MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026: ఎవడ్రా బాబు వీడు.. గేల్ రికార్డ్ ఖతం.. బెంగళూరులో సాయి సుదర్శన్ శివతాండవం!

IPL 2026: ఎవడ్రా బాబు వీడు.. గేల్ రికార్డ్ ఖతం.. బెంగళూరులో సాయి సుదర్శన్ శివతాండవం!

Sai Sudharsan : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసి క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేస్తూ సెంచరీతో మెరిశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 24 2026, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IPL 2026: సాయి సుదర్శన్ సంచలనం.. బెంగళూరులో ఊచకోత
Image Credit : X

IPL 2026: సాయి సుదర్శన్ సంచలనం.. బెంగళూరులో ఊచకోత

ఐపీఎల్ 2026లో యువ సంచలనం, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో బౌలర్లను ఉతికేస్తూ అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక బిగ్ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన సాయి సుదర్శన్
Image Credit : ANI

క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన సాయి సుదర్శన్

సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 48 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా, సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే 2000 పరుగుల మార్కును దాటేశాడు. ఈ జాబితాలో షాన్ మార్ష్ (52 ఇన్నింగ్స్), రుతురాజ్ గైక్వాడ్ (57 ఇన్నింగ్స్), కేఎల్ రాహుల్ (60 ఇన్నింగ్స్) వంటి దిగ్గజాలను సుదర్శన్ వెనక్కి నెట్టాడు.

35
చిన్నస్వామి స్టేడియంలో సెంచరీతో దుమ్మురేపిన సాయి సుదర్శన్
Image Credit : Facebook

చిన్నస్వామి స్టేడియంలో సెంచరీతో దుమ్మురేపిన సాయి సుదర్శన్

ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ 58 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్‌లో ఇది అతనికి మూడో సెంచరీ కావడం విశేషం. ఆరంభంలో కాస్త తడబడినట్లు కనిపించినా, ఒక్కసారి సెట్ అయ్యాక ఆర్సీబీ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. జోష్ హాజిల్‌వుడ్ వేసిన ఓవర్‌లో స్కూప్ షాట్‌తో ఫోర్ కొట్టి, ఆపై పాయింట్ మీదుగా సిక్సర్ బాది తన ఫామ్‌ను చాటుకున్నాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌తో సిక్సర్ కొట్టి 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

45
గిల్ - సుదర్శన్ రికార్డ్ భాగస్వామ్యం
Image Credit : ANI

గిల్ - సుదర్శన్ రికార్డ్ భాగస్వామ్యం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు గుజరాత్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మొదటి వికెట్‌కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో వీరికి ఇది 8వ సారి వంద పరుగుల భాగస్వామ్యం. ఓపెనర్లుగా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన జాబితాలో వీరు రెండో స్థానానికి చేరుకున్నారు. గిల్ 24 బంతుల్లో 32 పరుగులు చేసి స్ట్రైక్ రొటేట్ చేయడానికే పరిమితం కాగా, సుదర్శన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.

55
భారత ఆటగాళ్లలో మరో ఘనత
Image Credit : ANI

భారత ఆటగాళ్లలో మరో ఘనత

అత్యంత వేగంగా అంటే ఎదుర్కొన్న బంతుల పరంగా 2000 పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సుదర్శన్ ఆరో స్థానంలో నిలిచాడు. సుదర్శన్ 1361 బంతుల్లో ఈ ఘనత సాధించగా, అభిషేక్ శర్మ (1193 బంతులు) మొదటి స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీపై ఐపీఎల్ సెంచరీ చేసిన 14వ బ్యాటర్‌గా, గుజరాత్ టైటాన్స్ తరపున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా అంటే గిల్ తర్వాత సుదర్శన్ నిలిచాడు. చివరకు హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సుదర్శన్ 100 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Team India : 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా రెడీ.. రోహిత్, కోహ్లీ ఉంటారా? ఆ ముగ్గురికి షాక్ !
Recommended image2
QR Code Scams: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి, లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved