Personal Finance : అనుకోకుండా 1 లక్ష రూపాయలు మీకు కలిసి వచ్చాయా..అయితే ఇలా ఖర్చు చేసి చూడండి..?
ఒక్కోసారి మనకు అనుకోకుండా డబ్బులు ఉదాహరణకు ఉద్యోగంలో బోనస్ రావడం, ఆస్తి పంపకాల్లో డబ్బు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మీకు ఉద్యోగంలో ఒక లక్ష రూపాయల వరకు బోనస్ లభించింది అనుకుందాం. అప్పుడు ఆ లక్ష రూపాయలను ఏం చేయాలని మీకు ఆలోచన రావచ్చు.
చాలా మంది తమకు అనుకోకుండా లభించిన డబ్బును వృధా చేస్తుంటారు. కానీ ఆ డబ్బును సక్రమంగా వాడితే మీరు అనేక ఆర్థిక భారాల నుంచి బయటపడే మార్గం లభిస్తుంది. ఉదాహరణకు మీకు ఉద్యోగంలో బోనస్ కింద లక్ష రూపాయలు వచ్చాయి అనుకుందాం. అప్పుడు మీరు ఆ డబ్బును ఏ లాంగ్ ట్రిప్పుకు వెళ్లి రావడమో, కుటుంబంతో కలిసి ఇక చేయడానికి ఆ డబ్బులు వాడేస్తూ ఉంటారు. నిజానికి అలా డబ్బు వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా పెట్టుబడి చేస్తే మీ భవిష్యత్తుకు ఎలాంటి డోకా ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. మీరు మీ డబ్బును సరైన పెట్టుబడి పెట్టడం, ద్వారా ప్రస్తుత ద్రవ్యోల్బణం యుగంలో పెరుగుతున్న ఖర్చుల నుంచి బయటపడే మార్గం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
డబ్బును ఎలా నిర్వహించాలి:
ముందుగా మీ డబ్బు అవసరాన్ని పూర్తిగా అంచనా వేయడం ముఖ్యం. ఇది మాత్రమే కాదు, మీకు ఉపయోగపడే బఫర్ స్టాక్‌గా కొంత డబ్బును ఉంచుకోండి. మీరు బఫర్ స్టాక్‌ను కూడా అంచనా వేసినప్పుడు, ఆ తర్వాత మీ వద్ద మిగిలి ఉన్న డబ్బును ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో మీకు కొంత డబ్బు అవసరమని మీరు భావిస్తే, మీరు దానిని లిక్విడ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఉత్తమంగా ఉంటుంది..
రుణాలను తిరిగి చెల్లించడానికి ఉపయోగించవచ్చు
మీరు మీ అవసరాల కోసం తీసుకున్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడానికి మీకు లభించిన బోనస్ డబ్బును వాడవచ్చు. దీనితో, మీ వడ్డీ తగ్గుతుంది, మీ EMI భారం కూడా తగ్గుతుంది. మీరు ఆ డబ్బును వేరే చోట పెట్టుబడి పెట్టవచ్చు.
పిల్లల స్కూలు ఫీజులు చెల్లించవచ్చు..
మీకు బోనస్ గా వచ్చిన డబ్బులు స్కూల్ ఫీజులు చెల్లించడం ద్వారా మీపై ఆర్థిక భారం తగ్గించుకోవచ్చు. తద్వారా మీ సంవత్సర ఆదాయంలో డబ్బు ఆదా అవుతుంది అన్న సంగతి గుర్తించాల్సి ఉంటుంది.
ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు
ప్రస్తుతం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ వద్ద ఉన్న డబ్బును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టండి
మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఒక చక్కటి ప్రత్యామ్నాయమని చెప్పవచ్చు ఈ గోల్డ్ బాండ్స్ కేంద్ర ప్రభుత్వం జాడిచేస్తుంది ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు 2.5% వరకు వడ్డీ కూడా లభిస్తుంది పైగా బంగారం ధర పెరిగే కొద్దీ మీ బాండ్ విలువ కూడా పెరుగుతూ ఉంటుంది.