MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • iPhone 17 నుంచి Realme 15T వరకు.. సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి 5 కొత్త స్మార్ట్‌ఫోన్లు

iPhone 17 నుంచి Realme 15T వరకు.. సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి 5 కొత్త స్మార్ట్‌ఫోన్లు

Upcoming smartphones : సెప్టెంబర్ 2025లో భారత మార్కెట్‌లో పలు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. వాటిలో ఐఫోన్ (iPhone) 17 సిరీస్, రియల్ మీ 15T, టెక్నో Pova Slim 5G,  మోటరోలా Razr 60, iQOO 15 Miniలు కూడా ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 29 2025, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారత మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లు
Image Credit : Getty

భారత మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లు

2025 రెండో భాగంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరింత సందడిగా మారబోతోంది. ప్రముఖ కంపెనీలైన ఆపిల్ (Apple), రియల్ మీ (Realme), టెక్నో (Tecno), మోటరోలా (Motorola), ఐక్యూ (iQOO) లు తమ వినియోగదారుల కోసం కొత్త మోడళ్లను సిద్ధం చేశాయి. రాబోయే వారాల్లో ఈ ఫోన్లు అధికారికంగా లాంచ్ కానున్నాయి. వీటి ప్రత్యేకతలు, ధరలు, డిజైన్, స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఆ వివరాలు గమనిస్తే..

26
రియల్ మీ 15టీ (Realme 15T)
Image Credit : realmeIndia@X

రియల్ మీ 15టీ (Realme 15T)

రియల్ మీ తర్వరలోనే Realme 15T మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన రియల్ మీ 14టీ (Realme 14T) అప్ గ్రేడ్ వెర్షన్. లీక్స్ సమాచారం ప్రకారం..

• డిస్‌ప్లే: 6.57 ఇంచుల AMOLED స్క్రీన్

• ప్రాసెసర్: MediaTek Dimensity 6400 Max (6nm)

• స్టోరేజ్: 12GB RAM + 256GB ROM

• AI ఫీచర్లు: AI Glare Remover, AI Edit Genie, AI Smart Remover 2.0, AI Live Photo

• బ్యాటరీ: 60W ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్‌బాక్స్ 80W అడాప్టర్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్

ధర విషయానికి వస్తే, బేస్ మోడల్ (8GB + 128GB) రూ.20,999 వద్ద ఉండవచ్చని అంచనా.

Related Articles

Related image1
ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ సేల్ : సామ్‌సంగ్, వివో, మోటరోలా, నథింగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
Related image2
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్
36
టెక్నో పోవా స్లిమ్ 5జీ (Tecno Pova Slim 5G)
Image Credit : pexels

టెక్నో పోవా స్లిమ్ 5జీ (Tecno Pova Slim 5G)

సెప్టెంబర్ 4, 2025న టెక్నో (Tecno) తన కొత్త Pova Slim 5G మోడల్‌ను ప్లిక్ కార్ట్ (Flipkart) ద్వారా విడుదల చేయనుంది. ఇది కేవలం 5.95mm మందం కలిగిన ప్రపంచంలోనే అతి సన్నని 5G ఫోన్‌గా రాబోతోంది.

• డిస్‌ప్లే: 6.78 ఇంచుల AMOLED (144Hz రిఫ్రెష్ రేట్)

• కెమెరా: డ్యూయల్ 50MP రియర్ కెమెరా, Dynamic Mood Light సపోర్ట్

• బ్యాటరీ: 5,200mAh, 45W ఛార్జింగ్

• చిప్‌సెట్: MediaTek Dimensity 7300 Ultimate (4nm)

Apple iPhone 17 Air సెప్టెంబర్ 9 వరకు రాకపోతే, ఇది ప్రపంచంలోనే అతి సన్నని స్మార్ట్‌ఫోన్ అవుతుంది.

46
మోటరోలా రెజర్ 60 స్పెషల్ ఎడిషన్ (Motorola Razr 60 Swarovski Edition)
Image Credit : Motorola India Twitter

మోటరోలా రెజర్ 60 స్పెషల్ ఎడిషన్ (Motorola Razr 60 Swarovski Edition)

సెప్టెంబర్ 1, 2025న మోటరోలా తన Razr 60 Brilliant Collection ను భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఇందులో Swarovski క్రిస్టల్స్ తో అలంకరించిన Razr 60 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ (Moto Buds Loop) ఉన్నాయి.

• ప్రాసెసర్: MediaTek Dimensity 7400X

• బ్యాటరీ: 4,500mAh, 30W వైర్డ్ + 15W వైర్‌లెస్ ఛార్జింగ్

• డిస్‌ప్లే: 6.9 ఇంచుల pOLED LTPO ఫోల్డబుల్, 3.63 ఇంచుల కవర్ స్క్రీన్

• కెమెరా: 50MP మెయిన్ + 13MP అల్ట్రావైడ్

ధర విషయానికి వస్తే, స్టాండర్డ్ Razr 60 భారతదేశంలో రూ.49,999 పైగా ఉండనుంది.

56
ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 Series)
Image Credit : Apple Hub | X

ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 Series)

ఆపిల్ (Apple) తన ఐఫోన్ (iPhone 17) సిరీస్ ను సెప్టెంబర్ 9 విడుదల చేయనుంది. ఇందులో నాలుగు మోడళ్లు ఉంటాయి..

1. iPhone 17

2. iPhone 17 Air

3. iPhone 17 Pro

4. iPhone 17 Pro Max

ప్రధాన అప్‌గ్రేడ్లు

• డిస్‌ప్లే: 6.3 ఇంచుల Super Retina XDR OLED, 120Hz ProMotion

• కెమెరా: 48MP మెయిన్ + 12MP అల్ట్రావైడ్, 24MP సెల్ఫీ

• ప్రాసెసర్: A19 చిప్

• ధర: ప్రారంభ ధర రూ.79,900 (అంచనా)

66
ఐక్యూ 15 మినీ (iQOO 15 Mini)
Image Credit : iQOO website

ఐక్యూ 15 మినీ (iQOO 15 Mini)

ఐక్యూ (iQOO) తన 15 సిరీస్ లో భాగంగా చిన్న స్క్రీన్ మోడల్ iQOO 15 Mini ని మార్కెట్ లోకి తీసుకురానుంది. లీక్స్ ప్రకారం ఇది 7000mAh బ్యాటరీ, Snapdragon 8 Elite 2 చిప్‌సెట్ తో రానుంది.

• డిస్‌ప్లే: 6.1–6.3 ఇంచుల ఫ్లాట్ స్క్రీన్

• iQOO 15 Ultra తో పాటు విడుదల అయ్యే అవకాశం ఉంది

ఈ మోడల్ ముఖ్యంగా OnePlus 15s తో పోటీ పడనుందని లీక్స్ పేర్కొంటున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved