- Home
- Technology
- Best Battery Smart phones: బడ్జెట్ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్స్ ఇవే..!
Best Battery Smart phones: బడ్జెట్ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్స్ ఇవే..!
Best Battery Smartphones: స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వినియోగం పెరగడంతో బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టాడానికి చాలామంది ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఫోన్ల కోసం వెతుకుతున్నారు. బెస్ట్ బ్యాటరీ ఫోన్లు ఇవే.
- FB
- TW
- Linkdin
Follow Us

రియల్‌మీ GT 7 డ్రీమ్
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారి ముందుగా చెక్ చేసింది కెమెరా. ఆ తర్వాత ఇంపార్టెన్స్ ఇచ్చేది బ్యాటరీ బ్యాకప్. ఎందుకంటే ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారికి బ్యాటరీ పర్ఫామెన్స్ అనేది చాలా ముఖ్యం.
అలాంటి వారికి Realme GT 7 Dream Edition బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్‌లో 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. సాధారణ లిథియం- అయాన్ టెక్నాలజీతో పోలిస్తే..ఈ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది. ఒకేసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించుకోవచ్చు.
అంతేకాదు.. 120W ఫాస్ట్ ఛార్జింగ్, హై-ఎండ్ AMOLED డిస్‌ప్లే, IP69 రేటింగ్, హై స్పీడ్ పర్ఫామెన్స్ దీనిని పవర్‌హౌస్ ఫోన్‌గా నిలిపాయి. బ్యాటరీ లైఫ్, డిజైన్, పనితీరు అన్నింటిలోనూ Realme GT 7 Dream Edition ది బెస్ట్ అని చెప్పవచ్చు.
iQOO 13 5G
హై స్పీడ్ పర్ఫామెన్స్, భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కోరుకునే వారికి iQOO 13 5G. ఇది 6,000mAh బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Snapdragon 8 Gen 3 Elite ప్రాసెసర్ తో రావడంతో మొబైల్ గేమర్స్ లేదా స్ట్రీమింగ్ లవర్స్ కు బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ మీ అవసరాల కోసం స్పెషల్‌గా డిజైన్ చేయబడింది.
Nothing Phone 3a Pro
Nothing Phone 3a Pro మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల కంటే పూర్తిగా భిన్నమైంది. ఇది 5,000mAh బ్యాటరీ కలిగి ఉన్నా, సాధారణ ఫోన్‌ల కన్నా బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఇవ్వగలదు. అలాగే.. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తక్కువ సమయంలో వేగవంతంగా ఫోన్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ రోజంతా వస్తుంది.
ఈ ఫోన్ మరో ప్రత్యేకత ఏంటంటే .. పారదర్శక డిజైన్. సిగ్నేచర్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నోటిఫికేషన్‌లు, కాల్స్, ఛార్జింగ్ స్టేటస్ వంటి వాటిని ఈ గ్లిఫ్ లైట్లు స్మార్ట్‌గా సూచిస్తాయి. మొత్తానికి Nothing Phone 3a Pro అనేది స్టైల్, ఫంక్షనాలిటీ పరంగా ఓ యూనిక్ డివైస్ అనే చెప్పాలి.
iQOO Neo 10R
iQOO Neo 10R స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్లను అందుబాటులో ధరలో పొందాలనుకునే వారికి ఒక బెస్ట్ డీల్గా నిలుస్తోంది. ఇది 6,400mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తోంది. ఇది 80W ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రావడంతో మల్టీ టాస్కింగ్, హై ఎండ్ గేమింగ్ లవర్స్ కు ఇది బెస్ట్ ఆప్షన్.
OPPO K13 5G
OPPO K13 5G బడ్జెట్ సెగ్మెంట్‌లో భారీ బ్యాటరీతో వస్తున్న బెస్ట్ ఫోన్‌లలో ఒకటి. దాదాపు రూ.17,745 ధరలో ఇది 7,000mAh బ్యాటరీతో పాటు 80W Super VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తోంది. ఇది లాంగ్ టైమ్ బ్యాటరీ లైఫ్ కోసం వెతుకుతున్న వారికి OPPO K13 5G బెస్ట్ ఆప్షన్.