టీమిండియా 2026 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే.. ఏయే జట్లతో ఆడనుంది.?
Team India: టీమిండియా 2026 క్యాలెండర్ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. ఈ ఏడాది భారత జట్టు టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటుంది. దీనికి భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తాయి. 2024 విజేతగా భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2026 షెడ్యూల్ ఇదే
భారత క్రికెట్ జట్టు 2026 నూతన సంవత్సరంలో మరింత పకడ్బందీగా మ్యాచ్‌లు ఆడనుంది. గత ఏడాది ఎదురైన కొన్ని చేదు అనుభవాల నుంచి కీలకమైన పాఠాలు నేర్చుకుంది. ఈ ఏడాది టీమిండియాకు మ్యాచ్‌లు, టోర్నమెంట్‌లతో నిండిన బిజీ షెడ్యూల్ ఉంది.
టీ20 ప్రపంచకప్ ముఖ్యం..
భారత పురుషుల జట్టు 2026 టి20 ప్రపంచ కప్‌లో పాల్గొననుంది. దీనికి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2024లో టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న డిఫెండింగ్ ఛాంపియన్‌గా, ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది.
టీమిండియా ఆడే టెస్టులు ఇవే..
2026లో టీమిండియా మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంది. ఇందులో నాలుగు మ్యాచ్‌లు విదేశీ గడ్డపైనే జరుగుతాయి. జనవరిలో న్యూజిలాండ్‌తో, జూలైలో ఇంగ్లాండ్‌తో, సెప్టెంబర్-అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో, అక్టోబర్-నవంబర్‌లో మరోసారి న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లు షెడ్యూల్ ఉన్నాయి.
డిసెంబర్‌లో లాస్ట్ సిరీస్ వీరితోనే..
ఈ సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌లతో పాటు, డిసెంబర్‌లో శ్రీలంకతో వన్డేలు, టీ20లు ఆడనుంది. మార్చిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 ఉండనుండగా.. పలు సిరీస్‌లకు తేదీలను ఇంకా ప్రకటించనుంది.
2026లో భారత్ ఆడే వన్డేలు ఇవే..
మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు నాలుగు టెస్టులు, దాదాపు 18 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఏడాది టీమిండియాకు సవాలుతో కూడుకున్నదిగా మారనుంది.

