MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 : కుర్రాళ్లు కుమ్మేశారు భయ్యా.. సిక్సర్ల మోత అంతే !

IPL 2026 : కుర్రాళ్లు కుమ్మేశారు భయ్యా.. సిక్సర్ల మోత అంతే !

PBKS vs CSK : యంగ్ ప్లేయర్లు ఐపీఎల్ 2026లో సిక్సర్ల మోత మోగిస్తున్నారు. కుర్రాళ్లు దుమ్మురేపడంతో చెన్నై సూపర్ కింగ్స్ డబుల్ సెంచరీ స్కోర్ పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. ఆయుష్ మాత్రే, ప్రియాన్ష్ ఆర్య తమ బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 04 2026, 06:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కుర్రాళ్ల వీరవిహారం: చెన్నై కోటలో పంజాబ్ సిక్సర్ల జాతర
Image Credit : X/IPL

కుర్రాళ్ల వీరవిహారం: చెన్నై కోటలో పంజాబ్ సిక్సర్ల జాతర

మహేంద్ర సింగ్ ధోనీ అడ్డాలో యువ కెరటాలు సృష్టించిన సునామీతో చెన్నై సూపర్ కింగ్స్ కోట బీటలు వారింది. ఐపీఎల్ 2026లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన 7వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 18.4 ఓవర్లలోనే ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలోని యువ ఆటగాళ్లు సిక్సర్ల మోతతో చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు.

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే అభిమానులకు అసలైన మజాను అందించింది. చెపాక్ లో జరిగిన పోరులో యువ ఆటగాళ్లు అనుభవజ్ఞులైన బౌలర్లను సైతం వణికించారు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అయితే, ఈ భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ యువ బ్యాటర్లు అత్యంత సులువుగా ఛేదించి, వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. ఆయుష్ మాత్రే రికార్డుల మోత
Image Credit : ANI

1. ఆయుష్ మాత్రే రికార్డుల మోత

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మొదటి ప్లేయర్ ఆయుష్ మాత్రే. కేవలం 18 ఏళ్ల 261 రోజుల వయసులోనే చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 38 బంతుల్లోనే 67 పరుగులు చేసి, చెన్నైకి భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతని ఇన్నింగ్స్‌లో సిక్సర్ల మోత అందరినీ ఆకట్టుకుంది.

Ayush Mhatre motoring along! 🏎️

The youngster putting wheels to @ChennaiIPL's innings 🔥#CSK 57/1 after the Powerplay. 

Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/UyJtggrhxT

— IndianPremierLeague (@IPL) April 3, 2026

36
2. ప్రియాన్ష్ ఆర్య.. విధ్వంసకర ఆరంభం
Image Credit : Sales Team

2. ప్రియాన్ష్ ఆర్య.. విధ్వంసకర ఆరంభం

పంజాబ్ కింగ్స్ ఛేదనలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ప్రియాన్ష్ ఆర్య, మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశాడు. కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులు చేసి (స్ట్రైక్ రేట్ 350+) జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతని బ్యాటింగ్ పవర్ చూసి స్టేడియం మొత్తం నివ్వెరపోయింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఆర్యకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.

How good was he timing the ball 👌👌

Priyansh Arya looked in terrific touch 🎶

He goes back for an entertaining 39(11) 👏👏

Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/BW7Qdd36fc

— IndianPremierLeague (@IPL) April 3, 2026

46
3. ప్రభ్‌సిమ్రాన్ సింగ్: నిలకడైన బ్యాటింగ్
Image Credit : ANI

3. ప్రభ్‌సిమ్రాన్ సింగ్: నిలకడైన బ్యాటింగ్

ప్రియాన్ష్ ఆర్య ఇచ్చిన ఊపును ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అద్భుతంగా కొనసాగించాడు. 34 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు విజయావకాశాలను మెరుగుపరిచాడు. అనవసరపు రన్ అవుట్ కారణంగా వెనుదిరిగినప్పటికీ, అప్పటికే పంజాబ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తన 43 పరుగుల ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు.

Finding the gaps to perfection 👌

Prabhsimran Singh keeping things under control in the chase 👍#PBKS need 122 runs in 72 deliveries. 

Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/9nIPf1ZcO3

— IndianPremierLeague (@IPL) April 3, 2026

56
4. కూపర్ కానోలీ: ఫినిషింగ్ టచ్
Image Credit : ANI

4. కూపర్ కానోలీ: ఫినిషింగ్ టచ్

పంజాబ్ తరపున మిడిల్ ఆర్డర్‌లో కూపర్ కానోలీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 36 పరుగులు చేసి (6 ఫోర్లు) జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. ముఖ్యంగా ఒత్తిడి సమయంలో బౌండరీలతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అంతకు ముందు మ్యాచ్ లో కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

66
5. శ్రేయాస్ అయ్యర్: కెప్టెన్ నాక్
Image Credit : X@IPL

5. శ్రేయాస్ అయ్యర్: కెప్టెన్ నాక్

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన అనుభవాన్ని రంగరించి జట్టును గెలుపు ముంగిట నిలిపాడు. 29 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూపర్ కానోలీతో కలిసి అవసరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు తీసినప్పటికీ, పంజాబ్ బ్యాటర్ల దూకుడు ముందు నిలవలేకపోయారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

Led the show with example 🫡#PBKS Captain Shreyas Iyer goes back for a well made 50(29) 👏👏

Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/kCpWu5LluE

— IndianPremierLeague (@IPL) April 3, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
IPL 2026 : ప్లేఆఫ్స్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే.. డిఫెండింగ్ ఛాంపియన్ RCBకి షాక్
Recommended image2
CSK vs PBKS: ధోనీ శిష్యుడి దెబ్బకు పంజాబ్ బౌలర్లు విలవిల.. ఆయుష్ మాత్రే ఛీట్ చేశాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved