MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • గూగుల్‌ ఎమర్జెన్సీ అలర్ట్‌.. మీరు వెంటనే ఈ పని చేయండి

గూగుల్‌ ఎమర్జెన్సీ అలర్ట్‌.. మీరు వెంటనే ఈ పని చేయండి

Google Warning: గూగుల్ 2.5 బిలియన్ జీమెయిల్ (Gmail) యూజర్లకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. వెంటనే పాస్‌వర్డ్ మార్చి, 2-స్టెప్ వెరిఫికేషన్ ప్రారంభించమని సూచించింది. ఎందుకు ఈ హెచ్చరికలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 31 2025, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గూగుల్ అత్యవసర హెచ్చరికలు
Image Credit : Getty

గూగుల్ అత్యవసర హెచ్చరికలు

ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు గూగుల్ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. యూజర్లు వెంటనే తమ పాస్‌వర్డ్ మార్చుకోవాలని పేర్కొంది. అలాగే 2-స్టెప్ వెరిఫికేషన్ (2SV) ప్రారంభించాలని సూచించింది. ఇటీవల పెరుగుతున్న హ్యాకింగ్ దాడుల నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేసింది. సైబర్ హ్యాకింగ్ గ్రూప్ షైనీహంటర్స్ (ShinyHunters)కు చెందిన హ్యాకర్లు ఉన్నారని పేర్కొంది.

DID YOU
KNOW
?
గూగుల్
2025లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.01 బిలియన్ల (501 కోట్ల) మంది గూగుల్ ఉపయోగిస్తున్నారు. ఈ సంఖ్య గూగుల్ సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, యూట్యూబ్, ఆండ్రాయిడ్, గూగుల్ క్రోమ్ వంటి గూగుల్ ఉత్పత్తులను ఉపయోగించే వారిని సూచిస్తుంది. గూగుల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్‌గా ఉంది. దీనికి ప్రపంచ మార్కెట్‌లో 90% పైగా వాటా ఉంది.
25
షైనీహంటర్స్ దాడుల వ్యూహం ఏమిటి?
Image Credit : Gemini

షైనీహంటర్స్ దాడుల వ్యూహం ఏమిటి?

2020 నుంచి యాక్టివ్‌గా ఉన్న ఈ గ్రూప్, ఫిషింగ్ (Phishing) పద్ధతినే ప్రధానంగా ఉపయోగిస్తోంది. నకిలీ ఇమెయిల్స్ పంపి, యూజర్లు తప్పు లాగిన్ పేజీల్లో వివరాలు నమోదు చేసేలా మోసం చేస్తుంది. ఈ గ్రూప్ ఇప్పటివరకు AT&T, Microsoft, Santander, Ticketmaster వంటి కంపెనీల డేటా బ్రీచ్‌ల వెనుక ఉందని అనుమానాలున్నాయి.

గూగుల్ జూన్ నెలలోనే దీనిపై హెచ్చరికలు చేసింది. “షైనీహంటర్స్ భవిష్యత్తులో డేటా లీక్ సైట్ (DLS) ప్రారంభించి బలవంతపు డిమాండ్లు చేసే అవకాశముంది” అని పేర్కొంది. ఆ తర్వాత ఆగస్టు 8న, ప్రభావితమైన Gmail యూజర్లకు గూగుల్ ఇమెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపింది.

Related Articles

Related image1
Jio Frames: జియో ఫ్రేమ్స్.. అదిరిపోయే ఫీచర్లతో ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. అన్ని పనులు చేస్తుంది !
Related image2
iPhone 17 నుంచి Realme 15T వరకు.. సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి 5 కొత్త స్మార్ట్‌ఫోన్లు
35
గూగుల్ ఆకౌంట్ 2-స్టెప్ వెరిఫికేషన్
Image Credit : Gemini

గూగుల్ ఆకౌంట్ 2-స్టెప్ వెరిఫికేషన్

2-స్టెప్ వెరిఫికేషన్ వల్ల పాస్‌వర్డ్ బయటకు వచ్చినా అకౌంట్ సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే హ్యాకర్లు రెండో స్థాయి కోడ్ లేకపోతే అకౌంట్‌కి యాక్సెస్ కావడం అసాధ్యం. యుకే లోని Action Fraud కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసింది. “2SV యాక్టివ్ చేస్తే హ్యాకర్లు మీ అకౌంట్‌ల్లోకి చొరబడలేరు, పాస్‌వర్డ్ తెలిసినా కూడా మీ డేటాను చోరీ చేయలేరు.” అని తెలిపింది.

“Stop Think Fraud” వెబ్‌సైట్ కూడా 2SV సులభంగా ప్రారంభించవచ్చని తెలిపింది. ఇది ఇమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా సహా ఎక్కువ ఆన్‌లైన్ సేవల్లో అందుబాటులో ఉందని స్పష్టం చేసింది.

45
గూగుల్ డేటా బ్రీచ్ వివరాలు
Image Credit : gemini

గూగుల్ డేటా బ్రీచ్ వివరాలు

గూగుల్ జూలైలో ఒక సేల్ ఫోర్స్ సిస్టమ్‌లో డేటా బ్రీచ్ జరిగిందని అంగీకరించింది. అయితే కస్టమర్ Gmail లేదా Cloud అకౌంట్లు ప్రభావితం కాలేదని తెలిపింది. బయటపడిన సమాచారం ఎక్కువగా పబ్లిక్ బిజినెస్ డేటాగా పేర్కొంది. అయితే, హ్యాకర్లు దీన్ని మరింత తీవ్రమైన దాడులకు ఉపయోగిస్తున్నారని పేర్కొంది.

గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రకారం.. సోషల్ ఇంజనీరింగ్ దాడుల్లో IT సపోర్ట్ సిబ్బంది లాగా నటిస్తూ హ్యాకర్లు యూజర్లను మోసం చేస్తున్నారు. ఇది అనేక అకౌంట్లకు హాని కలుగజేస్తోంది.

55
గూగుల్ పాస్‌వర్డ్ మార్చే విధానం
Image Credit : Getty

గూగుల్ పాస్‌వర్డ్ మార్చే విధానం

వరుస డేటా బ్రీచ్ ల నేపథ్యంలో గూగుల్ యూజర్లకు పాస్‌వర్డ్‌ను తరచూ మార్చుకోవాలని సూచిస్తోంది. దీని కోసం ఈ కింద సూచించిన స్టెప్ లను ఫాలో అవ్వండి..

బ్రౌజర్ అయితే,

1. Google Account ఓపెన్ చేయండి

2. ఎడమవైపు “Security” క్లిక్ చేయండి

3. “Signing in to Google” లో “Password” ఎంచుకోండి

4. మళ్లీ సైన్ ఇన్ చేసి కొత్త పాస్‌వర్డ్ టైప్ చేయండి

5. “Change password” క్లిక్ చేయండి

6. మీకు టూ స్టెప్ వేరిఫికేషన్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది

Android లో:

• Settings > Google > Manage your Google Account > Security > Password

iPhone/iPad లో:

• Gmail యాప్ ఓపెన్ చేసి > ప్రొఫైల్ పిక్ > Manage your Google Account > Personal info > Password

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved