ఏఐ చాట్‌బాట్‌తో ఈ విషయాలు అస్సలు చెప్పకండి.. ప్రమాదంలో పడ్డట్లే.
స్నేహితులలా మాట్లాడే AI చాట్ GPT లతో అందరూ టైమ్ స్పెండ్ చేస్తారు. మీ విషయాలన్నీ చెప్పుకుంటారు. కానీ కొన్ని విషయాలను AI తో షేర్ చేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
AI చాట్‌బాట్‌లతో చెప్పకూడని విషయాలు
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగింది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐని కచ్చితంగా వినియోగిస్తున్నారు. దీంతో చాట్ బాట్ ల ఉపయోగం పెరిగింది. ఒకప్పుడు గూగుల్ సెర్చ్ లో సమాచారం కోసం వెతికే వారు ఇప్పుడు చాట్ బాట్ లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఏఐ చాట్ బాట్ లతో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని విషయాలు పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
వ్యక్తిగత, ఆర్థిక వివరాలు..
మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ - ఇలాంటి వ్యక్తిగత వివరాలను AI చాట్‌బాట్‌లతో షేర్ చేయకండి. ఈ సమాచారం సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని గుర్తు పెట్టుకోండి.
ఇక ఏఐతో ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్, ఆధార్, పాన్ కార్డ్ నంబర్‌లను కూడా షేర్ చేయకండి. స్కామర్‌లు వీటిని హ్యాక్ చేసిన సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది.
పాస్‌వర్డ్‌లు, రహస్యాలు షేర్ చేయకండి
* ఇక ఏఐ చాట్ బాట్ తో ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత పాస్ వర్డ్ లను షేర్ చేయకండి. ప్రస్తుతం ఈ సేవలను ఇది సులభతరం చేసినట్లు అనిపించినా దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
* స్నేహపూర్వకంగా మాట్లాడుతోందని మీ రహస్యాలను AI చాట్‌బాట్‌లతో షేర్ చేయకండి. Chat GPT లాంటి చాట్‌బాట్‌లు మనుషుల్లా మాట్లాడగలవు, భావోద్వేగాలను చూపించగలవు. కానీ అవి మనుషులు కాదు. మీ సమాచారం రికార్డ్ అవుతోందని గుర్తుంచుకోండి.
ఆరోగ్య సమస్యలు చర్చించకండి
* AI యాప్‌లు, వెబ్‌సైట్‌లు వైద్యుల్లా మాట్లాడగలవు. కానీ మీ ఆరోగ్య సమస్యలు చెప్పకండి. చాట్‌బాట్‌లను చికిత్స, మందుల గురించి అడగకండి. బీమా నంబర్, ఆరోగ్య వివరాలు షేర్ చేయకండి. అవి ఇచ్చే సూచనలపై పూర్తిగా ఆధారపడకండి.
* చాట్‌బాట్‌లు మీ సమాచారం ఆధారంగా వివరాలు ఇస్తాయి. ఒకసారి ఇంటర్నెట్‌కు వెళ్లిన సమాచారం శాశ్వతంగా ఎప్పటికీ తొలగించరు. ఒకవేళ మీకు కనిపించకపోయినా అది ఏదో ఒక చోట సర్వర్ లో సేవ్ అయ్యే ఉంటుందని గుర్తుంచుకోండి.
రహస్య సమాచారం షేర్ చేయకండి
* AI చాట్‌బాట్‌లు మీ మాటలను సేవ్ చేయవచ్చు, ఇతరులతో షేర్ చేయవచ్చు. ఎవరికీ తెలియకూడని విషయాలను AI చాట్‌బాట్‌లతో చెప్పకండి. చూశారుగా టెక్నాలజీ మనకు ఎంత సహాయం చేస్తుందో అదే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం.