MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • Instagram: రీల్స్ చూసి చూసి వేళ్లు నొప్పులు పెడుతున్నాయా.? ఆటో స్క్రోల్ ఫీచ‌ర్ వ‌చ్చేస్తోంది

Instagram: రీల్స్ చూసి చూసి వేళ్లు నొప్పులు పెడుతున్నాయా.? ఆటో స్క్రోల్ ఫీచ‌ర్ వ‌చ్చేస్తోంది

సోషల్ మీడియా వినియోగంలో రీల్స్‌కి ప్రాధాన్యం పెరిగిపోయింది. చిన్నారుల నుంచి పెద్దల వ‌ర‌కు రీల్స్ చూస్తున్నారు. యూజ‌ర్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొంగొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చే ప‌నిలో ప‌డింది. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jul 21 2025, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రీల్స్‌లో కొత్త ఫీచ‌ర్
Image Credit : stockPhoto

రీల్స్‌లో కొత్త ఫీచ‌ర్

ఇన్‌స్టాగ్రామ్ విజ‌య‌వంతంలో రీల్స్ ఒక కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక రీల్ పూర్తికాగానే మ‌రో రీల్ చూడాలంటే స్క్రీన్‌పై స్క్రోల్ చేయాల‌నే విష‌యం తెలిసిందే. అయితే ఇక‌పై ఆ అవ‌స‌రం లేకుండా కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొస్తోంది ఇన్‌స్టాగ్రామ్‌.

ఆటో స్క్రోల్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచ‌ర్ స‌హాయంతో ఇక‌పై స్క్రోల్ చేయాల్సిన అవస‌రం ఉండ‌దు. ఒక వీడియో పూర్తవగానే దానంత‌ట‌దే తదుపరి వీడియోకి జంప్ అవుతుంది. దీని వల్ల యూజ‌ర్లు ప్ర‌తీ సారి స్క్రోల్ చేయాల్సిన ప‌ని ఉండ‌దు.

25
క్రియేటర్లకు లాభం
Image Credit : stockPhoto

క్రియేటర్లకు లాభం

ఈ ఫీచర్ వల్ల రీల్ క్రియేటర్లకు మంచి ప్రయోజనం ఉండనుంది. ఎందుకంటే వినియోగదారులు ఎక్కువ వీడియోలు చూడగలగడం వల్ల వ్యూస్‌ కూడా పెరిగే అవకాశం ఉంది. అలా అయితే అల్గారిథం‌లో రీచ్ మెరుగవుతుంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్, షార్ట్ న్యూస్, టెక్ టిప్స్ ఇచ్చే క్రియేటర్లకు ఇది మంచి అవకాశంగా మారనుంది.

Related Articles

Related image1
Fact: ఆవులు మాంసాహారం తింటే ఎక్కువ పాలు ఇస్తాయా.? అమెరికాలో ఎందుక‌లా చేస్తారు.?
Related image2
Hyderabad: ఇక్క‌డ పెట్టుబ‌డి పెడితే మీ ఫ్యూచ‌ర్ బిందాస్‌.. రూ. 15వేల‌కే గ‌జం, హైద‌రాబాద్‌కు అత్యంత చేరువలో
35
హెచ్చ‌రిస్తోన్న నిపుణులు
Image Credit : stockPhoto

హెచ్చ‌రిస్తోన్న నిపుణులు

అయితే ఈ ఆటో స్క్రోల్ వ‌ల్ల స‌మ‌స్య కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనివ‌ల్ల స్క్రీన్ టైమ్ మ‌రింత ఎక్కువ‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. చేతితో స్క్రోల్ చేయాలంటే కొంతకైనా బ్రేక్ ఉంటుంది. కానీ ఆటో స్క్రోల్ వల్ల కంటెంట్ నిరంతరం కొనసాగుతుండటంతో డిజిటల్ అడిక్షన్ పెరిగే ప్రమాదం ఉందని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ముఖ్యంగా టీనేజర్లు, యువతలో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.

45
టెస్టింగ్ ద‌శ‌లో ఉన్న ఫీచ‌ర్
Image Credit : stockPhoto

టెస్టింగ్ ద‌శ‌లో ఉన్న ఫీచ‌ర్

ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను ఇప్పుడు కొంత‌మంది ఎంపిక చేసిన యూజర్లతో ప‌రీక్షిస్తోంది. యూజర్ బిహేవియర్, యూజ్‌ టైం, ఎంగేజ్‌మెంట్ లాంటి అంశాలను విశ్లేషించిన తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. టెస్టింగ్ సక్సెస్ అయితే వచ్చే నెలలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

55
ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..?
Image Credit : stockPhoto

ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..?

ఆటో స్క్రోల్ ఫీచర్ ఉపయోగించే సమయంలో టైమ్ లిమిట్ సెట్టింగ్ పెట్టుకోవడం మంచిది. ప్రతి రీల్‌కి మధ్యలో ఒకసారి బ్రేక్ తీసుకోవడం అవసరం. చిన్నపిల్లల ఫోన్లలో పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్లను యాక్టివ్ చేయాలి. టెక్నాల‌జీ అనేది ఎంత అడ్వాన్స్‌డ్ అయినా స‌రే క‌చ్చితంగా లిమిట్ అంటూ ఉండాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Smartphones Under 10K : రూ. 10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. కెమెరా, బ్యాటరీ సూపర్ !
Recommended image2
Viral News: ‘మీరు చ‌నిపోయారా’.? యువత పెద్ద ఎత్తున ఈ యాప్‌ను ఎందుకు డౌన్‌లోడ్ చేస్తోంది
Recommended image3
Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?
Related Stories
Recommended image1
Fact: ఆవులు మాంసాహారం తింటే ఎక్కువ పాలు ఇస్తాయా.? అమెరికాలో ఎందుక‌లా చేస్తారు.?
Recommended image2
Hyderabad: ఇక్క‌డ పెట్టుబ‌డి పెడితే మీ ఫ్యూచ‌ర్ బిందాస్‌.. రూ. 15వేల‌కే గ‌జం, హైద‌రాబాద్‌కు అత్యంత చేరువలో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved