MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Sports
  • Vaibhav Suryavanshi : ఏమిటా బ్యాటింగ్ సామీ ! వైభవ్ సూర్యవంశీ 5 కొత్త రికార్డులు ఇవే

Vaibhav Suryavanshi : ఏమిటా బ్యాటింగ్ సామీ ! వైభవ్ సూర్యవంశీ 5 కొత్త రికార్డులు ఇవే

Vaibhav Suryavanshi : అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో వీరవిహారం చేశారు. 55 బంతుల్లోనే సెంచరీ బాది 5 అద్భుత రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 06 2026, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కేవలం 55 బంతుల్లోనే సెంచరీ.. కపిల్ దేవ్‌ను గుర్తు చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

కేవలం 55 బంతుల్లోనే సెంచరీ.. కపిల్ దేవ్‌ను గుర్తు చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ కీలక పోరులో బాస్ బేబీగా పిలవబడే వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లీష్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ కేవలం 55 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 175 పరుగుల భారీ స్కోరుతో భారత జట్టుకు తిరుగులేని స్థితిలోకి తీసుకొచ్చాడు.

ఈ టోర్నీ అంతటా నిలకడగా రాణించలేకపోయిన వైభవ్, సరైన సమయంలో అంటే ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అతని బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్‌ను గుర్తుకు తెచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా వైభవ్ సూర్యవంశీ నెలకొల్పిన 5 ప్రధాన రికార్డుల వివరాలు గమనిస్తే…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫైనల్ మ్యాచ్‌లో 15 సిక్సర్ల సునామీ రేపిన వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

ఫైనల్ మ్యాచ్‌లో 15 సిక్సర్ల సునామీ రేపిన వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ తన 175 పరుగుల ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 సిక్సర్లు బాదాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇన్ని సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లు వేసిన ప్రతి బంతిని స్టేడియం వెలుపలకు పంపిస్తూ భారీ హిట్టింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ రికార్డు అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

Related Articles

Related image1
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
Related image2
IND vs PAK : భారత్-పాక్ మ్యాచ్ ఖాయం.. రాసిపెట్టుకోండి పాకిస్థాన్ యూ టర్న్ !
36
ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ

కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి వైభవ్ సూర్యవంశీ అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 55 బంతుల్లోనే 100 పరుగుల మైలురాయిని చేరుకుని కొత్త చరిత్రను లిఖించాడు. ఇంతకు ముందు ఏ ఆటగాడు కూడా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంత వేగంగా సెంచరీ సాధించలేదు. ఆరంభం నుండే దూకుడుగా ఆడిన వైభవ్, ఇంగ్లాండ్ జట్టుపై మొదటి నుంచే పైచేయి సాధించాడు.

46
అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ

ఈ 175 పరుగుల ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన అతను 7 ఇన్నింగ్స్‌ల్లో 3 అర్ధసెంచరీలు, 1 సెంచరీతో కలిపి మొత్తం 439 పరుగులు సాధించాడు. టోర్నీ ఆరంభంలో తక్కువ పరుగులకే అవుట్ అయినప్పటికీ, ఫైనల్ ఇన్నింగ్స్‌తో ఓవరాల్ చార్ట్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

56
ఫాస్టెస్ట్ 150 రన్స్ రికార్డ్ సాధించిన వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

ఫాస్టెస్ట్ 150 రన్స్ రికార్డ్ సాధించిన వైభవ్ సూర్యవంశీ

సెంచరీ తర్వాత కూడా వైభవ్ తన దూకుడును ఏమాత్రం తగ్గించలేదు. కేవలం 71 బంతుల్లోనే 150 పరుగుల మార్కును దాటాడు. దీని ద్వారా అండర్-19 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్న క్రమంలో ఒక భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. అయితే అప్పటికే అతను భారత జట్టును బలమైన స్థితిలో నిలిపాడు.

66
టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ

ఈ ఏడాది అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల కింగ్ గా అవతరించాడు. ఈ టోర్నీ మొత్తంలో అతను 30 సిక్సర్లు బాదాడు. ఇందులో సగం అంటే 15 సిక్సర్లు కేవలం ఫైనల్ మ్యాచ్‌లోనే రావడం విశేషం. ఈ రికార్డుతో టోర్నీలోనే బిగ్గెస్ట్ హిట్టర్‌గా అతను పేరు సంపాదించుకున్నాడు. భారత క్రికెట్ భవిష్యత్తులో వైభవ్ ఒక గొప్ప ఆస్తి కానున్నాడని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Recommended image2
జాతీయ క్రీడా పురస్క‌రాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈసారి ఊహించ‌ని ట్విస్ట్
Recommended image3
Ayush Shetty: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్ 1 కు షాకిచ్చిన భారత ప్లేయర్
Related Stories
Recommended image1
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
Recommended image2
IND vs PAK : భారత్-పాక్ మ్యాచ్ ఖాయం.. రాసిపెట్టుకోండి పాకిస్థాన్ యూ టర్న్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved