MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Vaibhav Suryavanshi : 6 6 6 6 6 వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టిన 14 ఏళ్ల కుర్రాడు !

Vaibhav Suryavanshi : 6 6 6 6 6 వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టిన 14 ఏళ్ల కుర్రాడు !

Vaibhav Suryavanshi : విజయ్ హజారే ట్రోఫీలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 84 బంతుల్లో 190 పరుగులతో సంచలనం సృష్టించాడు. కేవలం 59 బంతుల్లోనే 150 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 24 2025, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కేవలం 36 బంతుల్లోనే సెంచరీ.. భారత క్రికెట్‌లో ఈ 14 ఏళ్ల కుర్రాడే ఇప్పుడు హాట్ టాపిక్!
Image Credit : X/BCCI

కేవలం 36 బంతుల్లోనే సెంచరీ.. భారత క్రికెట్‌లో ఈ 14 ఏళ్ల కుర్రాడే ఇప్పుడు హాట్ టాపిక్!

భారత దేశవాళీ క్రికెట్‌లో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ విన్యాసాలతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. విజయ్ హజారే ట్రోఫీ ప్లేట్ గ్రూప్ 2025-26 సీజన్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బీహార్ తరఫున ఆడుతున్న వైభవ్, మైదానంలో పరుగుల వరద పారించాడు.

రాంచీలోని జేఎస్‌సీఏ ఓవల్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు సాధించి సరికొత్త చరిత్ర లిఖించాడు. అండర్-19 ఆసియా కప్ ఆడి దుబాయ్ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఈ ఇన్నింగ్స్ ఆడటం విశేషం. ఈ మ్యాచ్ కేవలం బీహార్ జట్టు ఆధిపత్యాన్ని మాత్రమే కాదు, పాఠశాల విద్యార్థిగా ఉన్న ఒక కుర్రాడి అద్భుతమైన మనోస్థైర్యాన్ని కూడా ప్రపంచానికి చాటిచెప్పింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రికార్డుల మోత మోగించిన వైభవ్ ఇన్నింగ్స్
Image Credit : X/@Saabir_Saabu01

రికార్డుల మోత మోగించిన వైభవ్ ఇన్నింగ్స్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్ జట్టుకు ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతని 190 పరుగుల ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. వైభవ్ 226.19 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. కేవలం 36 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది లిస్ట్-ఎ క్రికెట్‌లో ఒక భారతీయుడు నమోదు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీలలో ఒకటిగా నిలిచింది.

అక్కడితో ఆగని వైభవ్, తర్వాత గేర్ మార్చి బౌండరీల వర్షం కురిపించాడు. కవర్ డ్రైవ్స్ నుంచి లాంగ్-ఆన్ మీదుగా భారీ సిక్సర్ల వరకు.. ప్రతి షాట్‌లోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ అరుణాచల్ బౌలర్లను దిక్కుతోచని స్థితిలో పడేశాడు. 26.1 ఓవర్ల వద్ద అవుట్ అయ్యే సమయానికి బీహార్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 261 పరుగులకు చేరుకుంది.

Related Articles

Related image1
T20 World Cup 2026 : ఏ ఐపీఎల్ టీం నుండి ఎక్కువమంది సెలెక్ట్ అయ్యారో తెలుసా?
Related image2
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర
36
ఏబీ డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

ఏబీ డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వైభవ్ కేవలం 59 బంతుల్లోనే 150 పరుగుల మార్కును చేరుకున్నాడు.

దీంతో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డు కనుమరుగైంది. 2015లో వెస్టిండీస్‌పై డివిలియర్స్ 64 బంతుల్లో 150 పరుగులు చేయగా, 2022లో నెదర్లాండ్స్‌పై జోస్ బట్లర్ 65 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు 14 ఏళ్ల వైభవ్ ఈ దిగ్గజాలను దాటి చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, 14 ఏళ్ల 272 రోజుల వయసులో లిస్ట్-ఎ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డు సృష్టించాడు.

46
భారీ భాగస్వామ్యాలతో బౌలర్లకు చుక్కలు
Image Credit : Getty

భారీ భాగస్వామ్యాలతో బౌలర్లకు చుక్కలు

వైభవ్ తన ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడుతూనే, మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మంగల్ మహ్రోర్ (33 పరుగులు)తో కలిసి తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించాడు. మంగల్ అవుటైన తర్వాత, పీయూష్ సింగ్ (29 నాటౌట్)తో కలిసి మరో 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు ఈ మ్యాచ్ పీడకలగా మారింది. బౌలర్ తేచి నేరి ఒక్కడే రెండు వికెట్లు తీయగలిగాడు, కానీ అతను కూడా 3 ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. ధీరజ్ ఆంటిన్, సూర్యాంశ్ సింగ్ వంటి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, వైభవ్ విధ్వంసం ముందు వారి ప్లాన్స్ ఏవీ పనిచేయలేదు.

56
బీహార్ జట్టు ఆల్ టైమ్ రికార్డు స్కోరు
Image Credit : X/Ayesha Bhat

బీహార్ జట్టు ఆల్ టైమ్ రికార్డు స్కోరు

వైభవ్ సూర్యవంశీ అవుటైన తర్వాత కూడా బీహార్ దూకుడు ఆగలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ ఆయుష్ లోహరుకా 56 బంతుల్లో 116 పరుగులు (11 ఫోర్లు, 8 సిక్సర్లు) చేశాడు. ఇక కెప్టెన్ సాకిబుల్ గని చివరి వరకు నాటౌట్‌గా నిలిచి 40 బంతుల్లోనే 128 పరుగులు బాదాడు. గని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి.

సాకిబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇదే రోజు జార్ఖండ్ ఆటగాడు ఇషాన్ కిషన్ 33 బంతుల్లో సెంచరీ చేశాడు. వీరందరి విధ్వంసంతో బీహార్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 574 పరుగులు చేసింది. లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోరు. గతంలో తమిళనాడు (506/2) పేరిట ఉన్న రికార్డును బీహార్ బద్దలు కొట్టింది.

66
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త ఆశాకిరణం వైభవ్ సూర్యవంశీ
Image Credit : X/@inr4477

క్రికెట్ ప్రపంచంలో సరికొత్త ఆశాకిరణం వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీకి 2025 సంవత్సరం చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఒక్క ఏడాదే అతను ఐపీఎల్, యూత్ వన్డే, యూత్ టెస్ట్, ఇండియా-ఎ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, అండర్-19 ఆసియా కప్, ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ.. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీలు బాదాడు.

కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇన్ని రికార్డులు సాధించడం, అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడం వైభవ్ ప్రతిభకు నిదర్శనం. ప్లేట్ గ్రూప్ మ్యాచ్ అయినప్పటికీ, అతని షాట్ సెలక్షన్, టెంపరామెంట్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. వైభవ్ ఇకపై కేవలం చర్చనీయాంశం మాత్రమే కాదు, మైదానంలో అద్భుతాలు సృష్టించే ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : ఏ ఐపీఎల్ టీం నుండి ఎక్కువమంది సెలెక్ట్ అయ్యారో తెలుసా?
Recommended image2
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved