MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • ఓరి బుడ్డోడా.! పిచ్చకొట్టుడు కొడుతున్నావ్‌గా.. అయినా టీమిండియాలోకి కష్టమే..

ఓరి బుడ్డోడా.! పిచ్చకొట్టుడు కొడుతున్నావ్‌గా.. అయినా టీమిండియాలోకి కష్టమే..

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ అండర్ 19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై 72 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో యూత్ వన్డేలలో విరాట్ కోహ్లీ 978 పరుగుల రికార్డును బద్దలు కొట్టి, వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.  

2 Min read
Author : Pavithra D
Published : Jan 18 2026, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యువ సంచలనం విధ్వంసం..
Image Credit : X

యువ సంచలనం విధ్వంసం..

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అండర్ 19 వరల్డ్ కప్‌లో తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 67 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టుకు కీలకమైన పరుగులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 107.46 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ కుందు కూడా 80 పరుగులు చేయడంతో భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులు చేయగలిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోహ్లీ రికార్డు బద్దలు..
Image Credit : X/@CricCrazyJohns

కోహ్లీ రికార్డు బద్దలు..

బంగ్లాదేశ్‌పై వైభవ్ చేసిన ఈ ప్రదర్శన అతనికి ఒక అరుదైన మైలురాయిని చేరుకోవడానికి సహాయపడింది. యూత్ వన్డేలలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో అతను విరాట్ కోహ్లీ యూత్ వన్డే రికార్డును బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ 2006 నుంచి 2008 మధ్య యూత్ వన్డేలలో 978 పరుగులు సాధించాడు. అయితే వైభవ్ సూర్యవంశీ కేవలం ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దే కోహ్లీని అధిగమించి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Related Articles

Related image1
Vaibhav Suryavanshi : తగ్గేదే లే.. సఫారీ గడ్డపై వైభవ్ పుష్పరాజ్.. రికార్డులన్నీ బద్దల్ !
Related image2
Vaibhav Suryavanshi: 7 సిక్సర్లు, 9 ఫోర్లతో మాస్ ఇన్నింగ్స్ ! వరల్డ్ కప్ ముందు వైభవ్ ఊచకోత
35
వైభవ్ దూకుడు..
Image Credit : Getty

వైభవ్ దూకుడు..

వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 19 యూత్ వన్డే మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం అతని వయసు 14 సంవత్సరాలు మాత్రమే. దీంతో యూత్ వన్డేలలో మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయమని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత తరపున అండర్ 19 యూత్ వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విజయ్ జోల్ 36 మ్యాచ్‌లలో 1,404 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

45
ఒకే ఒక్క అండర్ 19 వరల్డ్ కప్ ఆడే అవకాశం
Image Credit : X/@ImTanujSingh

ఒకే ఒక్క అండర్ 19 వరల్డ్ కప్ ఆడే అవకాశం

నిబంధనల ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఒకే ఒక్క అండర్ 19 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. అయినప్పటికీ, యూత్ వన్డేలలో అతను అద్భుతమైన రికార్డులు సాధిస్తాడని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ టీమిండియా తలుపులు తట్టే దిశగా అడుగులు వేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.

55
అన్ని ఫార్మాట్లలోనూ విధ్వంసం..
Image Credit : Getty

అన్ని ఫార్మాట్లలోనూ విధ్వంసం..

యూత్ క్రికెట్‌లో ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతున్న వైభవ్, ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరుపు సెంచరీ సాధించి తన సత్తా చాటాడు. అతని నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. 15 ఏళ్లు నిండిన తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, అతను తన దూకుడును నిలకడగా కొనసాగించాలని సూచిస్తున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Vaibhav Suryavanshi : తగ్గేదే లే.. సఫారీ గడ్డపై వైభవ్ పుష్పరాజ్.. రికార్డులన్నీ బద్దల్ !
Recommended image2
Vaibhav Suryavanshi: 7 సిక్సర్లు, 9 ఫోర్లతో మాస్ ఇన్నింగ్స్ ! వరల్డ్ కప్ ముందు వైభవ్ ఊచకోత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved