MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Sanju Samson: వరల్డ్ కప్ హీరో సర్ప్రైజ్.. కొట్టాయం వీధుల్లో సంజూ హంగామా

Sanju Samson: వరల్డ్ కప్ హీరో సర్ప్రైజ్.. కొట్టాయం వీధుల్లో సంజూ హంగామా

Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026 హీరో సంజు శాంసన్ కేరళ వ్యాపారి నితిన్ బాబును కలిశారు. శాంసన్ ప్రదర్శనకు ఫిదా అయి తన 82 మంది ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన నితిన్‌ను సంజూ స్వయంగా కలిసి అభినందించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 23 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సంజూ శాంసన్ మెరుపులకు ఫిదా అయి ఉద్యోగులకు కాసుల వర్షం
Image Credit : Asianet News

సంజూ శాంసన్ మెరుపులకు ఫిదా అయి ఉద్యోగులకు కాసుల వర్షం

టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు టైటిల్ అందించిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన క్రీడా స్ఫూర్తితోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు. తన ఆటపై ఉన్న ప్రేమతో తన ఉద్యోగులకు ప్రత్యేక బోనస్‌లు ప్రకటించిన కేరళకు చెందిన వ్యాపారి నితిన్ బాబును సంజూ స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా ప్రపంచకప్‌ను గెలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని నితిన్ బాబు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

24
సంజూ సూపర్ నాక్.. నితిన్ బాబు బోనస్
Image Credit : Instagram/imsanjusamson

సంజూ సూపర్ నాక్.. నితిన్ బాబు బోనస్

కొట్టాయం జిల్లా పాంపాడిలోని 'ఫియా గార్మెంట్స్' యజమాని నితిన్ బాబు, సంజూకు వీరాభిమాని. ప్రపంచకప్ నాకౌట్ దశలో సంజూ ఆడిన ఇన్నింగ్స్‌లు చూసి ఫిదా అయిన నితిన్, తన సంస్థలోని 82 మంది ఉద్యోగులకు భారీగా బోనస్ ప్రకటించారు. సూపర్ 8లో వెస్టిండీస్‌పై సంజూ 97* పరుగులు చేసినప్పుడు రూ. 500, సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 89 పరుగులు చేసినప్పుడు రూ. 1000, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు చేసినప్పుడు రూ. 2000 చొప్పున ప్రతి ఉద్యోగికి అందించారు. ఇలా మొత్తం రూ. 2.77 లక్షలను ఆయన పంపిణీ చేసి సంజు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

వ్యాపారి ఇంటికి సంజూ సర్ప్రైజ్ విజిట్

తన కోసం ఒక వ్యాపారి ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలుసుకున్న సంజూ శాంసన్.. నితిన్ బాబును నేరుగా కలవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే పాంపాడిలోని నితిన్ నివాసానికి ఆకస్మికంగా వెళ్లారు. సంజూను చూసిన నితిన్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. అక్కడ వారితో కలిసి భోజనం చేసిన సంజూ, ఇంటి పెరట్లో నితిన్ కుటుంబంతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. నితిన్ చేసిన ఈ వినూత్నమైన మర్యాదను, గౌరవాన్ని సంజూ మనస్ఫూర్తిగా అభినందించారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanju V Samson (@imsanjusamson)

Related Articles

Related image1
IPL 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్?
Related image2
IPL 2026కు ముందే SRH ఊచకోత.. సిక్సర్ల మోత మోగించిన హైదరాబాద్ కుర్రాడు
34
నా ప్రజల ప్రేమే నా బలం: సంజూ భావోద్వేగం
Image Credit : Asianet News

నా ప్రజల ప్రేమే నా బలం: సంజూ భావోద్వేగం

ఈ విజిట్ కు సంబంధించిన వీడియోను సంజూ శాంసన్ తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగపూరితమైన సందేశాన్ని రాశారు. "నా ప్రజలు, నా కమ్యూనిటీ ఇచ్చే ఈ ప్రేమ, దీవెనలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఆట కంటే కూడా ఈ ప్రేమే నాకు ఎంతో గొప్పది" అని సంజూ పేర్కొన్నారు. తన విజయాన్ని సామాన్య ప్రజలు కూడా తమ సొంత విజయంగా భావించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. మొత్తం 321 పరుగులు చేసిన ఆయన, 80.25 సగటుతో, 199.37 అద్భుత స్ట్రైక్ రేట్‌తో రాణించారు. మూడు కీలక హాఫ్ సెంచరీలు చేసిన సంజూ.. నాకౌట్ మ్యాచ్‌ల్లో అజేయమైన ఆటతీరుతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నారు. సంజూ నిలకడైన ఆట భారత్ కప్ గెలవడంలో కీలకంగా నిలిచింది.

44
ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సంజూ
Image Credit : Instagram/chennaiipl

ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సంజూ

వరల్డ్ కప్ తర్వాత సంజూ ఇప్పుడు ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఏకంగా రూ. 18 కోట్ల భారీ డీల్‌తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సంజును ట్రేడ్ చేసుకుంది. మార్చి 19న చెన్నైలోని చేపాక్ స్టేడియంలో సంజూ తన మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఐదు సీజన్ల పాటు రాజస్థాన్‌ను నడిపించిన అనుభవం ఉన్న సంజూ, సిఎస్కేలో కీలక పాత్ర పోషించనున్నారు. ఐపీఎల్ చరిత్రలో 177 మ్యాచ్‌ల్లో 4704 పరుగులు చేసిన సంజూ, ఈసారి ఎంఎస్ ధోనీ జట్టులో ఎలా రాణిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Anbuden welcome, Sanju Samson! 🦁💛#WhistlePodu#Roar26pic.twitter.com/j85ULbBKRt

— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్?
Recommended image2
Team India: ఐర్లాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా శాంసన్, ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.? ఇక ఊహకందని ఊచకోతే
Recommended image3
IPL 2026కు ముందే SRH ఊచకోత.. సిక్సర్ల మోత మోగించిన హైదరాబాద్ కుర్రాడు
Related Stories
Recommended image1
IPL 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్?
Recommended image2
IPL 2026కు ముందే SRH ఊచకోత.. సిక్సర్ల మోత మోగించిన హైదరాబాద్ కుర్రాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved