MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేస్.. పంజాబ్, రాజస్థాన్, కేకేఆర్ లలో ఆ లక్కీ టీమ్ ఏది?

IPL 2026 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేస్.. పంజాబ్, రాజస్థాన్, కేకేఆర్ లలో ఆ లక్కీ టీమ్ ఏది?

IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్ క్లైమాక్స్‌కు చేరింది. నాలుగో స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్, కేకేఆర్ మధ్య రసవత్తర పోరు సాగుతోంది. మరి ఫోర్త్ బెర్త్ ను దక్కించుకునే టీమ్ ఏది? ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 24 2026, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ 2026: ఉత్కంఠగా ప్లేఆఫ్స్ రేస్
Image Credit : X@IPL

ఐపీఎల్ 2026: ఉత్కంఠగా ప్లేఆఫ్స్ రేస్

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌లు అఫీషియల్‌గా ప్లేఆఫ్స్ బెర్త్‌లను కన్ఫర్మ్ చేసుకున్నాయి. అయితే, ఇప్పుడు అందరి కళ్లూ ఆ నాలుగో స్థానం పైనే ఉన్నాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ భారీ విజయం సాధించడంతో ఈ రేస్ మరింత రసవత్తరంగా మారింది.

పంజాబ్ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ప్లేఆఫ్స్ కలలు పూర్తిగా చెదిరిపోయాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తర్వాత టోర్నమెంట్ నుండి అధికారికంగా తప్పుకున్న నాలుగో టీమ్‌గా ఢిల్లీ నిలిచింది. ప్రస్తుతం నాలుగో ప్లేఆఫ్ టికెట్ కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రాజస్థాన్ రాయల్స్‌కు డైరెక్ట్ ఛాన్స్
Image Credit : X@ipl

రాజస్థాన్ రాయల్స్‌కు డైరెక్ట్ ఛాన్స్

పంజాబ్ కింగ్స్ సాధించిన గెలుపు వల్ల రాజస్థాన్ రాయల్స్ (RR) పాయింట్ల పట్టికలో ఒక స్థానం కిందకు పడిపోయింది. ప్రస్తుతం రియాన్ పరాగ్ కెప్టెన్సీలోని రాజస్థాన్ టీమ్ 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే చాలు, నేరుగా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోతే మాత్రం, ఎలాంటి లెక్కలు లేకుండా టోర్నీ నుండి నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది.

Related Articles

Related image1
RRR: ఆర్ఆర్ఆర్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక ఆ ప్రాంతాలన్నీ సిటీలు కాబోతున్నాయి !
Related image2
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
36
పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ లెక్కలు ఇవే
Image Credit : ANI

పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ లెక్కలు ఇవే

లక్నో సూపర్ జెయింట్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్ (PBKS), ప్రస్తుతం 14 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో టేబుల్‌లో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. అయితే పంజాబ్ అభిమానులు ఇప్పుడే పండగ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే వారి ప్లేఆఫ్స్ ఛాన్స్ ఆదివారం జరిగే మిగతా మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంది.

ఆదివారం జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే, పంజాబ్ కింగ్స్ ఐదో స్థానానికి పడిపోయి టోర్నీ నుండి అవుట్ అవుతుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే మాత్రం పంజాబ్ కింగ్స్ లక్ కుదిరినట్లే. వారు నేరుగా ప్లేఆఫ్స్ లో అడుగుపెడతారు.

46
కేకేఆర్‌కు మిరాకిల్ కావాలి
Image Credit : KKR MEDIA

కేకేఆర్‌కు మిరాకిల్ కావాలి

అజింక్య రహానే కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ప్రస్తుతం 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. టెక్నికల్‌గా కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నా, వారి ముందు నెట్ రన్ రేట్ (NRR) అనే ఒక పెద్ద ఎదురుదెబ్బ. కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం గెలిస్తే సరిపోదు, ఒక అద్భుత విజయం సాధించాల్సి ఉంటుంది.

కేకేఆర్ ముందున్న లెక్కలు గమనిస్తే.. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసి బోర్డుపై 200 రన్స్ పెడితే, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ను కనీసం 77 రన్స్ భారీ తేడాతో ఓడించాలి. అదే ఢిల్లీ టీమ్ కేకేఆర్‌కు 180 రన్స్ టార్గెట్ ఇస్తే, ఆ టార్గెట్‌ను కేకేఆర్ కేవలం 12 ఓవర్లలోనే ఫినిష్ చేయాలి. దాంతో పాటు ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి.

56
ట్విస్ట్ ఏంటంటే.. పంజాబ్‌కు లాటరీ
Image Credit : ANI

ట్విస్ట్ ఏంటంటే.. పంజాబ్‌కు లాటరీ

ఈ సండే ఐపీఎల్‌లో ఒక క్రేజీ ట్విస్ట్ కూడా ఉంది. ఒకవేళ ఆదివారం జరిగే మ్యాచ్‌లో ముంబై చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి, అటు ఢిల్లీపై కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఆ భారీ నెట్ రన్ రేట్ ఈక్వేషన్‌ను అందుకోలేకపోతే, అప్పుడు ఏ లొల్లి లేకుండా నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు) నేరుగా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోతుంది.

66
టాప్-3 టీమ్స్ పొజిషన్ ఇదీ..
Image Credit : ANI

టాప్-3 టీమ్స్ పొజిషన్ ఇదీ..

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో టాప్-3 స్థానాలు ఇప్పటికే క్లియర్ అయిపోయాయి.

• క్వాలిఫైయర్-1: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ రెండు టీమ్‌లు 18 పాయింట్లతో ఉన్నాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేట్ వల్ల బెంగళూరు మొదటి స్థానంలో, గుజరాత్ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ రెండు జట్లు మే 26న జరిగే క్వాలిఫైయర్-1లో తలపడతాయి.

• ఎలిమినేటర్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ 18 పాయింట్లతో లీగ్ మ్యాచ్‌లను ముగించి మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ టీమ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో.. ఆదివారం డిసైడ్ అయ్యే ఆ నాలుగో టీమ్‌తో తలపడనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
బెథెల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి.. సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యం
Recommended image2
టీమ్ ఇండియా మొద‌టి మ్యాచ్ ఎప్పుడు ఆడింది.? క్రికెట్‌కి సంబంధించి ఎవ‌రికీ తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు
Recommended image3
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Related Stories
Recommended image1
RRR: ఆర్ఆర్ఆర్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక ఆ ప్రాంతాలన్నీ సిటీలు కాబోతున్నాయి !
Recommended image2
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved