MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL ఎంట్రీలోనే సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవడ్రా ఈ జేకబ్ డఫీ?

IPL ఎంట్రీలోనే సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవడ్రా ఈ జేకబ్ డఫీ?

Jacob Duffy : ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ జేకబ్ డఫీ దుమ్మురేపాడు. సూపర్ బౌలింగ్ తో 3 వికెట్లతో చెలరేగి, జోష్ హాజిల్‌వుడ్ లోటును భర్తీ చేస్తూ సంచలన అరంగేట్రం చేశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 28 2026, 10:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ ఎంట్రీలోనే సంచలనం రేపిన జేకబ్ డఫీ
Image Credit : X/RCBTweets

ఐపీఎల్ ఎంట్రీలోనే సంచలనం రేపిన జేకబ్ డఫీ

ఐపీఎల్ 2026 సీజన్ బౌండరీల వర్షంతో ఘనంగా ప్రారంభమైంది. అయితే తొలి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు జేకబ్ డఫీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున బరిలోకి దిగిన ఈ న్యూజిలాండ్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు.

స్టార్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ అందుబాటులో లేని సమయంలో జట్టులోకి వచ్చిన డఫీ, ఆ లోటు ఏమాత్రం తెలియకుండా అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌కు ఆర్సీబీ దక్కించుకున్న ఈ బౌలర్, తన మొదటి మ్యాచ్‌లోనే అంచనాలను మించి రాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ ధ్వంసం.. పవర్‌ప్లేలో జేకబ్ డఫీ ప్రతాపం
Image Credit : Gemini

సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ ధ్వంసం.. పవర్‌ప్లేలో జేకబ్ డఫీ ప్రతాపం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు జేకబ్ డఫీ చుక్కలు చూపించాడు. విధ్వంసకర ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లను తన వేగంతో బోల్తా కొట్టించాడు. మూడో ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ తీసిన డఫీ, అదే ఓవర్లో ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్‌ను కూడా పెవిలియన్ పంపాడు.

ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని కూడా అవుట్ చేసి, పవర్‌ప్లే ముగిసేలోపే సన్‌రైజర్స్‌ను 33/3 స్కోరుతో కష్టాల్లోకి నెట్టాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కొత్త బంతితో అతను చూపించిన నియంత్రణ, స్వింగ్ ఆర్సీబీ అభిమానులను ఫిదా చేసింది.

Related Articles

Related image1
RCB vs SRH : ఆర్‌సీబీ ప్లేయర్లు నల్ల బ్యాండ్‌లు ఎందుకు ధరించారు?
Related image2
RCB vs SRH : హైదరాబాద్ కొత్త బాస్ ఇషాన్ కిషన్.. కమిన్స్ లేకపోయినా తగ్గేదేలే.. దుమ్మురేపాడు భయ్యా
35
ఏడు ఓవర్లతోనే ముగిసిన డఫీ పని
Image Credit : X/RCBTweets

ఏడు ఓవర్లతోనే ముగిసిన డఫీ పని

ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డఫీ తన 4 ఓవర్ల కోటాను 7వ ఓవర్ లోనే పూర్తి చేశాడు. ఆ వెంటనే ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా దేవదత్ పడిక్కల్‌ను మైదానంలోకి పంపింది. దీనిపై కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ స్పందిస్తూ.. "డఫీ తన పని పూర్తి చేశాడు కదా, అతను ఇప్పుడు హోటల్‌కు వెళ్ళిపోవచ్చా?" అని సరదాగా ప్రశ్నించారు. దీనికి ఆర్సీబీ మెంటార్ దినేష్ కార్తీక్ సమాధానమిస్తూ.. "నిబంధనల ప్రకారం మ్యాచ్ ముగిసే వరకు అతను స్టేడియంలోనే ఉండాలి. కానీ, ఈ రోజుకు అతని పని పూర్తయింది. అతను మళ్ళీ బ్యాటింగ్ చేయలేడు, ఫీల్డింగ్‌కు కూడా రాడు. తను అద్భుతమైన పని చేశాడు" అని ప్రశంసలు కురిపించాడు.

45
జోష్ హాజిల్‌వుడ్ స్థానానికి సరైన ప్రత్యామ్నాయం అతనే
Image Credit : X/RCBTweets

జోష్ హాజిల్‌వుడ్ స్థానానికి సరైన ప్రత్యామ్నాయం అతనే

ఆర్సీబీ ప్రధాన బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరం కావడంతో మేనేజ్‌మెంట్ డఫీపై నమ్మకం ఉంచింది. డఫీ శైలి హాజిల్‌వుడ్‌ను పోలి ఉంటుందని దినేష్ కార్తీక్ వెల్లడించారు. "హాజిల్‌వుడ్ ఇచ్చే నియంత్రణ, బౌన్స్, సీమ్ పొజిషన్‌ను డఫీ కూడా ఇవ్వగలడని మేము నమ్మము. ఈ రోజు అతను అదే నిరూపించాడు" అని కార్తీక్ పేర్కొన్నారు. గతంలో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసినప్పుడు కూడా పాకిస్థాన్‌పై 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన చరిత్ర డఫీకి ఉంది. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అదే తరహా ఇంపాక్ట్ చూపించాడు.

55
జేకబ్ డఫీ క్రికెట్ కెరీర్ ఇదే
Image Credit : X/RCBTweets

జేకబ్ డఫీ క్రికెట్ కెరీర్ ఇదే

31 ఏళ్ల జేకబ్ డఫీ న్యూజిలాండ్‌లోని సౌత్‌ల్యాండ్ ప్రాంతానికి చెందినవాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఇతను, కివీస్ దేశవాళీ క్రికెట్‌లో ఒటాగో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 169 టీ20 మ్యాచ్‌లు ఆడిన డఫీ 192 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 సార్లు నాలుగు వికెట్లు, 2 సార్లు ఐదు వికెట్లు తీసిన రికార్డు ఉంది. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా అతనికి బాగా కలిసొచ్చింది. తక్కువ ధరకే లభించిన ఈ స్మార్ట్ బై డఫీ రాబోయే మ్యాచ్‌ల్లో ఆర్సీబీకి ప్రధాన ఆయుధంగా మారే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బెంగళూరు
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానుల‌కు ఉచిత టీవీల పంపిణీ చేస్తున్న కంపెనీ.. ఎందుకో తెలుసా.?
Related Stories
Recommended image1
RCB vs SRH : ఆర్‌సీబీ ప్లేయర్లు నల్ల బ్యాండ్‌లు ఎందుకు ధరించారు?
Recommended image2
RCB vs SRH : హైదరాబాద్ కొత్త బాస్ ఇషాన్ కిషన్.. కమిన్స్ లేకపోయినా తగ్గేదేలే.. దుమ్మురేపాడు భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved