- Home
- Sports
- Cricket
- Vaibhav Suryavanshi: తలపొగరెక్కితే దించేసుకో.! మరో పృథ్వీ షా అవుతావ్.. వైభవ్‌కు మాస్ వార్నింగ్
Vaibhav Suryavanshi: తలపొగరెక్కితే దించేసుకో.! మరో పృథ్వీ షా అవుతావ్.. వైభవ్‌కు మాస్ వార్నింగ్
Vaibhav Suryavanshi: తక్కువ వయస్సులోనే ఎంతగానో పేరు ప్రఖ్యాతలను సాధించిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు. అలాగే చిన్న వయస్సులోనే ఫేడ్ అవుట్ అయిన క్రికెటర్లు కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఓ మాజీ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో ఎంట్రీ..
2024లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగాడు వైభవ్ సుర్యవంశీ. అతడ్ని కేవలం రూ. 1.1 కోట్లకు ఆ జట్టు మెగా వేలంలో కొనుగోలు చేసింది. ఆ సమయానికి వైభవ్ వయస్సు 13 సంవత్సరాలే. ఇక తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు వైభవ్. గుజరాత్ టైటాన్స్‌పై అద్భుతమైన సెంచరీ సాధించి.. IPL చరిత్రలో అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆపై వైభవ్ ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై 78 బంతుల్లో 143 పరుగులు చేశాడు.
జైపూర్ సెంచరీతో 'సూపర్ స్టార్'..
ఏప్రిల్ 28న జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 35 బంతుల్లోనే 100 పరుగులు సాధించిన వైభవ్.. ఐపీఎల్ రికార్డుల్లో తనకంటూ ఓ పేజి లిఖించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 7 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. గుజరాత్‌లో సీనియర్ బౌలర్లు అయిన మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మలపై ఆధిపత్యం చెలాయించాడు. ఆ సమయంలోనే కామెంటరీ బాక్స్‌లో ఉన్న రవిశాస్త్రి, మాథ్యూ హేడెన్ సైతం వైభవ్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయిన విషయం తెలిసిందే.
రవిశాస్త్రి సలహా..
భారత మాజీ కోచ్ రవిశాస్త్రి వైభవ్‌ను ప్రశంసిస్తూనే మాస్ వార్నింగ్ ఒకటి ఇచ్చాడు. 'ఇది వైభవ్‌కు అత్యంత కష్టకాలం. ఇంత చిన్న వయసులోనే గొప్ప విజయాలు సాధించిన తర్వాత చాలామంది ఆటగాళ్ళు కనుమరుగయ్యారు. ఇది చాలా క్లిష్టమైన సమయం కాబట్టి, సీనియర్ ఎవరైనా అతనికి మార్గనిర్దేశం చేయాలి. అతను వైఫల్యాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి' అని అన్నాడు.
సచిన్, కోహ్లీతో పోలికలు..
వైభవ్‌ను ఇప్పుడే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ క్రికెటర్లతో పోల్చుతున్నారు. కానీ ఆ స్థాయికి చేరుకోవడానికి వైభవ్ చాలా కష్టపడాల్సి ఉంది. అంతేకాకుండా ఇంకా చాలానే సమయం పడుతుంది. 'ప్రతీసారి ఇలానే కష్టపడి పని చేస్తే కచ్చితంగా భవిష్యత్తులో అతడికి మంచి పేరు వస్తుంది. కానీ ప్రస్తుతానికి, అతడు నాలుగు రోజుల క్రికెట్‌పై దృష్టి సారించాలి. తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి' అని శాస్త్రి తెలిపాడు.
వైభవ్ కెరీర్ గణాంకాలు ఇలా..
రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ సుర్యవంశీ.. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లు ఆడి.. ఒక సెంచరీ, ఒక ఫిఫ్టీతో 252 పరుగులు చేశాడు. అలాగే అత్యధిక స్కోర్ 101 కాగా.. యావరేజ్ 36గా.. స్ట్రైక్ రేటు 206.56గా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లలో 18 ఫోర్లు, 24 సిక్సర్లు కొట్టాడు.