MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్‌కు ఏమైంది? CSK కెప్టెన్ మైండ్‌లో ఏం నడుస్తోంది?

Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్‌కు ఏమైంది? CSK కెప్టెన్ మైండ్‌లో ఏం నడుస్తోంది?

Ruturaj Gaikwad : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ జట్టును ఆందోళనలో పడేసింది. వరుస ఓటములకు తోడుగా కీలక ప్లేయర్లు ఫామ్ లో లేకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అసలు రుతురాజ్ గైక్వాడ్ కు ఏమైంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 20 2026, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ 2026లో రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు రాణించడం లేదు?
Image Credit : AFP

ఐపీఎల్ 2026లో రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు రాణించడం లేదు?

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రయాణం ఎత్తుపల్లాలతో సాగుతోంది. జట్టు ప్రదర్శన ఒకెత్తు అయితే, ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గత సీజన్లలో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్, ఈసారి మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో రుతురాజ్ ఫెయిల్యూర్ వెనుక ఉన్న కారణాలను టీమిండియా వెటరన్ స్పిన్నర్, మాజీ సీఎస్కే స్టార్ ఆర్ అశ్విన్ విశ్లేషించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సన్‌రైజర్స్‌పై చేజారిన సూపర్ ఛాన్స్
Image Credit : ANI

సన్‌రైజర్స్‌పై చేజారిన సూపర్ ఛాన్స్

శనివారం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ మెరుపు హాఫ్ సెంచరీలతో 194/9 పరుగులు చేసింది. ఛేదనలో యువ ఓపెనర్ ఆయుష్ మ్హాత్రే కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసి సీఎస్కేకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. పవర్‌ప్లేలో జట్టు బలమైన స్థితిలో ఉన్నప్పుడు ఫామ్‌లోకి రావడానికి రుతురాజ్‌కు ఇది సరైన సమయమని అశ్విన్ అభిప్రాయపడ్డారు. కానీ రుతురాజ్ 13 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

36
గైక్వాడ్ ఫామ్ పై అశ్విన్ ఏమన్నారంటే?
Image Credit : ANI

గైక్వాడ్ ఫామ్ పై అశ్విన్ ఏమన్నారంటే?

జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ విశ్లేషణ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ, "రుతురాజ్ పరుగులు సాధించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆయుష్ మ్హాత్రే విధ్వంసకరంగా ఆడటంతో గైక్వాడ్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం క్రీజులో సమయం గడుపుతూ ఫామ్‌లోకి రావాల్సింది. కానీ మ్హాత్రే అవుటైన తర్వాత రుతురాజ్ ఒక మంచి బంతికి పెవిలియన్ చేరాడు. నిజానికి పుల్ షాట్ ఆడే విషయంలో అతన్ని కొట్టడం అంత సులభం కాదు. అయితే ప్రస్తుతం రుతురాజ్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని నాకు అనిపిస్తోంది. అతని మైండ్ కాస్త అయోమయంలో ఉంది" అని కుండబద్దలు కొట్టారు.

46
కెప్టెన్సీ భారం.. వరుస ఓటములు
Image Credit : AFP

కెప్టెన్సీ భారం.. వరుస ఓటములు

రుతురాజ్ ఫామ్ కోల్పోవడం ఒకవైపు, జట్టు పరాజయాలు మరోవైపు అతన్ని వేధిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌ను సీఎస్కే వరుసగా మూడు ఓటములతో ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచి మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్ళీ ఓటమి పాలైంది. ధోనీ తప్పుకున్న తర్వాత ఒక పెద్ద ఫ్రాంచైజీని నడిపించడం, వ్యక్తిగత ప్రదర్శన సరిగ్గా లేకపోవడం రుతురాజ్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

56
గైక్వాడ్ గణాంకాలు మరింత పడిపోయాయి
Image Credit : AFP

గైక్వాడ్ గణాంకాలు మరింత పడిపోయాయి

ఈ సీజన్ లో ఇప్పటివరకు గైక్వాడ్ ఆరు మ్యాచ్‌లలో కేవలం 13.67 సగటుతో 82 పరుగులు మాత్రమే చేశాడు. ఇది అతని స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శన. 2021లో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన ఆటగాడు, ఇప్పుడు కనీసం 20 పరుగులు చేయడానికి కూడా కష్టపడుతుండటం గమనార్హం. ఒత్తిడి కారణంగానే అతను షాట్ సెలక్షన్‌లో తప్పులు చేస్తున్నాడని, క్రీజులో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడని అశ్విన్ వ్యాఖ్యానించారు.

66
ముంబై ఇండియన్స్‌తో కీలక పోరు
Image Credit : ANI

ముంబై ఇండియన్స్‌తో కీలక పోరు

సీఎస్కే తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 23న చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. ముఖ్యంగా కెప్టెన్ గైక్వాడ్ తన మనసులోని ఆందోళనలను పక్కన పెట్టి, గతంలో లాగా నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. అప్పుడే చెన్నై మళ్ళీ విజయాల బాట పట్టే అవకాశం ఉంటుంది. గైక్వాడ్ తన ఫామ్‌ను తిరిగి పొంది విమర్శకులకు సమాధానం చెబుతాడో లేదో వేచి చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Related Stories
Recommended image1
IPLలో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. ఒకే ఏడాదిలో 10 సూపర్ రికార్డులు సాధించిన 15 ఏళ్ల కుర్రాడు !
Recommended image2
Priyansh Arya : సెంచరీ మిస్.. ప్రీతి జింటా గుండె బద్దలు ! ఎవరీ రన్ బాజ్ ప్రియాంష్‌ ఆర్య?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved