OnePlus Buds: 53 గంటల బ్యాటరీ బ్యాకప్ తో.. వన్ ప్లస్ బడ్స్ ప్రో-4 వచ్చేస్తోంది
OnePlus Buds: వన్‌ప్లస్ కొత్త ఫ్లాగ్షిప్ ఇయర్‌బడ్స్‌ను తీసుకొస్తోంది. OnePlus Buds Pro 4 పేరుతో వస్తున్న ఈ TWS ఇయర్‌బడ్స్ ఫీచర్లను లాంచ్‌కు ముందే కంపెనీ వెల్లడించింది. మరి దీంట్లో ఏమేం ఫీచర్లు ఉన్నాయో చూద్దాం.

వన్‌ప్లస్ బడ్స్ ప్రో 4
వన్‌ప్లస్ కొత్త ఫ్లాగ్షిప్ ఇయర్‌బడ్స్‌ను తీసుకొస్తోంది. OnePlus Buds Pro 4 పేరుతో వస్తున్న ఈ TWS ఇయర్‌బడ్స్ ఫీచర్లను లాంచ్‌కు ముందే కంపెనీ వెల్లడించింది. మరి దీంట్లో ఏమేం ఫీచర్లు ఉన్నాయో చూద్దాం. ఫీచర్లను లాంచ్‌కు ముందే గ్లోబల్ వెబ్సైట్లో పెట్టింది.
డెన్మార్క్‌కు చెందిన ఫేమస్ ఆడియో బ్రాండ్ 'డైనోడియో' (Dynaudio)తో కలిసి దీన్ని తయారు చేశారు. ఇందులో డ్యూయల్-డ్రైవర్ సెటప్, అడాప్టివ్ ఏఎన్సీ (Active Noise Cancellation), ఎల్హెచ్డీసీ 5.0 (LHDC 5.0) ఆడియో సపోర్ట్ ఉన్నాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఏకంగా 53 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఏఐ లైవ్ ట్రాన్స్లేషన్ లాంటి అదిరిపోయే ఫీచర్లు కూడా ఇందులో ఇచ్చారు.
నాయిస్ క్యాన్సిలేషన్, ఏఐ ఫీచర్స్
చుట్టుపక్కల వాతావరణానికి తగ్గట్టుగా నాయిస్‌ను తగ్గించే 'అడాప్టివ్ ఏఎన్సీ' ఇందులో ఉంది. ఇది బడ్స్ ప్రో 3 కంటే 2 రెట్లు ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను, 2.5 రెట్లు మెరుగైన వాయిస్ నాయిస్ రిడక్షన్ను ఇస్తుంది. ప్రతి ఇయర్‌బడ్‌లో 3 మైక్‌లు, VPU బోన్-కండక్షన్ సెన్సార్ ఉన్నాయి. క్లియర్ కాల్స్ కోసం ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ వాడారు. ఏఐ లైవ్ ట్రాన్స్లేషన్, క్లియర్ ఆడియో రికార్డింగ్ ఫీచర్లు ఇచ్చారు. (లైవ్ ట్రాన్స్లేషన్ కోసం ColorOS 17 ఆపై వెర్షన్ ఉన్న వన్‌ప్లస్ ఫోన్లు, ఆడియో రికార్డింగ్ కోసం వన్‌ప్లస్ 10 సిరీస్ ఆపై మోడల్స్ కావాలి). గూగుల్ జెమినీ వాయిస్ యాక్సెస్, మెడ ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే 'నెక్ హెల్త్' అలర్ట్, గేమింగ్ కోసం 39ms లో-లేటెన్సీ మోడ్ లాంటి స్పెషల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఆడియో, సౌండ్ క్వాలిటీ
ఇందులో 11mm కాంపోజిట్ వూఫర్, 6mm ప్లానార్ ట్వీటర్‌తో కూడిన డ్యూయల్-డ్రైవర్ సెటప్ ఇచ్చారు. ఇవి వేర్వేరు డ్యూయల్ DACల ద్వారా పనిచేస్తాయి. డైనోడియో టెక్నాలజీతో 30-లేయర్ సిరామిక్-మెటల్ డయాఫ్రమ్ వాడారు. దీనివల్ల పాత 'బడ్స్ ప్రో 3' కంటే 50% ఎక్కువ బేస్ వస్తుందని వన్‌ప్లస్ చెబుతోంది. LHDC 5.0 సపోర్ట్‌తో 24-bit/192kHz ఆడియో ప్లేబ్యాక్, 1Mbps బిట్రేట్ సపోర్ట్ చేస్తుంది. తల కదలికలను ట్రాక్ చేసే స్పేషియల్ ఆడియో, యూజర్ చెవి ఆకృతికి తగ్గట్టుగా సౌండ్ ఇచ్చే 'గోల్డెన్ సౌండ్' ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కనెక్టివిటీ, బ్యాటరీ లైఫ్
బ్లూటూత్ 6.1, గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ కనెక్షన్ ఫీచర్ ఉంది. AAC, SBC, LHDC, LC3 ఆడియో కోడెక్‌లను సపోర్ట్ చేస్తుంది. ఏఎన్సీ ఆఫ్ చేస్తే ఇయర్‌బడ్స్ 13 గంటలు, ఛార్జింగ్ కేస్‌తో కలిపి 53 గంటలు పనిచేస్తాయి. ఏఎన్సీ ఆన్ చేస్తే ఇయర్‌బడ్స్ 6 గంటలు, కేస్‌తో 26 గంటలు వస్తాయి. ఏఎన్సీ, LHDC రెండూ వాడితే 5.5 గంటలు, కేస్‌తో 22 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 14 గంటల పాటు వాడుకోవచ్చు. ఛార్జింగ్ కేస్ USB Type-C, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
డిజైన్, బరువు
ఈ ఇయర్‌బడ్స్ టైటానియం షాడో, పోలార్ వైట్ అనే రెండు కలర్స్‌లో వస్తున్నాయి. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఇయర్‌బడ్స్‌కు IP55 రేటింగ్ ఇచ్చారు (ఛార్జింగ్ కేస్‌కు రేటింగ్ లేదు). ఒక్కో ఇయర్‌బడ్ బరువు 5.6 గ్రాములు, ఛార్జింగ్ కేస్ బరువు 41.8 గ్రాములు ఉంటుంది. మొత్తం బరువు సుమారు 53 గ్రాములు. వన్‌ప్లస్ కంపెనీ ఈ 'బడ్స్ ప్రో 4' ఫీచర్లను గ్లోబల్ వెబ్సైట్లో పెట్టినా, దీని లాంచ్ డేట్, ధర, ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాలపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు.





