MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Shivam Dube : రైలులో ఇలా వస్తాడని ఊహించలేదు.. వరల్డ్ కప్ హీరో సీక్రెట్ జర్నీ

Shivam Dube : రైలులో ఇలా వస్తాడని ఊహించలేదు.. వరల్డ్ కప్ హీరో సీక్రెట్ జర్నీ

Shivam Dube : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అహ్మదాబాద్ నుండి ముంబైకి రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 12 2026, 11:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రైలు అప్పర్ బెర్త్‌పై టీమిండియా యాక్షన్ హీరో
Image Credit : Getty

రైలు అప్పర్ బెర్త్‌పై టీమిండియా యాక్షన్ హీరో

Shivam Dube travels in Train : కోట్ల రూపాయల కాంట్రాక్టులు.. బౌండరీల అవతల పడే సిక్సర్లు.. గెలిచింది సాదాసీదా కప్పు కాదు, ఏకంగా టి20 వరల్డ్ కప్. స్టేడియంలో లక్ష మంది 'దూబే.. దూబే' అని అరుస్తుంటే, ఆకాశమే హద్దుగా సంబరాలు చేసుకున్న ఈ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, మరుసటి రోజే అందరినీ ఆశ్చర్యపరిచారు.

సెలబ్రిటీ హోదా, చార్టర్డ్ ఫ్లైట్స్, లగ్జరీ కార్లు.. ఇవేవీ ఆయన కళ్ళకు కనిపించలేదు. తన కళ్ళ ముందు కనిపించింది కేవలం తన ఇద్దరు చిన్న పిల్లలే. వాళ్లను త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో, విమానం టిక్కెట్లు దొరకకపోయినా వెనకడుగు వేయలేదు. ఒక సామాన్య మధ్యతరగతి ప్రయాణికుడిలా ఏసీ 3-టైర్ రైలు ఎక్కి, అప్పర్ బెర్త్‌పై దుప్పటి కప్పుకుని ప్రయాణించిన దూబే తీరు చూస్తుంటే.. ఆయనలోని అసలైన సింప్లిసిటీకి నిదర్శనం. ఆ అండర్ కవర్ జర్నీ విశేషాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
విమానాలు లేక.. రైలు ప్రయాణం
Image Credit : Getty

విమానాలు లేక.. రైలు ప్రయాణం

మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష మందికి పైగా ప్రేక్షకుల మధ్య ‘దూబే.. దూబే’ అనే నినాదాలు మార్మోగాయి. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి, భారత్ స్కోరును 250 దాటించిన శివమ్ దూబే, ఆ మరుసటి రోజే ఒక సామాన్య ప్రయాణికుడిలా మారాల్సి వచ్చింది. ప్రపంచ విజేతగా నిలిచిన కొన్ని గంటలకే ఆయన ముంబై చేరుకోవడానికి రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

విశ్వవిజేతగా నిలిచిన తర్వాత సాధారణంగా క్రికెటర్లు చార్టర్డ్ ఫ్లైట్స్ లేదా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తారు. కానీ, అహ్మదాబాద్ నుండి ముంబైకి వెళ్లే విమానాలన్నీ ఫుల్ అయిపోయాయి. తన భార్య అంజూమ్, ఒక స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్లాలనుకున్న దూబేకు వేరే దారి లేకపోయింది. రోడ్డు మార్గంలో వెళ్లడం కంటే రైలు వేగంగా ఉంటుందని భావించి, అహ్మదాబాద్-ముంబై సయాజీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ 3-టైర్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. తన ఇద్దరు చిన్న పిల్లలు అయాన్ (4), మెహవిష్ (2)లను చూడాలనే ఆత్రుతతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related Articles

Related image1
Hardik Pandya : హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. జైలుకు వెళ్లే ఛాన్స్? అసలు మ్యాటర్ ఇదే !
Related image2
Sun Risers : సన్‌రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. ఎందుకు కావ్యా ఇలా చేశావు? రచ్చ స్టార్ట్ !
36
అప్పర్ బెర్త్‌పై దూబే అండర్ కవర్ ఆపరేషన్
Image Credit : ANI

అప్పర్ బెర్త్‌పై దూబే అండర్ కవర్ ఆపరేషన్

ప్రజలు గుర్తిస్తే రద్దీ పెరిగి ఇబ్బంది అవుతుందని భావించిన దూబే, ఒక పక్కా ప్లాన్ వేశారు. ముఖానికి మాస్క్, తలపై టోపీ, ఫుల్ స్లీవ్ టీ-షర్ట్ ధరించి గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డారు. తెల్లవారుజామున 5:10 గంటలకు రైలు కావడంతో ప్లాట్‌ఫారమ్‌పై రద్దీ తక్కువగా ఉంటుందని ఆశించారు. రైలు కదిలే 5 నిమిషాల ముందు వరకు కారులోనే వేచి ఉండి, చివరి నిమిషంలో లోపలికి వెళ్లారు. రైలు ఎక్కిన వెంటనే తన అప్పర్ బెర్త్ పైకి ఎక్కి, రైల్వే వారు ఇచ్చే బ్రౌన్ కలర్ దుప్పటిని కప్పుకుని పడుకున్నారు.

46
టీటీఈ అడిగిన ప్రశ్న.. భార్య సమయస్ఫూర్తి
Image Credit : Instagram/dubeshivam

టీటీఈ అడిగిన ప్రశ్న.. భార్య సమయస్ఫూర్తి

ఈ ప్రయాణంలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. టిక్కెట్ చెక్ చేయడానికి వచ్చిన టీటీఈ, చార్టులో పేరు చూసి "శివమ్ దూబే? ఇతను ఆ క్రికెటరేనా?" అని అడిగారు. వెంటనే దూబే భార్య అంజూమ్ స్పందిస్తూ.. "కాదు కాదు.. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు?" అని చాకచక్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆ టీటీఈ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రయాణం మధ్యలో ఒకసారి వాష్‌రూమ్‌కు వెళ్లినా, ఎవరూ గుర్తుపట్టకపోవడంతో దూబే ఊపిరి పీల్చుకున్నారు.

56
బోరివలిలో పోలీస్ ఎస్కార్ట్
Image Credit : Getty

బోరివలిలో పోలీస్ ఎస్కార్ట్

మధ్యాహ్నం ముంబైలోని బోరివలి స్టేషన్ చేరుకునే సమయానికి వెలుతురు ఎక్కువగా ఉండటంతో, జనం గుర్తుపడతారని దూబే భయం పడ్డారు. దీంతో ఆయన పోలీసుల సహాయం కోరారు. వరల్డ్ కప్ హీరో రైలులో వస్తున్నాడని తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. విమానాశ్రయం నుంచి వస్తున్నారేమో అనుకున్న వారికి, రైలులో వస్తున్నట్లు చెప్పడంతో షాక్ తిన్నారు. చివరకు పోలీస్ రక్షణతో ఆయన సురక్షితంగా స్టేషన్ నుండి బయటకు వచ్చి తన ఇంటికి చేరుకున్నారు.

66
వరల్డ్ కప్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్
Image Credit : Getty

వరల్డ్ కప్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్

ఈ టోర్నీలో శివమ్ దూబే అద్భుతమైన ఆటతో అదరగొట్టారు. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ 9 మ్యాచ్‌ల్లో 235 పరుగులు చేశారు. ఆయన స్ట్రైక్ రేట్ 169.06గా ఉండటం గమనార్హం. 17 సిక్సర్లు, 15 ఫోర్లతో చెలరేగిన దూబే, తన తండ్రి రాజేష్ దూబేకు మెడల్ వేసి ‘నా జీవితంలో నిజమైన హీరో’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి పడ్డ కష్టమే తనను ఈ స్థాయికి చేర్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
Hardik Pandya : హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. జైలుకు వెళ్లే ఛాన్స్? అసలు మ్యాటర్ ఇదే !
Recommended image2
Sun Risers : సన్‌రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. ఎందుకు కావ్యా ఇలా చేశావు? రచ్చ స్టార్ట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved