MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • HelpingAI : 19 ఏళ్ల భారతీయ కుర్రాళ్లు... సరికొత్త ఏఐ మోడల్ తో టెక్ దిగ్గజాలకే సవాల్, ఏమిటి దీని ప్రత్యేకత?

HelpingAI : 19 ఏళ్ల భారతీయ కుర్రాళ్లు... సరికొత్త ఏఐ మోడల్ తో టెక్ దిగ్గజాలకే సవాల్, ఏమిటి దీని ప్రత్యేకత?

Indian AI Model : ముగ్గురు యువకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అద్భుతాలు చేస్తున్నాయి. సరికొత్త ఏఐ మోడల్ తో టెక్ దిగ్గజాలకే సవాల్ విసురుతున్నారు. ఇంతకూ వాళ్లు రూపొందించి ఏఐ మోడల్ ఏమిటి? దాని ప్రత్యేకతలేంటో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 08 2025, 09:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియన్ AI మోడల్ రెడీ...
Image Credit : X/HelpingAI

ఇండియన్ AI మోడల్ రెడీ...

Artificial Intelligence : టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఐదేళ్లకో, పదేళ్లకో ఓ విప్లవాత్మక మార్పు సంభవిస్తోంది. ప్రస్తుతం మనం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జమానాలోకి అడుగుపెట్టాం. ఇప్పటికే ఏఐ రాకతో అనేక రంగాల్లో మార్పులు మొదలయ్యాయి... ఇది మనిషి ఆలోచనా శక్తిని మించిపోయే పనులు చేస్తోంది. ఇక భవిష్యత్ ఏఐదే అని గుర్తించిన టెక్ దిగ్గజాలు అనేక మోడల్స్ రెడీ చేశాయి. కానీ ఇండియాకు చెందిన ముగ్గురు యువకులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన AI మోడల్స్ తో పోటీకి దిగారు... సరికొత్త ఏఐ మోడల్ ను రూపొందించారు. అదే HelpingAI.

DID YOU
KNOW
?
ChatGPT-5
చాట్ జిపిటి ద్వారా AI ని ప్రపంచానికి పరిచయం చేసిన ఓపెన్ ఏఐ సంస్థ తాజాగా అడ్వాన్సుడ్ ఏఐ మోడల్ ChatGPT-5 ని రూపొందించింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
HelpingAI ప్రత్యేకత ఏమిటి?
Image Credit : Getty

HelpingAI ప్రత్యేకత ఏమిటి?

ఇప్పుడున్న సాంప్రదాయ AI మోడల్స్ అన్ని ఒకేలా పనిచేస్తాయి. వినియోగదారుడు అడిగే ప్రశ్నలు, సమస్యలకు ఇంచుమించు ఒకేలా సమాధానం ఇస్తాయి... చిన్న ప్రశ్నలకు కూడా ఎక్కువసేపు ఆలోచించి సమాధానం ఇస్తాయి. దీంతో కంప్యూటింగ్ శక్తి ఎక్కువ వినియోగించబడుతుంది… అలాగే కొన్నింటి వినియోగానికి అధిక వ్యయం అవుతుంది. అయితే HelpingAI ఈ పద్ధతిని మార్చింది. ఇది ప్రశ్నకు అనుగుణంగా వివిధ రీతుల్లో ఆలోచిస్తుంది.

HelpingAI సులభమైన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తుంది. అదే కాస్త క్లిష్టమైన సమస్యలకు ఆలోచించి సమాధానం ఇస్తుంది... మరీ క్లిష్టమైన ప్రశ్నలకు బాగా లోతుగా ఆలోచించి, అవసరమైతే రెండోసారి సమీక్షించి జవాబు ఇస్తుంది. అంతేకాదు మధ్యలో తప్పులు గుర్తించి వెంటనే మార్పులు కూడా చేస్తుంది. ఇలా ఏ AI మోడల్ చేయని పని ఈ హెల్పింగ్ ఏఐ చేస్తుంది... అందుకే ఇది మిగతావాటితో ప్రత్యేకంగా నిలుస్తోంది.

35
HelpingAI పనితీరు
Image Credit : Getty

HelpingAI పనితీరు

ఈ హెల్పింగ్ ఏఐ మోడల్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది చైనీస్ ఏఐ మోడల్ DeepSeek-R1 కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తోందని... OpenAI ChatGPT-4 కంటే సమర్ధవంతంగా పనిచేస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. అలాగే ఇది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణంగా మానవ మెదడు ఆలోచనలకు తగ్గట్లుగా ఈ హెల్పింగ్ ఏఐ జవాబులు ఉంటున్నాయని చెబుతున్నారు.

45
భారతీయ AI మోడల్ గా గుర్తింపు
Image Credit : Getty

భారతీయ AI మోడల్ గా గుర్తింపు

అమెరికా వంటి దేశాలు AI టెక్నాలజీలో ఆదిపత్యం ప్రదర్శిస్తున్నాయి. వీటికి చైనా వంటి దేశాలు DeepSeek వంటి AI మోడల్స్ తో పోటీ ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ HelpingAI వంటివాటి ద్వారా భారత్ కూడా పోటీలోకి వస్తోంది. HelpingAI ఇండియన్ ఏఐ రంగానికి ప్రాతినిధ్యం వహించే సామర్థ్యం కలిగి ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

HelpingAI 10 వేల మంది సభ్యులతో కూడిన భారతీయ టెక్ కమ్యూనిటీని Redditలో నడుపుతోంది. ఈ AI మోడల్ ను మొదటి రోజు నుంచే ప్రోత్సహించడానికి, ప్రచారం చేయడానికి ఈ నెట్‌వర్క్ ఉపయోగపడుతోంది.

55
HelpingAI ను తయారుచేసిన యువకులు వీళ్ళే
Image Credit : Getty

HelpingAI ను తయారుచేసిన యువకులు వీళ్ళే

1. HelpingAI చీఫ్ AI ఆఫీసర్ గా అభయ్ కౌల్ వ్యవహరిస్తున్నాడు. ఇతడు ప్రస్తుతం ఐఐటీ మద్రాస్‌లో డేటా సైన్స్‌ చదువుతున్నారు. ఇతడు ప్రతిభను అంతర్జాతీయ స్థాయి నిపుణులు గుర్తించారు.

2. HelpingAI CEO గా నిశిత్ జైన్ వ్యవహరిస్తున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ఏఐ కమ్యూనిటీ (r/ai_india) మోడరేటర్‌, అనుభవజ్ఞుడైన ఏఐ నిపుణుడు.

3. HelpingAi CTO గా వరుణ్ గుప్త వ్యవహరిస్తున్నారు. మూడు నెలల్లోనే టెక్‌ ఏజెన్సీని ఆరు అంకెల ఆదాయ స్థాయికి చేర్చిన అనుభవం ఇతడిది. ఏపీఐ ఆధారిత ఉత్పత్తులలో మంచి నైపుణ్యం కలిగివున్నాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Recommended image2
AI Governance: మాటలతో కాదు.. కఠిన చట్టాలతోనే ఏఐకి నియంత్రణ
Recommended image3
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Related Stories
Recommended image1
Artificial Intelligence:ఏఐతో ఉద్యోగాలు ఊడిపోవడం కంటే అది ఇంకా డేంజర్!
Recommended image2
Artificial intelligence : ఓ ఏఐతో మరో ఏఐ మాట్లాడితే ... ఎలా ఉంటుందో చూడండి? (వీడియో)
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved