MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • IPL : రోహిత్, రషీద్ ఖాన్ నుంచి మాక్స్‌వెల్ వరకు.. ఎందుకు సామీ ఈ చెత్త రికార్డులు !

IPL : రోహిత్, రషీద్ ఖాన్ నుంచి మాక్స్‌వెల్ వరకు.. ఎందుకు సామీ ఈ చెత్త రికార్డులు !

IPL Unwanted Records : ఐపీఎల్ 2026 సీజన్ కు సర్వం సిద్ధమైంది. అయితే, ఏ ప్లేయర్ కూడా కోరుకోని చెత్త రికార్డులను పలువురు ప్లేయర్ల ఖాతాలో పడ్డాయి. రోహిత్ శర్మ, రషీద్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్ల పేరిట ఉన్న ఆ చెత్త రికార్డుల ఏంటి? 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 19 2026, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్ల అన్‌వాంటెడ్ రికార్డులు
Image Credit : ANI

ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్ల అన్‌వాంటెడ్ రికార్డులు

ప్రపంచంలోనే అత్యంత ధనిక, ఆదరణ కలిగిన టీ20 లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వెలుగొందుతోంది. 2008లో ప్రారంభమైన నాటి నుండి ఈ లీగ్ ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. మైదానంలో అద్భుత ప్రదర్శనలతో అనేక మంది ఆటగాళ్లు రికార్డుల పుస్తకాల్లోకెక్కారు. అయితే, క్రికెట్ ప్రపంచంలో దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న కొందరు ఆటగాళ్ల పేరిట కొన్ని అవాంఛిత రికార్డులు కూడా ఉన్నాయి. వారు మర్చిపోవాలని కోరుకునే ఆ ఐదు చేదు రికార్డుల వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. రోహిత్ శర్మ: అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్
Image Credit : Facebook/Mumbai Indians

1. రోహిత్ శర్మ: అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరిగా, మాజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు గొప్ప పేరుంది. కానీ, ఆయన పేరిట ఒక చెత్త రికార్డు కూడా ఉంది. రోహిత్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఆడిన 267 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 83 సార్లు సింగిల్ డిజిట్ (పది కంటే తక్కువ) స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇందులో 18 డకౌట్లు కూడా ఉన్నాయి. రోహిత్ తర్వాత దినేష్ కార్తీక్ (72), విరాట్ కోహ్లీ (59), రాబిన్ ఉతప్ప (57), శిఖర్ ధావన్ (56) ఈ జాబితాలో ఉన్నారు.

Related Articles

Related image1
IPL 2026 : ఐపీఎల్ జట్లకు దడపుట్టిస్తున్న కేకేఆర్ మాస్టర్ ప్లాన్ !
Related image2
Peddi : పెద్ది సెట్స్‌లో తిలక్ రచ్చ.. చరణ్ అదిరిపోయే గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో
36
2. రషీద్ ఖాన్: ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్
Image Credit : ANI

2. రషీద్ ఖాన్: ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్

ప్రస్తుత తరం టీ20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ అత్యంత ప్రమాదకరమైన స్పిన్నర్ అనడంలో సందేహం లేదు. కానీ, ఐపీఎల్ 2025 సీజన్ అతనికి పీడకలలా మిగిలిపోయింది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రషీద్, ఆ ఒక్క సీజన్‌లోనే ప్రత్యర్థి బ్యాటర్ల చేతిలో ఏకంగా 33 సిక్సర్లు బాదించుకున్నాడు. ఆ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ఆయన కేవలం 9 వికెట్లు మాత్రమే తీసి, 9.34 ఎకానమీతో 514 పరుగులు సమర్పించుకున్నాడు. ఆయన సగటు 57.11గా నమోదైంది.

46
3. జోఫ్రా ఆర్చర్: అత్యంత ఖరీదైన బౌలింగ్ గణాంకాలు
Image Credit : ANI

3. జోఫ్రా ఆర్చర్: అత్యంత ఖరీదైన బౌలింగ్ గణాంకాలు

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన వేగంతో ఎందరో బ్యాటర్లను వణికించాడు. అయితే, ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఒక ఘోరమైన రికార్డును మూటగట్టుకున్నాడు. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆర్చర్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇందులో నాలుగు బైలు, ఒక నో బాల్ ఉన్నాయి. ఒక్కో ఓవర్‌లో వరుసగా 23, 12, 22, 23 పరుగులు ఇచ్చి అభిమానులను షాక్ కు గురిచేశాడు.

56
4. హర్షల్ పటేల్: అత్యంత ఖరీదైన ఓవర్ (37 పరుగులు)
Image Credit : our own

4. హర్షల్ పటేల్: అత్యంత ఖరీదైన ఓవర్ (37 పరుగులు)

ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న హర్షల్ పటేల్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 37 పరుగులు ఇచ్చాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన పటేల్‌ను రవీంద్ర జడేజా ఊచకోత కోశాడు. ఆ ఓవర్‌లో జడేజా ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. అందులో ఒక నో బాల్ కూడా ఉంది. గతంలో 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ కూడా ఆర్‌సీబీపైనే 37 పరుగులు ఇచ్చారు. ఇప్పుడు ఆ రికార్డును పటేల్ సమం చేశాడు.

66
5. గ్లెన్ మాక్స్‌వెల్: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు (19)
Image Credit : X/@UniqueF_KajalA

5. గ్లెన్ మాక్స్‌వెల్: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు (19)

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ తనదైన రోజున బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. కానీ, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన రికార్డు ఆయన పేరిటే ఉంది. మాక్స్‌వెల్ 139 ఇన్నింగ్స్‌ల్లో 19 సార్లు డకౌట్ అయ్యాడు. ఇటీవల ఐపీఎల్ 2026 నుండి తప్పుకుంటున్నట్లు భావోద్వేగ సందేశం ఇచ్చిన మాక్స్‌వెల్, ఈ చెత్త రికార్డులో టాప్ లో ఉన్నాడు. ఆయన తర్వాత దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ చెరో 18 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
క్రికెట్
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IPL 2026 : ఐపీఎల్ జట్లకు దడపుట్టిస్తున్న కేకేఆర్ మాస్టర్ ప్లాన్ !
Recommended image2
Peddi : పెద్ది సెట్స్‌లో తిలక్ రచ్చ.. చరణ్ అదిరిపోయే గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved