MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • ట్రావిస్ హెడ్ తుపాన్‌లో కొట్టుకుపోయిన ఇంగ్లండ్.. స్టోక్స్ కామెంట్స్ వైరల్

ట్రావిస్ హెడ్ తుపాన్‌లో కొట్టుకుపోయిన ఇంగ్లండ్.. స్టోక్స్ కామెంట్స్ వైరల్

Ashes Test : ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో యాషెస్ తొలి టెస్ట్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. తమ ఆశలను చిదిమేసిందంటూ ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 22 2025, 07:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తొలి టెస్ట్‌ను ఏకపక్షంగా మార్చిన ట్రావిస్ హెడ్ తుపాన్
Image Credit : Getty

తొలి టెస్ట్‌ను ఏకపక్షంగా మార్చిన ట్రావిస్ హెడ్ తుపాన్

యాషెస్ సిరీస్‌ తొలి టెస్టు ఊహించిన దానికంటే భిన్నంగా మారిపోయింది. ఉరుముల వానలా ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌ తో విరుచుకుపడ్డాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ నాక్ తో ఇంగ్లండ్ ఆశలను పూర్తిగా ధ్వంసం చేశాడు.

కేవలం 83 బంతుల్లో 123 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో మ్యాచ్‌ ఫలితాన్ని ఒక్కచేత్తో మార్చేశాడు. ఇది టెస్టు మ్యాచ్ అనే విషయం మర్చిపోయినట్టుగా టీ20 తరహాలో దంచికొట్టాడు.

205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఎలాంటి సందేహం లేకుండా, ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలోనే విజయం సాధించడంలో హెడ్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. ఇంగ్లండ్ బౌలర్లను పూర్తిగా దెబ్బకొడుతూ 16 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో అతను ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బెన్స్ స్టోక్స్ ఏమన్నారంటే?
Image Credit : X/cricket.com.au

బెన్స్ స్టోక్స్ ఏమన్నారంటే?

మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నిరాశను వ్యక్తం చేశాడు. “మ్యాచ్ మొత్తం మా నియంత్రణలో ఉందనుకున్నాం. కానీ ట్రావిస్ హెడ్ మా ప్రణాళికలను ఛిన్నాభిన్నం చేశాడు. అతను దూకుడు బ్యాటింగ్ తో మా ఆశలను చిదిమేశాడు” అని స్టోక్స్ పేర్కొన్నాడు.

స్టోక్స్ చెప్పడం కాదు.. ఫీల్డ్ జరిగిన ప్రతి క్షణం కూడా ట్రావిస్ హెడ్ ప్రభావాన్ని స్పష్టంగా చూపించింది. ఇంగ్లండ్ తమ ముందున్న అన్ని వ్యూహాలను ప్రయత్నించినా, హెడ్ ను అడ్డుకోలేకపోయింది.

Related Articles

Related image1
ఐపీఎల్ 2026 వేలం: కావ్య పాప మాస్టర్ ప్లాన్ బయటపడ్డది ! ఎవరిపై కన్నేసిందో తెలుసా?
Related image2
ఇంగ్లండ్‌పై మిచెల్ స్టార్క్ సునామీ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో బాహుబలి రికార్డు
35
మొదట బౌలర్ల ఆధిపత్యం.. చివరి ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ జోరు
Image Credit : X/SunRisers

మొదట బౌలర్ల ఆధిపత్యం.. చివరి ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ జోరు

ఈ టెస్ట్ మ్యాచ్ పూర్తిగా బౌలర్ల ఆధిపత్యాన్ని ప్రతిబింబించింది. రెండు జట్లు కూడా బ్యాటింగ్‌ చేయడానికి కష్టపడ్డాయి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయినా, బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై 205 లక్ష్యం సులువుకాదని అందరూ అనుకున్నారు. కానీ హెడ్ ఆ అంచనాలను తారుమారు చేశాడు. మార్నస్ లబుషేన్ కూడా 51 పరుగులతో అజేయంగా నిలిచి కంగారులకు విజయం అందించాడు.

45
మిచెల్ స్టార్క్‌ కొత్త రికార్డలు
Image Credit : Getty

మిచెల్ స్టార్క్‌ కొత్త రికార్డలు

ఈ మ్యాచ్‌లో మరోసారి మిచెల్ స్టార్క్‌ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7/58, రెండో ఇన్నింగ్స్‌లో 3/55 తీసి మొత్తం 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

34 ఏళ్ల తర్వాత యాషెస్ టెస్ట్‌లో 10 వికెట్లు తీయగలిగిన తొలి ఆస్ట్రేలియా పేసర్‌గా స్టార్క్ చరిత్ర సృష్టించాడు.

అదే కాక, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 200 వికెట్లు పూర్తి చేసిన మూడో ఆస్ట్రేలియా బౌలర్‌గా కూడా స్టార్క్ ఘనత సాధించాడు.

1991లో క్రైగ్ మెక్‌డెర్మోట్ తర్వాత ఈ ఘనతను సాధించిన మరో ఆసీస్ పేసర్‌గా స్టార్క్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు.

55
సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యం
Image Credit : Getty

సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యం

ఈ విజయం తర్వాత ఆసీస్ 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ నవంబర్ 29 నుంచి కాన్‌బెర్రాలో జరగనుంది. ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే, ఈ పరాజయం వారికి తీవ్రమైన దెబ్బగా మారింది. బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ, హెడ్ ఇన్నింగ్స్‌ ముందు వారి బౌలింగ్ పనిచేయలేదు. స్టోక్స్ కూడా ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమనిపిస్తోందని అన్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
ఐపీఎల్ 2026 వేలం: కావ్య పాప మాస్టర్ ప్లాన్ బయటపడ్డది ! ఎవరిపై కన్నేసిందో తెలుసా?
Recommended image2
ఇంగ్లండ్‌పై మిచెల్ స్టార్క్ సునామీ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో బాహుబలి రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved