MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Sports
  • SRH vs PBKS : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే...

SRH vs PBKS : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే...

Indian Premier League 2026 : ఈ ఐపిఎల్ సీజన్లో తెలుగు టీం సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఓటమి తప్పలేదు. పంజాబ్ చేతిలో హైదరాబాద్ ఓడిపోడానికి ప్రధాన కారణాలేంటో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 11 2026, 07:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సన్ రైజర్స్ ఓటమికి కారణాలు..
Image Credit : Getty

సన్ రైజర్స్ ఓటమికి కారణాలు..

SRH vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఓటమి తప్పలేదు... పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే చేధించింది పంజాబ్... 6 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే పంజాబ్ చేతిలో హైదరాబాద్ టీం ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయి... వీటిలో టాప్ 5 గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. ఎస్ఆర్‌హెచ్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం...
Image Credit : Getty

1. ఎస్ఆర్‌హెచ్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం...

చండీగఢ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లోకల్ టీం పంజాబ్ బౌలర్లకు సన్ రైజర్స్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అభిషేక్ శర్మ 74 పరుగులు (28 బంతుల్లో), ట్రావిస్ హెడ్ 38 పరుగులు (23 బంతుల్లో) చేశారు... దీంతో సన్ రైజర్స్ స్కోరు 250 దాటుతుందని అభిమానులు భావించారు. కానీ ఓపెనర్లు ఔటైన తర్వాత మిడిల్ ఆర్డర్ విఫలమయ్యింది... వేగంగా పరుగులు సాధించలేకపోయింది. దీంతో సన్ రైజర్స్ స్కోరు 219 కే పరిమితం అయ్యింది... 220 లక్ష్యాన్ని పంజాబ్ అలవోకగా చేధించింది.

Related Articles

Related image1
SRH vs PBKS : అభిషేక్ దెబ్బకు పంజాబ్ షేక్... కేవలం 13 బంతుల్లో 68 పరుగులేంటి సామీ..!
Related image2
SRH vs LSG : హైదరాబాద్ కొంపముంచిన ఆ 5 తప్పులు ఇవే
36
2. బౌలర్ల చెత్త ప్రదర్శన..
Image Credit : ANI

2. బౌలర్ల చెత్త ప్రదర్శన..

హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉన్నా బౌలింగ్ మాత్రం చెత్తగా కనిపిస్తోంది. సరైన సమయంలో ప్రత్యర్థి వికెట్లు పడగొట్టే బౌలర్ ఒక్కరూ కనిపించడంలేదు. తాజా మ్యాచ్ లో 219 పరుగులను కూడా కాపాడుకోలేక చేతులెత్తేశారంటేనే బౌలింగ్ ఎంత బలహీనమో అర్థం చేసుకోవచ్చు.

ఈ మ్యాచ్ లో శివంగ్ కుమార్ ఒక్కడు 3 వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చి కాస్త పరవాలేదనిపించాడు... మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించారు. సరైన సమయంలో వికెట్లు తీయలేకపోయారు... దీంతో పంజాబ్ విజయం సాధించింది.

46
3. పంజాబ్ అద్భుత బ్యాటింగ్..
Image Credit : ANI

3. పంజాబ్ అద్భుత బ్యాటింగ్..

విజయం కోసం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాల్సివున్నా పంజాబ్ బ్యాటర్లు ఎక్కడా భయపడినట్లు కనిపించలేదు... ఆత్మవిశ్వాసంతో ఆడారు. ముఖ్యంగా ఓపెనర్లిద్దరూ అద్భుత ఆరంభం అధించారు... సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రియాంశ్ ఆర్య 57 పరుగులు (20 బంతుల్లో), ప్రభుసిమ్రత్ సింగ్ 51 పరుగులు (25 బంతుల్లో) చేశారు... వీరి మెరుపు బ్యాటింగ్ పంజాబ్ విజయానికి బాటలు వేసింది.

56
4. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్సింగ్స్
Image Credit : Getty

4. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్సింగ్స్

ఓపెనర్లు ఔటైన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ బ్యాటింగ్ బాధ్యతను భుజానెత్తుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన అయ్యర్ సరైన సమయంలో వేగం పెంచాడు... కేవలం 33 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడు 5 ఫోర్లు, 5 సిక్సర్లతో అదగొట్టాడు. ఇలా అద్భుతంగా ఆడి హైదరాబాద్ చేతిలోంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడు అయ్యర్.

66
5. పంజాబ్ బౌలర్ల కమ్ బ్యాక్..
Image Credit : ANI

5. పంజాబ్ బౌలర్ల కమ్ బ్యాక్..

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు పవర్ ప్లే లోనే సెంచరీ బాదడంతో ఆ టీం స్కోరు 250 దాటుతుందని అందరూ భావించారు. కానీ పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 219 పరుగులకే హైదరాబాద్ ను కట్టడిచేశారు. ముఖ్యంగా క్లాసెన్ లాంటి హిట్టర్ ను కట్టడి చేయడంలో సఫలమయ్యారు... అతడు 33 బంతుల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడంటేనే పంజాబ్ బౌలింగ్ ఎంత అద్భుతంగా సాగిందో అర్థమవుతుంది. సన్ రైజర్స్ ఓపెనర్లు చెలరేగినా మిడిల్ ఆర్డర్ ను కట్టడిచేసి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు పంజాబ్ బౌలర్లు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Recommended image2
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Recommended image3
జాతీయ క్రీడా పురస్క‌రాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈసారి ఊహించ‌ని ట్విస్ట్
Related Stories
Recommended image1
SRH vs PBKS : అభిషేక్ దెబ్బకు పంజాబ్ షేక్... కేవలం 13 బంతుల్లో 68 పరుగులేంటి సామీ..!
Recommended image2
SRH vs LSG : హైదరాబాద్ కొంపముంచిన ఆ 5 తప్పులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved