MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Sports
  • Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాడు? స్కూల్ ఫీజు ఎంతో తెలుసా?

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాడు? స్కూల్ ఫీజు ఎంతో తెలుసా?

Vaibhav Suryavanshi : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నాడు. అయితే, అతను ప్రస్తుతం ఏం చదువుతున్నాడు? స్కూల్ ఫీజు ఏంత? తాజ్‌పూర్ గ్రామం నుండి వచ్చిన ఈ కుర్రాడి ఆసక్తికర ప్రయాణం వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 03 2026, 10:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆస్తులు కోట్లలో.. స్కూల్ ఫీజు వేలల్లో : వైభవ్ సూర్యవంశీ సింప్లిసిటీ చూశారా
Image Credit : X/@ImTanujSingh

ఆస్తులు కోట్లలో.. స్కూల్ ఫీజు వేలల్లో : వైభవ్ సూర్యవంశీ సింప్లిసిటీ చూశారా

ప్రస్తుతం భారతీయ క్రికెట్ వర్గాల్లో మారుమోగుతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. మైదానంలో పరుగుల వరద పారిస్తూ, రికార్డుల మోత మోగిస్తున్న ఈ 14 ఏళ్ల కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం తన ఆటతీరుతోనే కాకుండా, తన చిన్న వయసులో సాధిస్తున్న విజయాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు.

అయితే, ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ ఏం చదువుతున్నారనేది చాలా మందికి తెలియదు. తాజ్‌పూర్‌లోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన వైభవ్, ప్రస్తుతం ప్రయాణం ఏంతో ఆసక్తికరంగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
9వ తరగతి చదువుతున్న స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ
Image Credit : Instagram/vaibhav_sooryavanshi09

9వ తరగతి చదువుతున్న స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ

మైదానంలో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ, నిజ జీవితంలో ఇంకా స్కూల్ విద్యార్థే. ప్రస్తుతం వైభవ్ 9వ తరగతి చదువుతున్నాడు. అతనికి సంబంధించిన ఫోటోలు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, అతని బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా, చదువు కొనసాగించడం అంత సులభం కాలేదు. నిరంతర ప్రాక్టీస్, మ్యాచ్‌ల వల్ల అతని విద్యా ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ అనే చిన్న గ్రామంలో వైభవ్ ప్రాథమిక విద్య ప్రారంభమైంది. క్రికెట్‌లో రాణిస్తున్న కొద్దీ, చదువు, ఆటల మధ్య సమతుల్యత పాటించడం అతనికి ఒక సవాలుగా మారింది.

Related Articles

Related image1
T20 World Cup లో సిక్సర్ల సునామీ.. అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Related image2
Tilak Varma Net Worth : క్రికెట్ పిచ్‌పైనే కాదు.. సంపాదనలోనూ తిలక్ వర్మ సెంచరీ !
36
వైభవ్ సూర్యవంశీ : ఉదయం బడి.. సాయంత్రం క్రికెట్
Image Credit : Getty

వైభవ్ సూర్యవంశీ : ఉదయం బడి.. సాయంత్రం క్రికెట్

వైభవ్ సూర్యవంశీ దినచర్య చాలా కఠినంగా ఉండేది. కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే అతని తండ్రి అతని చేతికి క్రికెట్ బ్యాట్ అందించారు. అప్పటి నుండి క్రికెట్ అతని జీవితంలో భాగమైంది. అయినప్పటికీ, అతని ప్రాథమిక విద్యకు ఎప్పుడూ ఆటంకం కలగలేదు.

చిన్నప్పటి నుండి వైభవ్ రెండు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాడు. ఉదయం పూట పాఠశాలకు వెళ్లడం, సాయంత్రం వేళల్లో క్రికెట్ ప్రాక్టీస్ చేయడం అతని నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమశిక్షణే అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. చదువుతో పాటు ఆటను కూడా అంతే సీరియస్‌గా తీసుకుంటూ తన ప్రయాణాన్ని సాగించాడు.

46
వైభవ్ సూర్యవంశీ స్కూల్, ఫీజు వివరాలు
Image Credit : Getty

వైభవ్ సూర్యవంశీ స్కూల్, ఫీజు వివరాలు

వైభవ్ ప్రస్తుతం బీహార్‌లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్ లో చదువుతున్నాడు. ఈ పాఠశాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

పాఠశాల వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఈ స్కూల్ వార్షిక ఫీజు కేవలం 5,300 రూపాయలు మాత్రమే. ఈ ఫీజులో ట్యూషన్ ఫీజు కింద 2,100 రూపాయలు, పరీక్ష ఫీజు కింద 800 రూపాయలు, ఇతర యాక్టివిటీల కోసం 2,400 రూపాయలు ఉన్నాయి. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఒక యంగ్ స్టార్ క్రికెటర్, ఇంత సాధారణమైన ఫీజు ఉన్న పాఠశాలలో చదవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం.

56
ఏ పని చేసినా మనసు పెట్టి చేయాలి : వైభవ్ సూర్యవంశీ
Image Credit : Instagram/vaibhav_sooryavanshi09

ఏ పని చేసినా మనసు పెట్టి చేయాలి : వైభవ్ సూర్యవంశీ

వరుస క్రికెట్ టోర్నమెంట్లు, ప్రయాణాల కారణంగా వైభవ్ చదువుపై కొంత ప్రభావం పడింది. ఈ విషయాన్ని అతని కోచ్ కూడా ధృవీకరించారు. వైభవ్ చాలా కష్టపడే తత్వం ఉన్నవాడని, కానీ క్రికెట్ కారణంగా చదువుకోవడానికి సమయం తక్కువగా దొరుకుతుందని కోచ్ పేర్కొన్నారు.

అయితే, వైభవ్ సిద్ధాంతం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. "ఏ పని చేసినా మనసు పెట్టి చేయాలి" అనేది అతని నమ్మకం. అందుకే అతను పాఠశాలలో వచ్చే మార్కుల గురించి ఎప్పుడూ ఎక్కువగా ఆందోళన చెందలేదు. అతని పూర్తి దృష్టి తన క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడంపైనే ఉంది. మార్కుల కంటే నైపుణ్యమే ముఖ్యమని అతను బలంగా నమ్ముతాడు.

66
చదువు నేర్పిన పాఠం.. వైభవ్ భవిష్యత్తు ప్రణాళిక
Image Credit : X/BCCI

చదువు నేర్పిన పాఠం.. వైభవ్ భవిష్యత్తు ప్రణాళిక

వైభవ్ సూర్యవంశీ అభిప్రాయం ప్రకారం, విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. అతని చదువు అతని క్రికెట్ ఆటకు కూడా ఎంతగానో ఉపయోగపడింది. మైదానంలో క్లిష్టమైన మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడం, ఒత్తిడిలో కూడా మనస్సును శాంతంగా ఉంచుకోవడం వంటి విషయాలను తాను పాఠశాల విద్య నుండే నేర్చుకున్నానని వైభవ్ పలుమార్లు చెప్పాడు.

అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భారత్‌కు శుభారంభం అందిస్తూ, భవిష్యత్తు స్టార్ గా వెలుగొందుతున్న వైభవ్, తన చదువును ఆపే ఉద్దేశంలో లేడు. క్రికెట్‌తో పాటే తన విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించాలని అతను నిర్ణయించుకున్నాడు. మనసు ఉంటే మార్గం ఉంటుందనీ, ఆట, చదువు రెండింటినీ ఏకకాలంలో నిర్వహించవచ్చని వైభవ్ తన ప్రయాణం ద్వారా నిరూపిస్తున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Recommended image2
జాతీయ క్రీడా పురస్క‌రాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈసారి ఊహించ‌ని ట్విస్ట్
Recommended image3
Ayush Shetty: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్ 1 కు షాకిచ్చిన భారత ప్లేయర్
Related Stories
Recommended image1
T20 World Cup లో సిక్సర్ల సునామీ.. అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Recommended image2
Tilak Varma Net Worth : క్రికెట్ పిచ్‌పైనే కాదు.. సంపాదనలోనూ తిలక్ వర్మ సెంచరీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved