MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • IPL 2026: ఆ ఇద్దరిపై రూ. 28.40 కోట్లు హాంఫట్.! CSKను తిట్టిపోస్తున్న నెటిజన్లు..

IPL 2026: ఆ ఇద్దరిపై రూ. 28.40 కోట్లు హాంఫట్.! CSKను తిట్టిపోస్తున్న నెటిజన్లు..

IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ వైఫల్యం, అలాగే ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మల భారీ ధర, వారి పేలవ ప్రదర్శనతో పాటు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్పిదాలపై ఇప్పుడు ఓ సారి చూసేద్దాం. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 05 2026, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రికార్డు ధర పలికిన అనామకులు
Image Credit : CSK\Twitter

రికార్డు ధర పలికిన అనామకులు

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ గత కొన్ని ఏళ్లుగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 2025 సీజన్‌లో 10వ స్థానానికి పడిపోయిన చెన్నై, 2026 మినీ వేలంలో భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వేలంలో ఎవరూ ఊహించని విధంగా ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మల కోసం చెన్నై రూ. 28.40 కోట్లు ఖర్చు చేసింది. దేశవాళీలో బాగా ఆడారన్న కారణంతో ఇంత భారీ మొత్తం వెచ్చించినా, ఐపీఎల్‌లో వారు తేలిపోయారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కార్తీక్ శర్మ దారుణ వైఫల్యం
Image Credit : X/ChennaiIPL

కార్తీక్ శర్మ దారుణ వైఫల్యం

ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ అనే ఇద్దరు అన్-క్యాప్డ్ ప్లేయర్ల కోసం చెన్నై ఏకంగా రూ. 28.40 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కొక్కరికి రూ. 14.20 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నా, వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు.

కార్తీక్ శర్మ: వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఇతను రాజస్థాన్‌పై 18 పరుగులు చేయగా, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు.

35
ఆల్ రౌండర్ కు బౌలింగ్ లేదు
Image Credit : X/ChennaiIPL

ఆల్ రౌండర్ కు బౌలింగ్ లేదు

రూ. 14.20 కోట్లు పెట్టి కొన్న బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన ప్రశాంత్ వీర్, పంజాబ్‌పై కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆశ్చర్యకరంగా ఇతనికి బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. ఇప్పుడిదే విమర్శలకు దారితీస్తోంది.

45
ఆయుష్ మాత్రే ఒంటరి పోరాటం!
Image Credit : X/ChennaiIPL

ఆయుష్ మాత్రే ఒంటరి పోరాటం!

పంజాబ్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో ఆయుష్ మాత్రే 73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా బ్యాటర్ల సహకారం లేకపోవడంతో చెన్నై భారీ మూల్యం చెల్లించుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో చెన్నై 209 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

55
చెన్నైకి గాయాల బెడద
Image Credit : ANI

చెన్నైకి గాయాల బెడద

ఒకవైపు ఆటగాళ్ల ఫామ్ లేమి, మరోవైపు ఎంఎస్ ధోనీ గాయం చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. కెప్టెన్ రుతురాజ్ కూడా వరుసగా విఫలమవ్వడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి కూడా చివరి స్థానంతో సరిపెట్టుకుంటుందో.. లేదా కంబ్యాక్ ఇస్తుందో వేచి చూడాలి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AFG vs IND: అభిషేక్ శ‌ర్మ విధ్వంసం, ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image2
IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. సంజూ వచ్చేశాడు.. భారత తుది జట్టు ఇదే
Recommended image3
Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్
Related Stories
Recommended image1
IPL 2026 : ప్లేఆఫ్స్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే.. డిఫెండింగ్ ఛాంపియన్ RCBకి షాక్
Recommended image2
IPL 2026 : కుర్రాళ్లు కుమ్మేశారు భయ్యా.. సిక్సర్ల మోత అంతే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved