MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Mobile Phone: మెబైల్ ఫోన్ ని ఇలా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త!

Mobile Phone: మెబైల్ ఫోన్ ని ఇలా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త!

Mobile Phone:స్మార్ట్‌ఫోన్ అందరి జీవితాల్లో భాగమైపోయింది. ఉదయం నుంచి రాత్రివరకు చాలామంది ఫోన్‌లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. ఈ అలవాటు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? ముఖ్యంగా తల వంచి ఫోన్ చూసేవారికి ఈ సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

2 Min read
Author : Kavitha G
Published : May 06 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొబైల్ ఫోన్ ని తలవంచి చూస్తే ఏమవుతుంది?
Image Credit : AI

మొబైల్ ఫోన్ ని తలవంచి చూస్తే ఏమవుతుంది?

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఫోన్ వాడుతున్నారు. అయితే తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడపై ఎంత ఒత్తిడి పడుతుందో చాలామందికి తెలియదు. సాధారణంగా మన మెడలో ఉన్న ఎముకల నిర్మాణం మన తల బరువును సపోర్ట్ చేస్తుంది. 

మన తల సుమారు 4 నుంచి 5 కిలోల బరువు ఉంటుంది. సరిగ్గా నిటారుగా ఉన్నప్పుడు ఈ బరువు మెడపై సమానంగా పడుతుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. కానీ మనం ఫోన్ చూడటానికి తలను ముందుకు వంచినప్పుడు పరిస్థితి మారిపోతుంది.

25
25 కేజీల వరకు..
Image Credit : Getty

25 కేజీల వరకు..

తల కొంచెం వంగితేనే మెడపై పడే ఒత్తిడి పెరుగుతుంది. సుమారు 15 డిగ్రీలు వంగితే మెడపై 10-12 కిలోల బరువు పడుతుంది. అదే 30 డిగ్రీలు వంగితే అది 18 కిలోలకు పెరుగుతుంది. మరీ ఎక్కువగా, అంటే 45 నుంచి 60 డిగ్రీలు వంచితే మెడపై సుమారు 25 కిలోల వరకు ఒత్తిడి పడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని సాధారణంగా “టెక్స్ట్ నెక్” అని కూడా అంటారు. ఇది ఒక కొత్త తరహా సమస్యగా మారుతోంది. రోజుకు గంటల తరబడి ఫోన్ చూస్తూ ఉండటం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

Related Articles

Related image1
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Related image2
Relationship: అత్త-కోడలి మధ్య బంధం బలంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!
35
ఏ సమస్యలు వస్తాయంటే?
Image Credit : Getty

ఏ సమస్యలు వస్తాయంటే?

మెడపై ఎక్కువ ఒత్తిడి పడితే ఫస్ట్ మెడ నొప్పి వస్తుంది. అది తేలికగా మొదలై దీర్ఘకాలంలో తీవ్రమవుతుంది. తర్వాత భుజాల నొప్పి, వెన్ను నొప్పి కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి, చేతుల్లో నొప్పి అనిపించవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే మెడలో డిస్క్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

45
శరీరానికి హానికరం
Image Credit : Getty

శరీరానికి హానికరం

అంతేకాదు ఈ తలవంచి ఫోన్ చూసే అలవాటు వల్ల మన శరీర భంగిమ(posture) కూడా చెడిపోతుంది. నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు కూడా తల ముందుకు వంగినట్టే ఉంటుంది. ఇది మొత్తం శరీరానికి హానికరం. అయితే ఈ సమస్యను నివారించడం అంత కష్టమేమి కాదు. కొన్ని చిన్న మార్పులు చేస్తే చాలా ప్రయోజనాలు పొందవచ్చు.

55
ఏం చేయాలంటే?
Image Credit : Asianet News

ఏం చేయాలంటే?

ఫోన్‌ను కిందికి వంగి చూసే బదులు కళ్ల స్థాయికి దగ్గరగా ఎత్తి పట్టుకోవాలి. ఇలా చేస్తే తలను వంచాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎక్కువ సేపు ఒకే పొజిషన్‌లో ఉండకూడదు. ప్రతి 20-30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలి. మెడకు సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. తలను నెమ్మదిగా ఎడమ, కుడి వైపుకు తిప్పడం, పైకి కిందికి కదిలించడం వంటివి చేయవచ్చు. ఇవి మెడ కండరాలను రిలాక్స్ చేస్తాయి. 

అలాగే నిద్రపోయేటప్పుడు సరైన దిండు ఉపయోగించడం కూడా ముఖ్యమే. చాలా ఎత్తైన లేదా చాలా తక్కువ దిండు వాడితే మెడపై ఒత్తిడి పెరుగుతుంది. ఫోన్ వినియోగాన్ని తగ్గించడం కూడా ఒక మంచి పరిష్కారం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించడం, మిగతా సమయాల్లో దూరంగా పెట్టడం ఆరోగ్యానికి మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gardening: మట్టి అవసరం కూడా లేకుండా ఈజీగా మొక్కలు పెంచేయండి
Recommended image2
Gold Rings: ఒక్క గ్రాములో అమ్మాయిల కోసం సన్నని గోల్డ్ రింగ్
Recommended image3
Kitchen Sink: కిచెన్ సింక్ మూసుకుపోయిందా? ఈ చిన్న టిప్స్ నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది
Related Stories
Recommended image1
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Recommended image2
Relationship: అత్త-కోడలి మధ్య బంధం బలంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved