MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Virat Kohli : రబాడ ఓవర్‌లో 5 ఫోర్లు.. అంపైర్‌తో ఫైట్.. కోహ్లీ విశ్వరూపం మాములుగా లేదుగా!

Virat Kohli : రబాడ ఓవర్‌లో 5 ఫోర్లు.. అంపైర్‌తో ఫైట్.. కోహ్లీ విశ్వరూపం మాములుగా లేదుగా!

Virat Kohli: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజత్ పాటిదార్ వికెట్ వివాదాస్పదమైంది. అంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 30 2026, 10:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ ఫైర్.. గ్రౌండ్ లో హైడ్రామా
Image Credit : X/@CricCrazyJohns + @Vipintiwari952

అంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ ఫైర్.. గ్రౌండ్ లో హైడ్రామా

ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన 42వ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆట కంటే కూడా విరాట్ కోహ్లీ ఫైర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అవుట్ అయిన తీరుపై కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. డగౌట్ వద్ద కోహ్లీ అసహనంతో ఊగిపోయిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

25
వివాదానికి కారణం ఏంటి?
Image Credit : ANI

వివాదానికి కారణం ఏంటి?

ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రజత్ పాటిదార్ ఒక షాట్ ఆడేందుకు ప్రయత్నించి బ్యాలెన్స్ కోల్పోయారు. బంతి గాలిలోకి లేవగా, గుజరాత్ ఫీల్డర్ జేసన్ హోల్డర్ అద్భుతంగా పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ దీనిని అవుట్‌గా ప్రకటించారు. అయితే, రీప్లేలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. కానీ, అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా పాటిదార్‌ను అవుట్‌ ఇచ్చారు. ఇది చూసిన విరాట్ కోహ్లీ సహనం కోల్పోయారు. డగౌట్ నుంచి బయటకు వచ్చి ఫోర్త్ అంపైర్‌తో తీవ్రంగా వాదించారు. ఈ నిర్ణయం వల్ల ఆర్సీబీ కీలక వికెట్‌ను కోల్పోయింది.

A CONTROVERSIAL CALL IN THE IPL. pic.twitter.com/FasUPrvqub

— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2026

Related Articles

Related image1
Rohit Sharma Net Worth: నాడు రూ. 275 ఫీజు కట్టలేక ఇబ్బందులు.. నేడు కోట్ల సామ్రాజ్యం.. రోహిత్ శర్మ నెట్‌వర్త్‌ ఎంత?
Related image2
Virat Kohli : విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఫిక్స్? టీమిండియాలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
35
రబాడ ఓవర్‌లో కోహ్లీ ఊచకోత
Image Credit : ANI

రబాడ ఓవర్‌లో కోహ్లీ ఊచకోత

వికెట్ వివాదం పక్కన పెడితే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో మాత్రం విశ్వరూపం చూపించారు. కగిసో రబాడ వేసిన ఒకే ఓవర్‌లో కోహ్లీ వరుసగా 5 ఫోర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించారు. ఒకప్పుడు క్రిస్ గేల్ సృష్టించిన రికార్డును కోహ్లీ కళ్లముందుంచారు. పవర్ ప్లే సమయంలో రబాడ బంతులను కవర్స్, పాయింట్ మీదుగా బౌండరీలకు తరలిస్తూ కోహ్లీ తన దూకుడు చూపించాడు. కేవలం 10 బంతుల్లోనే 28 పరుగులు చేసి తన టీ20 కెరీర్‌లో అత్యంత వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.

Pace meets 𝙋𝙀𝙍𝙁𝙀𝘾𝙏𝙄𝙊𝙉 🤌

🎥 Virat Kohli with 5️⃣ consecutive boundaries against Kagiso Rabada 🔥

Updates ▶️ https://t.co/I5Hg8ybefh#TATAIPL | #KhelBindaas | #GTvRCB | @RCBTweetspic.twitter.com/mdunPUJiV0

— IndianPremierLeague (@IPL) April 30, 2026

Score: Settled! ⚖️

🎥 Kagiso Rabada has the last laugh against Virat Kohli 👊

Updates ▶️ https://t.co/I5Hg8ybefh#TATAIPL | #KhelBindaas | #GTvRCB | @gujarat_titanspic.twitter.com/Hx5ariop2h

— IndianPremierLeague (@IPL) April 30, 2026

45
ఎలైట్ క్లబ్‌లోకి కోహ్లీ
Image Credit : ANI

ఎలైట్ క్లబ్‌లోకి కోహ్లీ

ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో ఐదు ఫోర్లు కొట్టిన మూడో ఆర్సీబీ బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించారు. గతంలో 2013లో పుణే వారియర్స్ మీద క్రిస్ గేల్, 2016లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ మీద షేన్ వాట్సన్ ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వీరి సరసన కోహ్లీ చేరారు. అయితే, దూకుడుగా ఆడుతున్న కోహ్లీని రబాడ తన తర్వాతి ఓవర్‌లో బోల్తా కొట్టించాడు. రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ 28 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

55
పేకమేడలా కూలిన ఆర్సీబీ బ్యాటింగ్
Image Credit : ANI

పేకమేడలా కూలిన ఆర్సీబీ బ్యాటింగ్

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బ్యాటర్లు వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. కోహ్లీ 28 పరుగులకే అవుట్ కాగా, దేవదత్ పడిక్కల్ ఒక్కడే 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా వంటి హిట్టర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చివర్లో భువనేశ్వర్ (15), షెపర్డ్ (17), వెంకటేష్ అయ్యర్ (12) చేసిన మెరుపులతో ఆర్సీబీ ఎలాగోలా 155 పరుగులు చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rohit Sharma Net Worth: నాడు రూ. 275 ఫీజు కట్టలేక ఇబ్బందులు.. నేడు కోట్ల సామ్రాజ్యం.. రోహిత్ శర్మ నెట్‌వర్త్‌ ఎంత?
Recommended image2
IPL 2026 : ఐపీఎల్ ప్లేఆఫ్స్ లెక్కలివే... ఏ టీంకు ఎంత ఛాన్స్..!
Recommended image3
Virat Kohli : విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఫిక్స్? టీమిండియాలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
Related Stories
Recommended image1
Rohit Sharma Net Worth: నాడు రూ. 275 ఫీజు కట్టలేక ఇబ్బందులు.. నేడు కోట్ల సామ్రాజ్యం.. రోహిత్ శర్మ నెట్‌వర్త్‌ ఎంత?
Recommended image2
Virat Kohli : విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఫిక్స్? టీమిండియాలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved