Digital India: రీల్స్ చేయండి.. డబ్బులు గెలవండి.. కంటెంట్ క్రియేటర్లకు బంఫర్ ఆఫర్..
Digital India Reel: రీల్స్ రూపొందించే వారికి కేంద్రం బంఫర్ ఆఫర్ అందిస్తోంది. డిజిటల్ సేవల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని స్పెషల్ కాంపిటీషన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో గెలిచిన వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తోపాటు నగదు బహుమతి అందించబోతుంది.

రీల్స్ చేయండి.. డబ్బు గెలవండి
రీల్స్ లేదా వ్లాగ్స్ చేయడం మీకు అలవాటైతే.. ఇది మీకు ఓ గొప్ప అవకాశం. ‘డిజిటల్ ఇండియా’ పథకం 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ ఇండియా దశాబ్ది – రీల్ పోటీ’ పేరుతో ఓ స్పెషల్ కాంపిటీషన్‌ను ప్రారంభించింది. ఈ పోటీలో పాల్గొని సృజనాత్మకతను ప్రదర్శించిన వారు ₹15,000 వరకు నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం పొందుతారు. ఇది కేవలం నగదు బహుమతే కాదు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అరుదైన అవకాశం.
డిజిటల్ ఇండియాకు పదేళ్లు
డిజిటల్ ఇండియా పథకానికి 10 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మోదీ ప్రభుత్వం 'డిజిటల్ ఇండియా దశాబ్ది – రీల్ పోటీ' ప్రారంభించింది. ఇందులో భాగంగా, డిజిటల్ ఇండియా మీ జీవితం మీద చూపిన సానుకూల ప్రభావాన్ని చూపించే రీల్స్ లేదా వ్లాగ్స్ రూపొందించమని కోరుతున్నారు. విజేతలకు ₹15,000 వరకు నగదు బహుమతులు లభిస్తాయి.
ఆ అంశంపై రీల్స్
డిజిటల్ ఇండియా పథకం వల్ల ఆన్‌లైన్ సేవలు, ఇ-లెర్నింగ్, ఆరోగ్యం లేదా ఆర్థిక సేవల్లో మెరుగుదల జరిగిందని నమ్మితే.. ఈ అంశాలపై ఆధారంగా రీల్స్ తయారుచేసి ప్రభుత్వ పోటీలో పాల్గొనవచ్చు. మీ కంటెంట్ సృజనాత్మకంగా ఉంటే, గెలిచే అవకాశాలు మరింత పెరుగుతాయి.
పోటీలో పాల్గొనాలంటే ఇలా చేయండి!
డిజిటల్ ఇండియా రీల్ పోటీలో పాల్గొనాలనుకుంటే.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
- MyGov వెబ్‌సైట్ (లింక్: https://www.mygov.in/task/decade-digital-india-reel-contest) కి వెళ్లండి.
- 'డిజిటల్ ఇండియా దశాబ్ది – రీల్ పోటీ' లింక్‌ను క్లిక్ చేయండి.
- పాల్గొనడానికి లాగిన్ కావాలి – మీరు ఇమెయిల్, మొబైల్ నంబర్ లేదా సోషల్ మీడియా ఖాతా ద్వారా లాగిన్ అవవచ్చు.
ఒక్క రీల్‌తో నేషనల్ లెవల్ లో గుర్తింపు
డిజిటల్ ఇండియా దశాబ్ది రీల్ పోటీకి చివరి తేదీ ఆగస్టు 1, 2025. మీరు క్రియేట్ చేసిన రీల్‌ను సమర్పించిన తర్వాత, మీకు నిర్ధారణ కోసం ఒక ఇమెయిల్ లేదా మెసేజ్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందుకున్న రీల్స్‌లో నుండి టాప్ 10 బెస్ట్ రీల్స్ ఎంపిక చేసి, ఒక్కొక్కదానికి ₹15,000 నగదు బహుమతిని అందజేస్తుంది. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోండి.
ప్రైజ్ మనీ వివరాలు
ఈ జాతీయ స్థాయి పోటీలో కేవలం టాప్ 10 రీల్స్‌కి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా బహుమతులు లభిస్తాయి:
- టాప్ 10 విజేతలకు ఒక్కోరికి ₹15,000
- తదుపరి 25 మందికి ఒక్కోరికి ₹10,000
- మరో 50 మందికి ఒక్కోరికి ₹5,000
మొత్తంగా 85 మంది విజేతలకు ₹2 లక్షల బహుమతులు అందించనుంది కేంద్ర ప్రభుత్వం.