MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND Vs ZIM : 6 6 6 6.. తిక్కరేగితే తిలక్ వర్మ ఆట ఇలానే ఉంటుంది.. 16 బంతుల్లోనే విధ్వంసం

IND Vs ZIM : 6 6 6 6.. తిక్కరేగితే తిలక్ వర్మ ఆట ఇలానే ఉంటుంది.. 16 బంతుల్లోనే విధ్వంసం

India vs Zimbabwe : టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వేపై తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగారు. కేవలం 16 బంతుల్లో 44 పరుగులు చేసి టీమ్ ఇండియా భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 26 2026, 09:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తిలక్ వర్మ సిక్సర్ల తుపాన్.. జింబాబ్వే బౌలర్లు బెంబేలు
Image Credit : Getty

తిలక్ వర్మ సిక్సర్ల తుపాన్.. జింబాబ్వే బౌలర్లు బెంబేలు

చెన్నైలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 పోరులో టీమ్ ఇండియా పరుగుల వరద పారించింది. ముఖ్యంగా యువ సంచలనం, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ తన బ్యాటింగ్‌తో స్టేడియంలో సిక్సర్ల మోత మోగించాడు. తిలక్ వర్మకు తిక్కరేగితే బాదడం మొదలుపెడితే గ్రౌండ్ ఏ మూలకైనా బంతి వెళ్లాల్సిందే అని మరోసారి నిరూపించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తిలక్ వర్మ సిక్సర్ల విధ్వంసం
Image Credit : Getty

తిలక్ వర్మ సిక్సర్ల విధ్వంసం

ఐదో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన తిలక్ వర్మ, క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే దూకుడు ప్రదర్శించాడు. కేవలం 16 బంతులు ఎదుర్కొన్న తిలక్, 275 స్ట్రైక్ రేట్‌తో 44 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా రిచర్డ్ ఎంగర్వ వేసిన 19వ ఓవర్లో తిలక్ వరుసగా రెండు సిక్సర్లు బాది జింబాబ్వే ఆశలపై నీళ్లు చల్లాడు. అంతకుముందు బ్లెస్సింగ్ ముజారబానీ ఓవర్లో కూడా భారీ సిక్సర్ కొట్టి తన ఫామ్‌ను చాటుకున్నాడు.

Related Articles

Related image1
IND vs ZIM : చావోరేవో.. టీమిండియా నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్స్ అవుట్
Related image2
IND Vs ZIM : అభిషేక్ శర్మ ఊచకోత.. జింబాబ్వే బౌలర్లు బలి
35
టీమ్ ఇండియా రికార్డు స్కోరు
Image Credit : Getty

టీమ్ ఇండియా రికార్డు స్కోరు

టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకోగా, భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లాండ్‌పై చేసిన 218 పరుగుల రికార్డును ఈ మ్యాచ్‌తో అధిగమించారు. అంతేకాకుండా, ఈ ఇన్నింగ్స్‌లో భారత్ మొత్తం 17 సిక్సర్లు కొట్టింది. ఇది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఉమ్మడి అత్యధికం.

45
అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా మెరుపులు
Image Credit : Getty

అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా మెరుపులు

తిలక్ వర్మతో పాటు ఓపెనర్ అభిషేక్ శర్మ (55 పరుగులు), హార్దిక్ పాండ్యా (50 నాటౌట్) అద్భుతంగా రాణించారు. హార్దిక్ పాండ్యా కేవలం 23 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 13 బంతుల్లో 33 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. భారత బ్యాటర్లందరూ 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 20 కంటే ఎక్కువ పరుగులు చేసి, 150+ స్ట్రైక్ రేట్ నమోదు చేయడం ఇదే తొలిసారి.

55
జింబాబ్వే బౌలర్ల ఇబ్బందులు
Image Credit : Getty

జింబాబ్వే బౌలర్ల ఇబ్బందులు

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా పిచ్‌పై తేమ ఉందని బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ, భారత బ్యాటర్లు వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. రిచర్డ్ ఎంగర్వ 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా, బ్రాడ్ ఎవాన్స్ 52 పరుగులు సమర్పించుకున్నాడు. టినోటెండ మాపోసా తన 2 ఓవర్లలోనే 40 పరుగులు ఇచ్చి భారీగా మూల్యం చెల్లించుకున్నాడు. భారత బ్యాటర్ల ధాటికి జింబాబ్వే ఫీల్డర్లు కూడా ఒత్తిడికి లోనై పలు క్యాచ్‌లు మిస్ చేశారు.

మలుపు తిప్పిన టాక్టికల్ మార్పులు

ఈ మ్యాచ్ కోసం భారత్ కొన్ని కీలక మార్పులు చేసింది. రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుని, అతడిని ఓపెనర్‌గా పంపింది. సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి శుభారంభం ఇచ్చాడు. తిలక్ వర్మకు ఐదో స్థానంలో కొత్త బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రయోగాలు ఫలించడంతో భారత్ హిస్టారికల్ స్కోరును నమోదు చేయగలిగింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image2
FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానుల‌కు ఉచిత టీవీల పంపిణీ చేస్తున్న కంపెనీ.. ఎందుకో తెలుసా.?
Recommended image3
FIFA World Cup 2026: వరల్డ్ కప్‌లో 96 ఏళ్ల రికార్డు బద్దలు.. ఎవరీ 17 ఏళ్ల గిల్బెర్టో మోరా?
Related Stories
Recommended image1
IND vs ZIM : చావోరేవో.. టీమిండియా నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్స్ అవుట్
Recommended image2
IND Vs ZIM : అభిషేక్ శర్మ ఊచకోత.. జింబాబ్వే బౌలర్లు బలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved