MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Yuvraj : 6 బంతుల్లో 6 సిక్సర్లు.. యువరాజ్ సింగ్ అందుకున్న గిఫ్ట్ ఏంటో తెలుసా?

Yuvraj : 6 బంతుల్లో 6 సిక్సర్లు.. యువరాజ్ సింగ్ అందుకున్న గిఫ్ట్ ఏంటో తెలుసా?

Yuvraj Singh : 2007 టీ20 వరల్డ్ కప్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి భారత సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌ సంచలనం రేపాడు. అయితే, ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదిన ఆ బ్యాట్ ఇప్పుడు ఎక్కడుంది? యువరాజ్ సింగ్ ఈ సిక్సర్ల రికార్డుతో అందుకున్న గిఫ్ట్ ఏమిటి?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 19 2026, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆరు బంతులు.. ఆరు సిక్సర్లు.. యువరాజ్ సింగ్ ఒక అద్భుతం
Image Credit : our own

ఆరు బంతులు.. ఆరు సిక్సర్లు.. యువరాజ్ సింగ్ ఒక అద్భుతం

క్రికెట్ ప్రపంచంలో 2007 టీ20 వరల్డ్ కప్ అంటే ముందుగా గుర్తొచ్చేది యువరాజ్ సింగ్ విధ్వంసమే. డర్బన్ మైదానంలో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది యువీ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. అయితే, ఈ ఘనత సాధించినందుకు గానూ యువరాజ్ సింగ్‌కు అప్పట్లో ఒక భారీ సర్ప్రైజ్ గిఫ్ట్ అందిందన్న విషయం చాలా మందికి తెలియదు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, యువీకి ఒక ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. ఆ ఆసక్తికరమైన డీల్ వెనుక ఉన్న అసలు కథను లలిత్ మోదీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డ్రెస్సింగ్ రూమ్ ఛాలెంజ్: లలిత్ మోదీ ఆఫర్ ఏంటి?
Image Credit : Getty

డ్రెస్సింగ్ రూమ్ ఛాలెంజ్: లలిత్ మోదీ ఆఫర్ ఏంటి?

ఆ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో లలిత్ మోదీ భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారట. ఆటగాళ్లలో ఉత్సాహం నింపడానికి ఆయన ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. "ఎవరైనా సరే, ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టినా లేదా ఆరు వికెట్లు తీసినా.. వారికి ఖరీదైన పోర్షే కారును గిఫ్ట్‌గా ఇస్తాను" అని మాటిచ్చారు. అప్పటికి టీ20 ఫార్మాట్‌లో ఇలాంటి ఫీట్ సాధించడం దాదాపు అసాధ్యమని అందరూ భావించారు. కానీ, యువరాజ్ మనసులో ఏదో వేరే ప్లాన్ ఉన్నట్లుంది.

35
పోర్షే కావాలన్న యువరాజ్.. కానీ మధ్యలో ట్విస్ట్
Image Credit : Getty

పోర్షే కావాలన్న యువరాజ్.. కానీ మధ్యలో ట్విస్ట్

స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాది రికార్డు సృష్టించిన వెంటనే, యువరాజ్ సింగ్ నేరుగా లలిత్ మోదీ దగ్గరకు వెళ్లారట. "సార్, రికార్డ్ కొట్టేశాను.. మరి నా పోర్షే కారు ఎక్కడ?" అని సరదాగా అడిగేశాడట. అయితే అప్పట్లో పోర్షే కారును విదేశాల నుండి ఇండియాకు ఇంపోర్ట్ చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల సమయం పట్టేది. అంత కాలం వేచి చూడటం యువరాజ్‌కు ఇష్టం లేకపోయింది. "నాకు ఆరు నెలల టైం వద్దు, దానికి బదులుగా ఇప్పుడే బీఎమ్‌డబ్ల్యూ కారు కొనివ్వండి" అని యువీ కోరాడట.

45
బ్యాట్ ఇచ్చి కారు తీసుకున్న సిక్సర్ల కింగ్ యూవీ
Image Credit : our own

బ్యాట్ ఇచ్చి కారు తీసుకున్న సిక్సర్ల కింగ్ యూవీ

యువరాజ్ కోరిక మేరకు లలిత్ మోదీ వెంటనే ఆయనను బీఎమ్‌డబ్ల్యూ షోరూమ్‌కు తీసుకెళ్లి, సరికొత్త మోడల్ కారును కొనిచ్చి తాళాలు అందజేశారు. అయితే ఈ డీల్‌లో లలిత్ మోదీ కూడా ఒక కోరిక కోరారు. ఆరు సిక్సర్లు కొట్టిన ఆ చరిత్రాత్మక బ్యాట్ ను తనకు గిఫ్ట్‌గా ఇవ్వమని అడిగారు. యువీ కూడా ఏమాత్రం ఆలోచించకుండా సంతోషంగా ఆ బ్యాట్‌ను మోదీకి ఇచ్చేశాడు. దీనిపై లలిత్ మోదీ స్పందిస్తూ.. "యువీ నాకు ఇచ్చిన ఆ బ్యాట్ విలువ 50 పోర్షే కార్ల కంటే ఎక్కువ. అది క్రికెట్ చరిత్రలో ఒక అపురూపమైన జ్ఞాపకం" అని చెప్పుకొచ్చారు.

55
యూవీ సిక్సర్లు.. ఆ సంచలనం ఇప్పటికీ ఒక చరిత్రే
Image Credit : Getty

యూవీ సిక్సర్లు.. ఆ సంచలనం ఇప్పటికీ ఒక చరిత్రే

యువరాజ్ సింగ్ ఆ రోజు చేసిన విధ్వంసం కేవలం రికార్డుల కోసమే కాదు, భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో ఒక బలమైన ముద్ర వేసింది. ఫ్లింటాఫ్‌తో గొడవ పడి, ఆ కోపాన్ని బంతిపై చూపిస్తూ బ్రాడ్‌ను ఉతికేసిన తీరు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఆరు సిక్సర్ల ఘనతకు ప్రతిఫలంగా అందిన ఆ బీఎమ్‌డబ్ల్యూ కారు, యువీ పోరాటానికి ఒక చిన్న గుర్తింపు మాత్రమే. కానీ ఆ బ్యాట్ ద్వారా లలిత్ మోదీ దాచుకున్న జ్ఞాపకం మాత్రం వెలకట్టలేనిది. యూవీ ఆడిన ఆ ఇన్నింగ్స్ క్రికెట్ ఉన్నంత వరకు గుర్తుంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Related Stories
Recommended image1
Team India Captain: సూర్యకుమార్ ఔట్.. శ్రేయాస్ అయ్యర్ ఇన్! పంజాబ్ హీరోకు పట్టాభిషేకం
Recommended image2
Rinku Singh: కేకేఆర్‌కు అతిపెద్ద సమస్యగా మారాడు ! ఏమైంది రింకూ భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved