర్తుల మిశ్రమంగా ఉండాలి. Gmail, Facebook, Net banking లాంటి వాటికి 2-Step Verification ను ఉపయోగించండి.

అసలైన వెబ్‌సైట్లు మాత్రమే..

షాపింగ్ లేదా బ్యాంకింగ్ చేయబోయే వెబ్‌సైట్ల URL ని బాగా పరిశీలించండి. ఫేక్ సైట్లు అసలు కంపెనీ పేరుతో దగ్గరగా ఉండే నకిలీ URLలను కలిగి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించడం మంచిది.

45
అనుమానాస్పద డీల్స్‌
Image Credit : Getty

అనుమానాస్పద డీల్స్‌

“రూ.5,000కే ఐఫోన్!”, “మీరు రూ. 5 లక్షలు గెలిచారు” వంటి ఆఫర్ డీల్స్ చూసి మోసపోవద్దు. ఇలాంటి ఆఫర్లు చాలా సందర్భాల్లో మోసపూరితమైనవే ఉంటాయి.

తెలియని యాప్స్ ఇన్‌స్టాల్ చేయవద్దు

ఫోన్‌లో అఫీషయల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇతర వెబ్‌సైట్ల నుంచి వచ్చిన APK ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయవద్దు.

55
సోషల్ మీడియా మోసాలు
Image Credit : Getty

సోషల్ మీడియా మోసాలు

మీ పేరుతో నకిలీ ప్రొఫైల్స్ ఉంటే వెంటనే రిపోర్ట్ చేయండి. ఎవరైనా డబ్బు అడుగుతూ మెసేజ్ చేస్తే నమ్మకండి. మీకు తెలిసిన వారి ప్రొఫైల్స్‌ కూడా హ్యాక్ అయి ఉండవచ్చు. కాబట్టి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే స్పందించండి.

బ్యాంక్ SMSలు

మీ అకౌంట్ లో అనుమానాస్పద ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇవ్వాలి. అప్రమత్తంగా ఉండేందుకు SMS/Email alerts ఆన్ చేసుకోండి. ఇంట్లో ఉన్న పిల్లలకు, వృద్ధులకు ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించండి. ఈ జాగ్రత్తల గురించి తెలియజేయండి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
యుటిలిటీ
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved