కావ్యపాప ఖతర్నాక్ ప్లాన్.. SRH రిలీజ్ చేసే ప్లేయర్స్ వీరే.. లిస్టులో ప్రపంచకప్ విన్నర్
SRH తమ ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది. రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్టు రెడీ కాగా.. ఈసారి మినీ వేలంలోకి వదిలేసే ప్లేయర్స్ ఊహించని విధంగా ఉంటారని సమాచారం.

మరికొద్ది గంటల్లో విడుదల..
రిటైన్, రిలీజ్ లిస్టు అధికారిక ప్రకటనకు మరికొద్ది గంటల సమయం ఉంది. నవంబర్ 15వ తేదీ, సాయంత్రం 5 గంటల నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్టులను విడుదల చేయనున్నాయి. అయితే డిసెంబర్ 15 వరకు ట్రేడ్ డీల్స్ సమయం ఉండటంతో.. ఎప్పుడైనా సెన్సేషనల్ న్యూస్ వినడం పక్కా.
బెంచ్ బలం కోసం..
పాట్ కమ్మిన్స్ సారధ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బెంచ్‌ను బలపరుచుకునేందుకు సిద్దమైంది. పలు కీలక ఆటగాళ్ళను విడుదల చేయనుంది. లిస్టులో బడా ప్లేయర్స్ ఉండగా.. ఓ ప్రపంచకప్ విన్నర్ కూడా అందులో ఉండటం గమనార్హం.
కోర్ టీం ఇదే..
రిటైన్ చేసుకునే ప్లేయర్స్‌లో ముఖ్యంగా పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, ఇషాన్ కిషన్ ఉండనున్నారు. ఈ ఆరుగురు హైదరాబాద్ జట్టు కోర్ టీం కానున్నారు. అలాగే పలువురు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌కు కూడా మరో అవకాశం ఇచ్చింది ఫ్రాంచైజీ.
రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ వీరే..
అథర్వ టైదే, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారి, స్మరన్ రవిచంద్రన్, హర్ష దూబే, సిమర్జీట్ సింగ్ రిటైన్ ప్లేయర్స్ లిస్టులో ఉండగా.. అభినవ్ మనోహర్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, అడమ్ జంపా, బ్రైడన్ కార్సే, వియాన్ ముల్దర్, కమిండు మెండిస్ రిలీజ్ లిస్టులో ఉన్నారని సమాచారం.
గత సీజన్ చేదు అనుభవం..
కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ గత సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. ఆడిన 14 మ్యాచ్‌లలో ఆరు గెలిచి, ఏడు ఓడిపోయి.. 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. అలాగే 300 లోడింగ్ అనే ప్రచారం.. గత సీజన్‌లో SRHని కూసింత దెబ్బ తీసిందని చెప్పొచ్చు.