ఇదేం చెత్త రికార్డు రుతురాజ్ భాయ్.! 4 సెంచరీలు.. 4 ఓటములు.. పరువు మొత్తం పోయిందిగా
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికాతో జరిగిన రాయ్‌పూర్ వన్డేలో తన తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీ సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శన క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గైక్వాడ్ ఆటతీరు..

అద్భుత శతకం..
రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో తన తొలి అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ చేసిన 100 పరుగులు అతని కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచాయి. తన వన్డే కెరీర్‌లో అతడికి ఇది తొలి శతకం కాగా.. ఈ సెంచరీతో గైక్వాడ్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
విరాట్‌తో కీలక భాగస్వామ్యం..
ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ బ్యాటింగ్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. విరాట్ కోహ్లీతో కలిసి రన్స్ రాబట్టడం, అలాగే స్ట్రైక్ రొటేట్ చేయడం చూస్తే ఓ సీనియర్ ప్లేయర్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక వన్డేల్లో ఇది మొదటి సెంచరీ కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు రెండోది. అయితే ఈ రెండు సెంచరీలు చేసినప్పుడు.. టీమిండియా ఆ మ్యాచ్‌లలో ఓడిపోవడం గమనార్హం.
సెంచరీలు.. ఓటములు..
గతంలో, నవంబర్ 28, 2023న, గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో, గైక్వాడ్ అద్భుతమైన 123 పరుగులు చేశాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో అతని మొదటి సెంచరీ. అయితే, గ్లెన్ మాక్స్‌వెల్ సెంచరీ కారణంగా ఆస్ట్రేలియా 223 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తద్వారా ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది.
ఐపీఎల్‌లోనూ అంతే..
అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు ఐపీఎల్‌లోనూ గైక్వాడ్ సెంచరీల స్టోరీ ఇంతే.! ఓ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సెంచరీ సాధించిన సమయంలో జట్టు ఓడిపోయిన సందర్భాలు రెండు ఉన్నాయి. మొదటిది, ఐపీఎల్ 2021లో, రుతురాజ్ రాజస్థాన్ రాయల్స్‌పై 101 పరుగులు చేశాడు. ఇందులో రాజస్థాన్ 190 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. ఆ తర్వాత, ఐపీఎల్ 2024లో, గైక్వాడ్ లక్నో సూపర్ జెయింట్స్‌పై 108 పరుగులు చేశాడు. లక్నో కూడా 211 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.
మూడో వన్డేకు ఛాన్స్.?
ఇక రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాధించడంతో కచ్చితంగా మూడో వన్డేలో కూడా అతడికి స్థానం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. గంభీర్ చెప్పినట్టుగా మంచిగా ఆడే ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే.. వారు తమ ప్రతిభను నిరూపించుకోగలరని అంటున్నారు.

