ఐపీఎల్ మినీ వేలంలోకి విడుదలైన టాప్ 5 ప్లేయర్స్ వీరే.. ధర చూస్తే దిమ్మతిరిగిపోతోంది
ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ లిస్టులను ప్రకటించాయి. ఇక మినీ వేలానికి నెల రోజుల మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో వేలంలోకి వచ్చిన ఐదు టాప్ ప్లేయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా..

జట్టు బలోపేతం ముఖ్యం..
ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజీ అయినా కూడా.. తమ జట్టును బలోపేతం చేసుకోవాలని చూస్తుంటాయి. అందుకు తగ్గట్టుగానే భారీగా ధరను వెచ్చించి మరీ కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఆ క్రమంలో కొనుగోలు చేసిన ప్లేయర్స్ కొందరు నిరాశపరచడంతో మళ్లీ వారికి ఉద్వాసన పలకాల్సి వస్తుంది. అలా నెక్స్ట్ సీజన్ ముందుగా వదిలేసిన టాప్ ఫైవ్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం మరి..
టాప్ 5 ప్లేయర్స్ వీరే
ఈ టాప్ 5 ప్లేయర్స్ రిలీజ్ లిస్టు మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరుస్తుంది.! ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా జట్టుకు మ్యాచ్ విన్నర్ గా నిలిచిన ఓ ప్లేయర్ కూడా ఇందులో ఉన్నాడు. అతడు మరెవరో కాదు ఆండ్రీ రస్సెల్. కేకేఆర్ మ్యాచ్ విన్నర్ అయిన రస్సెల్ ఈసారి మినీ వేలంలోకి రానున్నాడు. 2025 మెగా వేలానికి ముందుగా కేకేఆర్.. రస్సెల్ ను రూ. 12 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. అయితే ఈసారి ఆ జట్టు అతడ్ని అనూహ్యంగా రిలీజ్ చేసింది.
లక్నో నుంచి ఆ ప్లేయర్
ఇక లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రూ. 11 కోట్ల రవి బిష్ణోయ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రూ. 8.75 కోట్ల లియామ్ లివింగ్‌స్టన్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి రూ. 13 కోట్ల మతీషా పతిరానా.. అలాగే కేకేఆర్ మిడిలార్డర్ బ్యాటర్ రూ. 23.7 కోట్ల వెంకటేష్ అయ్యర్ ఈ టాప్ 5 రిలీజ్ లిస్టులో ఉన్నారు.
అత్యధిక ధర ప్లేయర్ అవుట్..
ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ విషయానికొస్తే.. 2025 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ గా నిలిచాడు. కేకేఆర్ తో పాటు మరో ఫ్రాంచైజీ కూడా వెంకటేష్ అయ్యర్ కోసం శతవిధాలా ప్రయత్నించింది. అయితే తమ ఆటగాడిని మరోసారి ఎక్కువ ధర అయినా పర్లేదని చేర్చుకుంది కేకేఆర్. కానీ అంత డబ్బు పెట్టిన దానికి అంచనాలు అందుకోలేకపోయాడు వెంకటేష్ అయ్యర్.
చెన్నై, లక్నో నుంచి వీరు..
ఇక రవి బిష్ణోయ్, మతీషా పతిరానా కూడా అటు లక్నో సూపర్ జెయింట్స్, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇవ్వలేకపోయారు. అంత డబ్బుతో వీరిని అట్టిపెట్టుకునే బదులుగా.. మరో ఇద్దరినీ తీసుకునే ఛాన్స్ ఉండటంతో వారిని విడుదల చేశాయి ఆయా ఫ్రాంచైజీలు. లివింగ్ స్టన్ పరిస్థితి కూడా అంతే.!