MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • టీమిండియా జెర్సీ నీలి రంగులోనే ఎందుకుంటుంది..? ఏ నలుపో, తెలుపో ఎందుకుండదు?

టీమిండియా జెర్సీ నీలి రంగులోనే ఎందుకుంటుంది..? ఏ నలుపో, తెలుపో ఎందుకుండదు?

Team India Jersey : భారత క్రికెటర్లే కాదు హాకీ, కబడ్డి, ఫుట్ బాల్ ప్లేయర్స్ కూడా నీలి రంగు జెర్సీల్లోనే మైదానంలో కనిపిస్తారు. మరి ఈ బ్లూ కలర్ ను ఎక్కడినుండి తీసుకున్నారో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 13 2026, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియన్ జెర్సీ నీలిరంగు స్టోరీ..
Image Credit : Getty

ఇండియన్ జెర్సీ నీలిరంగు స్టోరీ..

India Jersey : ఇండియన్ క్రికెట్ అనగానే ముందుగా నీలిరంగు దుస్తుల్లో మెరిసిపోయే క్రికెటర్లు గుర్తుకువస్తారు. అది సాధారణ మ్యాచ్ అయినా, వరల్డ్ కప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ అయినా... జెర్సీపై లోగోలు మారవచ్చు కానీ రంగు మాత్రం అదే. ఈ జెర్సీ ప్రజల్లోకి ఎంతలా వెళ్లిందంటే ఇండియన్ టీం ను ''మెన్ ఇన్ బ్లూ'' అని పిలుచుకుంటున్నారు. కేవలం క్రికెట్లోనే కాదు ఇండియన్ హాకీ, ఫుట్ బాల్, కబడ్డి వంటి క్రీడల్లోనూ అధికారిక జెర్సీ నీలి రంగులోనే ఉంటుంది. ఇలా ఇండియా నీలిరంగు జెర్సీనే ఎందుకు ఉపయోగిస్తోంది..? ఏ తెలుపు, నలుపు, ఎరుపు రంగే జెర్సీని ఎందుకు ఉపయోగించదు? అనే డౌట్ రావచ్చు. ఇందుకు కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జాతీయ జెండా నుండే నీలం జెర్సీ...
Image Credit : X@BCCI

జాతీయ జెండా నుండే నీలం జెర్సీ...

క్రికెట్ లోనే కాదు ఇతర క్రీడల్లోనూ చాలా దేశాలు తమ జాతీయ జెండాలోని రంగులను ఉపయోగిస్తాయి. ఇలా పాకిస్థాన్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా వంటి క్రికెట్ టీమ్స్ జెర్సీలు జాతీయ జెండా రంగుల్లో ఉంటాయి... కానీ భారత్ జాతీయ జెండాలో ప్రధానంగా కనిపించే కాషాయం, ఆకుపచ్చ, తెలుపు రంగులను ఉపయోగించడంలేదు. ఈ త్రివర్ణ పతాకం మధ్యలో ఉండే అశోకచక్రం నీలి రంగులో ఉంటుంది... దీన్ని క్రీడాకారుల జెర్సీ కోసం ఉపయోగిస్తోంది ఇండియా.

ఆస్ట్రేలియా క్రికెట్ టీం కూడా తమ జెర్సీ రంగును జాతీయ జెండానుండే తీసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇండియా మాదిరిగానే ప్రధానమైన రంగును కాకుండా జెండాలో ఉండే నేషనల్ ప్లవర్ గోల్డెన్ వాటిల్ రంగును తీసుకుంది. అందుకే ఆసిస్ క్రికెటర్లు పసుపు జెర్సీలో కనిపిస్తారు.

35
జాతీయ జెండాలోని కాషాయం, ఆకుపచ్చ, తెలుపు ఎందుకు వాడలేదు..?
Image Credit : X@BCCI

జాతీయ జెండాలోని కాషాయం, ఆకుపచ్చ, తెలుపు ఎందుకు వాడలేదు..?

భారత జాతీయ జెండాలో ప్రధానంగా కాషాయం, ఆకుపచ్చ, తెలుపు రంగులు ఉంటాయి... వాటిని టీమిండియా జెర్సీ కోసం ఉపయోగించకపోవడానికి కారణాలున్నాయి. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ అన్ని దేశాలు తెలుపు రంగు జెర్సీని వాడతాయి. కాబట్టి టీమిడింయా తెలుపు రంగు జెర్సీని ఉపయోగించలేదు. ఇక కాషాయం అనేది హిందుత్వ రంగుగా గుర్తింపుపొందింది... అలాగే కొన్ని రాజకీయ పార్టీల జెండాలు కూడా ఈ రంగులో ఉంటాయి. క్రీడలు కులమతాలు, రాజకీయాలకు అతీతమైనవి కాబట్టి కాషాయం వాడలేదు. ఇక పసుపు రంగు దుస్తులను పాకిస్థాన్ వంటి దేశాలు వాడుతున్నాయి. దీన్ని వాడలేం. అందుకే జాతీయ జెండాలోని అశోక చక్రం రంగును జెర్సీ కోసం ఉపయోగించారు.

45
నీలిరంగు దేనికి సంకేతం.. ?
Image Credit : Getty

నీలిరంగు దేనికి సంకేతం.. ?

నీలిరంగు అనేది శాంతి, నమ్మకం, జ్ఞానం, భద్రతకు సంకేతం. క్రీడలు అనేవి జెంటిల్ మెన్ గేమ్స్... ఇందులో ప్రతిభతో పాటు నమ్మకం కూడా చాలా ముఖ్యం. అలాగే క్రీడాకారులు తమ ఆటతీరులో స్థిరత్వం కలిగి ఉండాలి... కొన్ని క్రీడలు బలంతో కాకుండా తెలివితో ఆడాల్సి ఉంటుంది. ఇక క్రీడల్లో గాయాలు సర్వసహయం... అందుకే క్రీడాకారుల రక్షణ చాలా ముఖ్యం. ఇవన్నీ క్రీడాకారుల్లో ఉండాలనే సంకేతం కూడా నీలి రంగు జెర్సీలో ఉంది.

గతంలో భారత క్రికెటర్లు వేరువేరు రంగులు జెర్సీలు వాడేవారు... కానీ 1990 ప్రారంభం నుండి భారత జట్టు నీలిరంగు జెర్సీలను ధరిస్తోంది. అయితే ఇటీవల వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్ కోసం బిసిసిఐ కొత్త జెర్సీలను రూపొందిస్తోంది... ఇందులో నీలం రంగుతో పాటు కాషాయం, తెలుపు వంటి ఇతర రంగులను వాడుతున్నారు.

55
బిసిసిఐ లోగో కూడా అశోక చక్రం స్పూర్తితోనే..
Image Credit : Getty

బిసిసిఐ లోగో కూడా అశోక చక్రం స్పూర్తితోనే..

భారత క్రికెట్ ను నడిపించే క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) లోగోను పరిశీలిస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది... ఇది అశోకచక్రంను పోలి ఉంటుంది. దీని స్పూర్తితోనే బిసిసిఐ లోగోను రూపొందించారు. ఇలా జాతీయ జెండాలోని అశోక చక్రం రూపాన్ని, రంగును మన అంతర్జాతీయ మెన్స్, ఉమెన్స్ టీం కోసం ఉపయోగిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image2
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image3
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Related Stories
Recommended image1
Now Playing
India Win T20 World Cupబౌలింగ్ఎటాక్ అంటే ఇదేFans Reaction | Bumrah, Axar Patel | Asianet News Telugu
Recommended image2
ICC T20 Rankings : వరల్డ్ కప్ ముగిసినా పాక్ ను వదలనంటున్న ఇషాన్, ఆ ఒక్కటీ లాగేసుకున్నాడుగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved