MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్

Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2026లో పేలవ ప్రదర్శన, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. ఫిట్‌నెస్ సమస్యల వల్ల టీమిండియా వన్డే జట్టుకు దూరం కానున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 21 2026, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హార్దిక్ పాండ్యా ఐపీఎల్ కెప్టెన్సీ పోయింది.. వన్డే వరల్డ్ కప్ 2027 లోనూ నో ఛాన్స్?
Image Credit : Getty

హార్దిక్ పాండ్యా ఐపీఎల్ కెప్టెన్సీ పోయింది.. వన్డే వరల్డ్ కప్ 2027 లోనూ నో ఛాన్స్?

ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అస్సలు కలిసి రావడం లేదు. ముంబై టీమ్ వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా, ఇప్పుడు కెప్టెన్ హార్దిక్‌కు మరో పెద్ద షాక్ తగిలింది. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై టీమ్ ఓడిపోవడమే కాకుండా, మైదానంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు హార్దిక్ పాండ్యాపై ఐపీఎల్ కమిటీ జరిమానా విధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గ్రౌండ్‌లో అసలు ఏం జరిగిందంటే..?
Image Credit : ANI

గ్రౌండ్‌లో అసలు ఏం జరిగిందంటే..?

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ నాలుగో బంతి వేసిన తర్వాత ఈ వివాదాస్పద ఘటన జరిగింది. హార్దిక్ పాండ్యా తన రన్-అప్‌కు తిరిగి వెళ్లే క్రమంలో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆ కోపంలో వికెట్లపై ఉన్న గిల్లీలను గట్టిగా కిందకు నెట్టేసాడు. 

క్రికెట్ కిట్, దుస్తులు, గ్రౌండ్ ఎక్విప్‌మెంట్‌ను తప్పుగా ఉపయోగించడం ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధం. హార్దిక్ తన తప్పును మ్యాచ్ రెఫరీ రాజీవ్ సేథ్ ముందు అంగీకరించాడు. దీంతో జరిమానాతో పాటు అతనికి ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించారు. ఐపీఎల్‌లో 4 నుండి 7 డిమెరిట్ పాయింట్లు వస్తే ఒక మ్యాచ్‌ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 26 పరుగులు చేసి, బౌలింగ్‌లో 2 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చాడు.

34
తప్పులను ఒప్పుకున్న కెప్టెన్.. సీజన్ మొత్తం ఫ్లాప్ షో
Image Credit : ANI

తప్పులను ఒప్పుకున్న కెప్టెన్.. సీజన్ మొత్తం ఫ్లాప్ షో

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ తమ వైఫల్యాలను ఒప్పుకున్నాడు. బ్యాటింగ్‌లో తాము 20 పరుగులు తక్కువ చేశామని, అలాగే ఈ సీజన్ మొత్తం తమ ఫీల్డింగ్ చాలా అధ్వాన్నంగా సాగిందని హార్దిక్ అన్నాడు. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ముంబై కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ముంబై తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.

44
వరల్డ్ కప్ 2027 ప్లాన్స్.. హార్దిక్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ డౌట్స్
Image Credit : Getty

వరల్డ్ కప్ 2027 ప్లాన్స్.. హార్దిక్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ డౌట్స్

ఐపీఎల్ వివాదాలు ఒకవైపు ఉంటే, హార్దిక్ పాండ్యాకు టీమిండియా పరంగానూ పెద్ద షాక్ తగిలేలా ఉంది. బీసీసీఐ ఇటీవల నిర్వహించిన ఒక మీటింగ్‌లో వన్డే వరల్డ్ కప్ 2027 రోడ్‌మ్యాప్ గురించి చర్చించారు. ఈ క్రమంలో హార్దిక్ ఫిట్‌నెస్‌పై బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఐపీఎల్ మధ్యలో గాయం కారణంగా హార్దిక్ 3-4 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. త్వరలో అఫ్గానిస్థాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేసినప్పటికీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒక కండిషన్ పెట్టారు. హార్దిక్ జట్టులోకి రావాలంటే ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. వన్డే మ్యాచ్‌ల్లో హార్దిక్ పూర్తి స్థాయిలో 10 ఓవర్లు బౌలింగ్ చేయగలడా లేదా అనేదానిపై సెలెక్టర్లకు నమ్మకం లేదు.

చెన్నైతో మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం రిలయన్స్ ఫెసిలిటీ, వాంఖడే స్టేడియంలో ట్రైనింగ్ తీసుకుంటున్నా, వన్డేల్లో 10 ఓవర్లు వేసే ఫిట్‌నెస్ అతనికి ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

జనవరిలో కూడా 10 ఓవర్లు వేసే ఫిట్‌నెస్ లేకపోవడంతో న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు అతడిని దూరం పెట్టారు. ఒకవేళ హార్దిక్ ఫిట్‌నెస్ నిరూపించుకోకపోతే, అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి లేదా హర్షిత్ రాణా వంటి యంగ్ ప్లేయర్లను వన్డే వరల్డ్ కప్ 2027 ప్లాన్స్‌లోకి తీసుకునే యోచనలో బీసీసీఐ ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Video: విధి ఎంత విచిత్రమైందో.. ఒకప్పుడు స్టార్ క్రికెటర్, ప్రస్తుతం దారుణ పరిస్థితి
Recommended image2
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image3
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Related Stories
Recommended image1
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image2
Indian Railways : రైల్లో బ్యాగ్ లేదా ఫోన్ మర్చిపోయారా? ఈ ఒక్క నెంబర్ కి కాల్ చేస్తే చాలు.. వెతికి మరీ ఇస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved