- Home
- Technology
- WiFi: ఇంట్లో వైఫై సరిగా రావట్లేదా? రౌటర్ ఈ ప్లేస్ లో పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని తెలుసా?
WiFi: ఇంట్లో వైఫై సరిగా రావట్లేదా? రౌటర్ ఈ ప్లేస్ లో పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని తెలుసా?
WiFi: ఇంట్లో వైఫై సరిగా పని చేయడం లేదా? అయితే.. ఇక చిన్న పని చేయడం వల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ రెట్టింపు చేయవచ్చు. కేవలం.. మీ ఇంట్లో వైఫై రూటర్ ప్లేస్ మారిస్తే సరిపోతుంది..

వైఫై సరిగా రావడం లేదా..?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో స్పెషల్ గా ఇంటర్నెట్ సదుపాయం పెట్టుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో వైఫై ఉండటం చాలా కామన్ అయిపోయింది. అయితే.. వేల రూపాయలు ఖర్చు పెట్టి WiFi పెట్టించుకున్నా కూడా.. సరిగ్గా ఇంటర్నెట్ రావడం లేదని ఫీలయ్యేవారు చాలా మంది ఉన్నారు. వెంటనే.. నెట్ సరిగా రావడం లేదని.. కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటారు. లేదంటే...ఇంకాస్త ఖరీదైన ప్లాన్ కి మారిపోతారు. కానీ.. అలా కాకుండా.. కేవలం.. మీ ఇంట్లో ఉన్న వైఫై రౌటర్ ప్లేసు ని మార్చడం వల్ల.. మీ ఇంటర్నెట్ స్పీడ్ రెట్టింపు అవుతుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం..
రౌటర్ ని ఇంట్లో ఎక్కడ ఉంచాలి..?
చాలా మంది ఇంట్లో రౌటర్ ఉంచే ప్రదేశం తప్పుగా పెడతారు. దీని వల్ల.. దానికి సరైన సిగ్నల్స్ అందగా.. ఇంటర్నెట్ సమస్య వస్తూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. ఇంట్లో ఓ మూలలో రౌటర్ ని పెట్టడం కాకుండా.. ఇంటి మధ్యభాగంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల.. అన్ని గదులకు ఇంటర్నెట్ సరిగ్గా వస్తుంది.
అంతేకాదు.. రౌటర్ ని ఎప్పుడూ పొరపాటున కూడా నేలపై ఉంచకూడదు. ఎక్కువ మంది వీటిని నేలపై లేదంటే.. టీవీ క్యాబినెట్ లో పెట్టేస్తూ ఉంటారు. అలాంటి పొరపాటు చేయకండి. దానికి బదులుగా, 5 నుంచి 7 అడుగుల ఎత్తులో షెల్ఫ్ లేదా గోడకు దగ్గరగా ఉంచితే.. సిగ్నల్ సరిగ్గా వస్తుంది. ఇంటర్నెట్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి.
ఇంట్లో వైఫై రౌటర్ ఉంటే సరిపోదు.. దానిని కొన్ని వస్తువులకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా, టీవీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంచాలి. ఇవి దగ్గరగా ఉంటే..ఇంటర్నెట్ లో అంతరాయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కబోర్డ్స్ లోపల.. పెద్ద అద్దాల వెనక రౌటర్ ని ఉంచకూడదు. ఇక.. రౌటర్ కి సంబంధించిన రెండు యాంటెనాలు.. సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి. అంటే.. ఒకటి నిలువుగా ఉంటే.. మరొకటి అడ్డంగా ఉండాలి. అప్పుడు సిగ్నల్స్ సరిగా వస్తాయి.
వైఫై స్పీడ్ పెంచే మరికొన్ని ట్రిక్స్..
రౌటర్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వైఫై స్పీడ్ సరిగా రావడం లేదు అంటే..మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 5GHz బ్యాండ్ అందుబాటులో ఉంటే దానిని ఉపయోగించాలి. దీనిని రౌటర్ కి దగ్గరగా పెట్టినప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ మరింత పెరుగుతుంది. అంతేకాదు..రౌటర్ సరిగా పని చేస్తున్నా కూడా.. వారానికి కనీసం రెండు సార్లు అయినా రీ స్టార్ట్ చేయాలి. అప్పుడు కూడా స్పీడ్ పెరుగుతుంది.

