MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ENG vs WI: దెబ్బకు ఇంగ్లండ్ మైండ్ బ్లాక్.. నేపాల్ చేతిలో బతికిపోయినా, విండీస్ పాతాళానికి తొక్కేసింది

ENG vs WI: దెబ్బకు ఇంగ్లండ్ మైండ్ బ్లాక్.. నేపాల్ చేతిలో బతికిపోయినా, విండీస్ పాతాళానికి తొక్కేసింది

England vs West Indies: టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ అదరగొట్టింది. రూథర్‌ఫోర్డ్ (76) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై 30 పరుగుల తేడాతో విండీస్ ఘనవిజయం సాధించింది. నేపాల్ చేతిలో బతికిపోయిన ఇంగ్లాండ్ ను విండీస్ పాతాళానికి తొక్కేసింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 11 2026, 11:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్‌కు షాక్
Image Credit : X@ICC

టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్‌కు షాక్

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్ దశలో భాగంగా జరిగిన 15వ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌కు ఈ టోర్నీలో ఇది తొలి ఓటమి కాగా, వెస్టిండీస్‌కు ఇది వరుసగా రెండో గెలుపు.

గత మ్యాచ్‌లో ఆసియా జట్టు నేపాల్ చేతిలో ఇంగ్లండ్ తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. 185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్ అద్భుతంగా ఆడినా, సామ్ కరన్ వేసిన అద్భుతమైన చివరి ఓవర్ కారణంగా ఇంగ్లండ్ కేవలం 4 పరుగుల తేడాతో బయటపడింది. ఆ మ్యాచ్‌లో నేపాల్ ఆడిన తీరు చూసి తాము కూడా ఆశ్చర్యపోయామని ఇంగ్లండ్ ఆటగాళ్లు అంగీకరించారు. మరోవైపు వెస్టిండీస్ తమ తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 35 పరుగుల తేడాతో సునాయాసంగా గెలిచింది. ఆ మ్యాచ్‌లో విండీస్ 182 పరుగులు చేయగా, స్కాట్లాండ్ 147 పరుగులకే కుప్పకూలింది. అందులో రొమారియో షెపర్డ్ హ్యాట్రిక్ వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

25
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఆరంభంలోనే విండీస్ కు షాక్
Image Credit : Getty

టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఆరంభంలోనే విండీస్ కు షాక్

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు మొదట టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇంగ్లండ్ బౌలర్లు తమ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆరంభంలోనే విండీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. విండీస్ ఇన్నింగ్స్ చాలా పేలవంగా ప్రారంభమైంది. స్కోరు బోర్డుపై కేవలం 8 పరుగులు ఉన్నప్పుడే విండీస్ తమ ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది.

ఇన్నింగ్స్ మొదలైన మూడు బంతుల్లోనే ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (1), షాయ్ హోప్ (0) పెవిలియన్ చేరారు. అయితే, మూడో వికెట్‌కు షిమ్రాన్ హెట్మెయర్, రోస్టన్ చేజ్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలకడగా మార్చే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెట్మెయర్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసి ఔట్ కాగా, రోస్టన్ చేజ్ 6 ఫోర్లతో 34 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 10 ఓవర్లు ముగిసే సరికి విండీస్ 79 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

Related Articles

Related image1
IND vs PAK : అభిషేక్ శర్మ వచ్చేశాడు.. ఇక పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలే !
Related image2
SA vs AFG : క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ క్లైమాక్స్.. రెండు సూపర్ ఓవర్లు.. గ్రేట్ విక్టరీ !
35
180 స్ట్రైక్ రేట్.. 7 సిక్సర్లు.. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసిన రూథర్‌ఫోర్డ్
Image Credit : Getty

180 స్ట్రైక్ రేట్.. 7 సిక్సర్లు.. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసిన రూథర్‌ఫోర్డ్

కష్టాల్లో ఉన్న వెస్టిండీస్ జట్టును మిడిలార్డర్ బ్యాటర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే అతడు 180కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 42 బంతుల్లోనే అతడు అజేయంగా 76 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రూథర్‌ఫోర్డ్ 2 ఫోర్లు, ఏకంగా 7 భారీ సిక్సర్లు బాదాడు.

ఐదో వికెట్‌కు రోవ్‌మన్ పావెల్ (14)తో కలిసి 51 పరుగులు జోడించిన రూథర్‌ఫోర్డ్.. ఆరో వికెట్‌కు జేసన్ హోల్డర్‌తో కలిసి 61 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్లలో జేసన్ హోల్డర్ కూడా బ్యాట్‌తో సత్తా చాటాడు. అతడు కేవలం 17 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ వేసిన ఒకే ఓవర్లో హోల్డర్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. చివరి 10 ఓవర్లలో వెస్టిండీస్ బ్యాటర్లు ఏకంగా 117 పరుగులు రాబట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది.

45
ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యం.. ఆదుకోలేకపోయిన కరన్
Image Credit : Getty

ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యం.. ఆదుకోలేకపోయిన కరన్

197 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు సరైన శుభారంభం అందించలేకపోయారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ మొదటి వికెట్‌కు 38 పరుగులు మాత్రమే జోడించారు. ఫిల్ సాల్ట్ 14 బంతుల్లోనే 30 పరుగులు చేసినా, ఆ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. జోస్ బట్లర్ 21 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ బ్యాటర్ టామ్ బాంటన్ దారుణంగా విఫలమై 2 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 17 పరుగులకే పరిమితం అయ్యాడు. జాకబ్ బెథెల్ కొన్ని షాట్లు ఆడి 23 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లలో సామ్ కరన్ పోరాడే ప్రయత్నం చేసి 30 బంతుల్లో అజేయంగా 43 పరుగులు సాధించాడు. కానీ ఒక వైపు వికెట్లు పడుతుండటంతో అతను ఒంటరిపోరాటం చేయాల్సి వచ్చింది. 76 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ తమ చివరి 6 వికెట్లను కోల్పోయి, 166 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

55
అదరగొట్టిన విండీస్ స్పిన్నర్లు
Image Credit : Getty

అదరగొట్టిన విండీస్ స్పిన్నర్లు

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ స్పిన్నర్లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశారు. గుడాకేష్ మోటీ తన 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రోస్టన్ చేజ్ 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కేవలం స్పిన్నర్ ఆదిల్ రషీద్ మాత్రమే 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు. మిగతా ఇంగ్లండ్ బౌలర్లందరూ విండీస్ బ్యాటర్ల చేతిలో దెబ్బతిన్నారు.

గణాంకాల ప్రకారం చూస్తే 2024 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు 9 సార్లు టీ20 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ ఏకంగా 7 మ్యాచ్‌లు గెలిచి ఆధిపత్యం చెలాయించగా, వెస్టిండీస్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో మాత్రం విండీస్ కలిసికట్టుగా రాణించి ఇంగ్లండ్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : అభిషేక్ శర్మ వచ్చేశాడు.. ఇక పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలే !
Recommended image2
SA vs AFG: ఓడింది మ్యాచ్ మాత్రమే.. అందరి హృదయాలను గెలిచిన అఫ్ఘనిస్తాన్
Recommended image3
Super Over Records : టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఎన్ని సూపర్ ఓవర్లు జరిగాయి?
Related Stories
Recommended image1
IND vs PAK : అభిషేక్ శర్మ వచ్చేశాడు.. ఇక పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలే !
Recommended image2
SA vs AFG : క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ క్లైమాక్స్.. రెండు సూపర్ ఓవర్లు.. గ్రేట్ విక్టరీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved