MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • Ram Charan: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?

Ram Charan: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?

Ram Charan: పెద్ది సినిమా ప్రమోషన్స్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ బుమ్రాను ఫుట్ బాల్ ప్లేయర్ అంటూ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అలాగే, భోపాల్ ను బీహార్ అని పొరపాటుగా మాట్లాడిన వీడియోలు వైరల్ గా మారాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 24 2026, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బుమ్రా ఫుట్‌బాల్ ప్లేయరా? లైవ్ స్టేజ్ మీదే రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.. నెట్టింట వైరల్!
Image Credit : Instagram/jaspritb1, alwaysramcharan

బుమ్రా ఫుట్‌బాల్ ప్లేయరా? లైవ్ స్టేజ్ మీదే రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.. నెట్టింట వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో, ఇండస్ట్రీలో సాలిడ్ అంచనాలు ఉన్నాయి. జూన్ 4న సినిమా రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.

ముంబైలో ట్రైలర్ లాంచ్ తర్వాత, తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో ఒక రేంజ్ లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే ఈ క్రౌడ్ హంగామా మధ్య రామ్ చరణ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాపిడ్ ఫైర్ లో దొర్లిన పొరపాట్లు
Image Credit : Asianet News

రాపిడ్ ఫైర్ లో దొర్లిన పొరపాట్లు

ఈవెంట్‌లో భాగంగా హోస్ట్ రామ్ చరణ్‌తో ఒక ఇంట్రెస్టింగ్ రాపిడ్ ఫైర్ గేమ్ ఆడించారు. ఇందులో భాగంగా టీమిండియా స్టార్ క్రికెటర్ల పేర్లు చెప్పి, వారి గురించి ఒక్క ముక్కలో చెప్పమన్నారు. చరణ్ కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఆన్సర్స్ ఇచ్చారు.

సచిన్ టెండూల్కర్ గురించి ‘లెజెండరీ రన్’ అని, ధోనీని ‘కూల్ అండ్ కామ్’ అని, రోహిత్ శర్మను ‘అందరివాడు’ అని, విరాట్ కోహ్లీని ‘ఫైర్’ అంటూ క్రేజీగా డిస్క్రైబ్ చేశారు. కానీ, అసలు ట్విస్ట్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు వచ్చినప్పుడు ఎదురైంది. "నేను బుమ్రాకు పెద్ద ఫ్యాన్‌ని. నాకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం, మీరు ఫుట్‌బాల్‌ను ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు" అంటూ చరణ్ పొరపాటుగా మాట్లాడేశారు.

వరల్డ్ క్లాస్ క్రికెట్ బౌలర్ అయిన బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్ అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాదు, అదే ఫ్లోలో భోపాల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 'బీహార్ ప్రజలు' అని కూడా అనేశారు. వెంటనే యాంకర్ అలర్ట్ అయి ఆ తప్పును సరిదిద్దారు.

Related Articles

Related image1
Fastest Animals : అబ్బా ఏం స్పీడ్ రా బాబు! బుల్లెట్ కంటే వేగంగా దూసుకెళ్లే టాప్ 5 జంతువులు ఇవే
Related image2
Rishabh Pant: రిషభ్ పంత్‌కు బిగ్ షాక్.. లక్నో కెప్టెన్సీ నుంచి ఔట్.. ఏం జరుగుతోంది?
34
సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఎన్టీఆర్ కామెంట్స్ రీవైండ్
Image Credit : X

సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఎన్టీఆర్ కామెంట్స్ రీవైండ్

ఈ చిన్నపాటి తడబాటుకు సంబంధించిన వీడియో క్లిప్స్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్లోబల్ స్టార్ కి క్రికెట్ గురించి మినిమం నాలెడ్జ్ లేదా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయగా, క్రికెట్ లవర్స్ మీమ్స్, ట్రోల్స్‌తో రచ్చ చేశారు. అయితే మెగా అభిమానులు మాత్రం చరణ్‌కు సపోర్ట్‌గా నిలిచారు.

రామ్ చరణ్‌కు పేర్లు, సందర్భాలు కొన్ని సార్లు త్వరగా గుర్తుకురావని, అది ఆయనకు ఉన్న చిన్న మతిమరుపు అని గుర్తు చేశారు. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల టైమ్‌లో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చరణ్‌కు ఉన్న ఈ మతిమరుపు అలవాటును సరదాగా లీక్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అభిమానులు గుర్తు చేసుకున్నారు.

pic.twitter.com/efdwDSKyIB

— Uppi_ECF⚡ (@uppi_m13218) May 23, 2026

44
హుందాగా క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్
Image Credit : Youtube@Vriddhicinemas

హుందాగా క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్

వివాదం ముదరక ముందే రామ్ చరణ్ చాలా హుందాగా స్పందించారు. ఈవెంట్ ముగిసిన వెంటనే తన అఫీషియల్ ఎక్స్ ఖాతా ద్వారా బుమ్రాకు, అభిమానులకు సారీ చెప్పారు. "అయ్యో.. కొన్నిసార్లు పేర్ల విషయంలో నేను నిజంగా గందరగోళానికి గురవుతాను. అంత పెద్ద జనసందోహం, ఉత్సాహం మధ్యలో అది హ్యూమన్ ఎర్రర్ మాత్రమే. జస్ప్రీత్ బుమ్రా జీ.. నన్ను క్షమించండి. మీ ఆటకు నేను పెద్ద ఫ్యాన్‌ని. మీ పట్ల నాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. మీరు ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెడుతూ వికెట్లు తీస్తుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది " అంటూ పోస్ట్ పెట్టారు. చరణ్ తన తప్పును వెంటనే ఒప్పుకుని సారీ చెప్పడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Uff… I’m genuinely so forgetful with names sometimes.

Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up - it was a genuine human error in the middle of all the excitement and the crowd 🙏🏼

I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…

— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
క్రీడలు
క్రికెట్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Fastest Animals : అబ్బా ఏం స్పీడ్ రా బాబు! బుల్లెట్ కంటే వేగంగా దూసుకెళ్లే టాప్ 5 జంతువులు ఇవే
Recommended image2
Rishabh Pant: రిషభ్ పంత్‌కు బిగ్ షాక్.. లక్నో కెప్టెన్సీ నుంచి ఔట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved