MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Vaibhav Sooryavanshi: ఐపీఎల్ మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఈ యువ ఆటగాడు సిక్సర్ల వర్షం కురిపించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 30 2026, 11:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెన్నైపై విరుచుకుపడ్డ వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Image Credit : X/IPL

చెన్నైపై విరుచుకుపడ్డ వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం

గువహటిలోని బర్సాపరా స్టేడియం పరుగుల వర్షం కురిపించాడు యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో లో భాగంగా చెన్నై టీమ్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలర్లను వణికించాడు. 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ కనీవినీ ఎరుగని ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డులను తిరగరాశాడు.

First time was so nice…. 🫡🔥 pic.twitter.com/5gEvLOBvZM

— Rajasthan Royals (@rajasthanroyals) March 30, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సీఎస్కే బ్యాటర్ల వైఫల్యం.. జడేజా మాయాజాలం
Image Credit : Getty

సీఎస్కే బ్యాటర్ల వైఫల్యం.. జడేజా మాయాజాలం

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ధాటికి కుప్పకూలింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన మాజీ టీమ్ పై విరుచుకుపడ్డాడు. జడేజా తన స్పిన్ మాయాజాలంతో సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబేలను అవుట్ చేసి చెన్నై నడ్డి విరిచాడు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై భారీ స్కోరు సాధించలేకపోయింది.

Related Articles

Related image1
IPL 2026 : రికార్డుల మోత మోగించిన హిట్ మ్యాన్ సేన
Related image2
IPL ఎంట్రీలోనే సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవడ్రా ఈ జేకబ్ డఫీ?
35
15 బంతుల్లోనే విధ్వంసం: వైభవ్ వీరవిహారం
Image Credit : X/IPL

15 బంతుల్లోనే విధ్వంసం: వైభవ్ వీరవిహారం

129 పరుగుల లక్ష్యం చిన్నదే అయినా, వైభవ్ సూర్యవంశీ ఆ లక్ష్యాన్ని మరింత చిన్నదిగా చేసేశాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్, మొదటి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్ వంటి సీనియర్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీల వర్షం కురిపించాడు. పవర్ ప్లే ముగిసేలోపే మ్యాచ్ రాజస్థాన్ వైపు మారింది. వైభవ్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు బాదాడు.

రికార్డుల వేటలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ సాధించిన ఈ 15 బంతుల హాఫ్ సెంచరీ రాజస్థాన్ రాయల్స్ చరిత్రలో మూడవ అత్యంత వేగవంతమైనది. గతంలో 2023లో యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు వైభవ్ 15 బంతుల్లో దీనిని అందుకున్నాడు. విశేషమేమిటంటే, 2025 సీజన్‌లో కూడా వైభవ్ గుజరాత్ టైటాన్స్‌పై 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో అతను తన సొంత రికార్డును మెరుగుపరుచుకున్నాడు.

45
రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు:
Image Credit : X/rajasthanroyals

రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు:

  1. 13 బంతులు - యశస్వి జైస్వాల్ (v KKR, 2023)
  2. 15 బంతులు - వైభవ్ సూర్యవంశీ (v CSK, 2026)*
  3. 17 బంతులు - వైభవ్ సూర్యవంశీ (v GT, 2025)
  4. 18 బంతులు - జోస్ బట్లర్ (v DD, 2018)
55
యూసుఫ్ పఠాన్ రికార్డు సమం చేసిన వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

యూసుఫ్ పఠాన్ రికార్డు సమం చేసిన వైభవ్ సూర్యవంశీ

ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ భారత ఐపీఎల్ దిగ్గజం యూసుఫ్ పఠాన్ రికార్డును సమం చేశాడు. యూసుఫ్ పఠాన్ కూడా గతంలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన భారతీయుల జాబితాలో వైభవ్ ఇప్పుడు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. జైస్వాల్ (13 బంతులు), కేఎల్ రాహుల్ (14 బంతులు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

వైభవ్ సునామీ నాక్.. రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ

వైభవ్ మొత్తంగా 17 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అన్షుల్ కంబోజ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి సర్ఫరాజ్ ఖాన్ చేతికి చిక్కాడు. అప్పటికే రాజస్థాన్ గెలుపు ఖాయమైపోయింది. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ చిన్నారి, ఇప్పుడు మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే ఐపీఎల్ 2026లో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 12.1 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Recommended image2
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ రచ్చ.. షకీరా నుంచి కేటీ పెర్రీ దాకా.. ఇండియా టైమింగ్స్ ఇవే !
Recommended image3
FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !
Related Stories
Recommended image1
IPL 2026 : రికార్డుల మోత మోగించిన హిట్ మ్యాన్ సేన
Recommended image2
IPL ఎంట్రీలోనే సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవడ్రా ఈ జేకబ్ డఫీ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved