MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • IPLలో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. ఒకే ఏడాదిలో 10 సూపర్ రికార్డులు సాధించిన 15 ఏళ్ల కుర్రాడు !

IPLలో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. ఒకే ఏడాదిలో 10 సూపర్ రికార్డులు సాధించిన 15 ఏళ్ల కుర్రాడు !

Vaibhav Suryavanshi : భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అడుగుపెట్టి ఏడాది పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది కాలంలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీతో పాటు 10 అద్భుతమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 19 2026, 09:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బుమ్రాకే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు.. ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ రికార్డుల సునామీ
Image Credit : ANI

బుమ్రాకే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు.. ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ రికార్డుల సునామీ

క్రికెట్ ప్రపంచంలో అనుభవం ఉంటేనే రికార్డులు వస్తాయని అందరూ అంటుంటారు. కానీ, ఆ మాట అబద్ధమని నిరూపించాడు బీహార్‌కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. సరిగ్గా ఏడాది క్రితం, అంటే 2025 ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు, కేవలం 365 రోజుల్లోనే రికార్డుల బుక్కును తిరగరాశాడు.

ఐపీఎల్‌లో తన తొలి ఏడాదిని పూర్తి చేసుకున్న వైభవ్, మైదానంలో పరుగుల వరద పారించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదడం నుంచి, ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తొలి బంతికే సిక్సర్ కొట్టడం వరకు వైభవ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అత్యంత పిన్న వయసులో కోటీశ్వరుడిగా రికార్డు
Image Credit : Getty

అత్యంత పిన్న వయసులో కోటీశ్వరుడిగా రికార్డు

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్‌ను రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో అతని వయస్సు కేవలం 13 ఏళ్లు మాత్రమే. దీనితో ఐపీఎల్ చరిత్రలో కాంట్రాక్ట్ పొందిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఆ వేలంలో ఈ కుర్రాడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడటం చూసి క్రికెట్ లోకం ఆశ్చర్యపోయింది.

Related Articles

Related image1
Yuvraj : 6 బంతుల్లో 6 సిక్సర్లు.. యువరాజ్ సింగ్ అందుకున్న గిఫ్ట్ ఏంటో తెలుసా?
Related image2
Team India Captain: సూర్యకుమార్ ఔట్.. శ్రేయాస్ అయ్యర్ ఇన్! పంజాబ్ హీరోకు పట్టాభిషేకం
36
తొలి బంతికే సిక్సర్.. అత్యంత పిన్న వయసులో అరంగేట్రం
Image Credit : ANI

తొలి బంతికే సిక్సర్.. అత్యంత పిన్న వయసులో అరంగేట్రం

2025 ఏప్రిల్ 19న లక్నోతో జరిగిన మ్యాచ్ ద్వారా వైభవ్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ రోజు అతని వయస్సు 14 ఏళ్ల 23 రోజులు మాత్రమే. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయసు ఆటగాడిగా నిలవడమే కాకుండా, తన కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. లక్నో ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ వేసిన బంతిని స్టాండ్స్‌లోకి పంపి తన ఎంట్రీని ఘనంగా ప్రారంభించాడు.

46
భారతీయుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. యూసుఫ్ పఠాన్ రికార్డు బద్దలు
Image Credit : ANI

భారతీయుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. యూసుఫ్ పఠాన్ రికార్డు బద్దలు

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు, భారతీయుల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. 15 ఏళ్ల క్రితం యూసుఫ్ పఠాన్ (37 బంతులు) నెలకొల్పిన రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతను ఏకంగా 11 సిక్సర్లు బాది మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు.

56
బుమ్రాకు షాక్.. 15 ఏళ్లకే సూపర్ స్ట్రైకర్
Image Credit : ANI

బుమ్రాకు షాక్.. 15 ఏళ్లకే సూపర్ స్ట్రైకర్

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా పేరున్న జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం దిగ్గజ బ్యాటర్లకే కష్టం. కానీ వైభవ్ మాత్రం బుమ్రా వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. 15 ఏళ్ల వయసులో బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ కొట్టిన ఏకైక బ్యాటర్ వైభవ్ మాత్రమే. తన మొదటి సీజన్‌లో 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేసి సీజన్ సూపర్ స్ట్రైకర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

66
పది సార్లు 30+ స్కోర్లు.. దిగ్గజాలనే వెనక్కి నెట్టిన వైభవ్
Image Credit : BCCI

పది సార్లు 30+ స్కోర్లు.. దిగ్గజాలనే వెనక్కి నెట్టిన వైభవ్

ఐపీఎల్‌లో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత అత్యధిక సార్లు 30 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 10 సార్లు అతను 30 ప్లస్ స్కోర్లు సాధించాడు. ఈ విషయంలో ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టాడు. వీరందరూ 13 ఇన్నింగ్స్‌ల తర్వాత కేవలం 8 సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 498 పరుగులు చేసిన వైభవ్ ఖాతాలో 44 సిక్సర్లు, 42 ఫోర్లు ఉన్నాయి. ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువగా కొట్టడం ఈ కుర్రాడి పవర్ హిట్టింగ్‌కు నిదర్శనం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Related Stories
Recommended image1
Yuvraj : 6 బంతుల్లో 6 సిక్సర్లు.. యువరాజ్ సింగ్ అందుకున్న గిఫ్ట్ ఏంటో తెలుసా?
Recommended image2
Team India Captain: సూర్యకుమార్ ఔట్.. శ్రేయాస్ అయ్యర్ ఇన్! పంజాబ్ హీరోకు పట్టాభిషేకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved