MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : రింకూ సింగ్ అందుబాటులో ఉన్నా సంజూనే ఎందుకు ఆడించారు..? టాప్ 4 రీజన్స్ ఇవే

T20 World Cup 2026 : రింకూ సింగ్ అందుబాటులో ఉన్నా సంజూనే ఎందుకు ఆడించారు..? టాప్ 4 రీజన్స్ ఇవే

Sanju Samson : తండ్రి మరణంతో ఇండియా-జింబాబ్వేతో మ్యాచ్ కు రింకూ సింగ్ దూరమయ్యాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినా వెస్టిండిస్ తో మ్యాచ్ కు రింకూ అందుబాటులో ఉన్నా సంజూనే ఎందుకు కొనసాగించారో తెలుసా? 

3 Min read
Author : Arun Kumar P
Published : Mar 02 2026, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వెస్టిండిస్ ను ఓడించిన సంజూ శాంసన్
Image Credit : ANI

వెస్టిండిస్ ను ఓడించిన సంజూ శాంసన్

Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమిండియా మరో అద్భుత విజయాన్ని అందుకుంది. సూపర్-8 ను సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ప్రారంభించినా వెస్టిండిస్ పై విజయంతో ముగించింది. ఇలా వరుసగా జింబాబ్వే, వెస్టిండిస్ లను ఓడించి నెట్ రన్ రేట్, ఇతర సమీకరణలతో పనిలేకుండా సగర్వంగా ఇండియన్ టీం సెమీస్ కు చేరింది. ఈ సూపర్ 8 జర్నీలో రింకూ సింగ్ జట్టునుండి తప్పుకోవడం... సంజూ శాంసన్ జట్టులోకి రావడం ఎంతగానో కలిసివచ్చింది. ఇంకా చెప్పాలంటే శాంసన్ లేకుంటే వెస్టిండిస్ పై విజయం అసాధ్యమయ్యేది... ఆ స్థాయిలో చెలరేగి ఆడాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రింకూ సింగ్ ను కాదని సంజూన్ ఎందుకు ఆడించారు..?
Image Credit : Getty

రింకూ సింగ్ ను కాదని సంజూన్ ఎందుకు ఆడించారు..?

అయితే తండ్రి మరణంతో జింబాబ్వే మ్యాచ్ కు రింకూ సింగ్ దూరమయ్యాడు... దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ కు జట్టులో చోటు కల్పించారు. కానీ అతడు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు... కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వెస్టిండిస్ తో మ్యాచ్ కు రింకూ అందుబాటులోకి రావడంతో ఎప్పట్లాగే సంజూను పక్కనబెడతారని అభిమానులు భావించారు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ అనూహ్యంగా సంజూకు మరో అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయమే టీమిండియాను విజయతీరాలకు చేర్చింది.

వెస్టిండిస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో సంజూను కొనసాగించడానికి పలు కారణాలున్నాయి. పవర్‌ప్లేలో అతని బ్యాటింగ్ నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో రికార్డు వరకు ఎన్నో అంశాలు సంజూకు కలిసివచ్చాయి. అందుకే రింకూను కాదని ఇతడినే కొనసాగించారు... ఈ నమ్మకాన్ని సంజూ నిలబెట్టుకున్నాడు.

36
ఓపెనింగ్ రికార్డు..
Image Credit : ANI

ఓపెనింగ్ రికార్డు..

సంజూ శాంసన్ తొలి ఓవర్లలోనే తన బ్యాటింగ్‌తో ప్రభావం చూపించగలడు. అభిషేక్ శర్మలా ప్రతి బంతిని బౌండరీకి బాదాలని చూడకుండా కాస్త సంశయమనంతోనే వేగంగా ఆడగలడు. ఇలా ఈ వరల్డ్ కప్ లో నమీబియాపై అరంగేట్రం చేసి కేవలం 8 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ సాయంతో 22 పరుగులు బాదాడు. ఇక సూపర్ 8లో జింబాబ్వేపై 15 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. ఇలా వెస్టిండిస్ తో మ్యాచ్ కు ముందే టీ20 టోర్నీలో 200 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు. పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకోవాలంటే సంజూ లాంటి ఓపెనర్ అవసరం అని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు. అందుకే ఫినిషర్ రింకూ కంటే ఓపెనర్ సంజూనే కీలకమని భావించి వెస్టిండిస్ తో బరిలోకి దింపారు.

46
సూపర్ వికెట్ కీపర్..
Image Credit : X/BCCI

సూపర్ వికెట్ కీపర్..

వికెట్ కీపింగ్ నైపుణ్యాలు సంజూకు అదనపు బలం. సూపర్ 8 లో కీలకమైన జింబాబ్వే మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్ చేశాడు... తషింగా ముసెకివాను ఔట్ చేయడానికి అద్భుతమైన వన్ హ్యాండ్ డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు.

ఇప్పటివరకు 59 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్ 38 క్యాచ్‌లు, 7 స్టంపింగ్‌లు చేశాడు. అయితే ఇషాన్ కిషన్ 42 టీ20 మ్యాచుల్లో కేవలం 17 క్యాచ్‌లు, 5 స్టంపింగ్‌లు మాత్రమే చేశాడు. సంజూ చురుకైన కీపింగ్ జట్టుకు బలం. ఇషాన్ కిషన్ కంటే మెరుగైన కీపింగ్ నైపుణ్యం కూడా సంజూకు కలిసివచ్చాయి.

56
ఈడెన్ గార్డెన్ కింగ్ సంజూ...
Image Credit : ANI

ఈడెన్ గార్డెన్ కింగ్ సంజూ...

భారత్, వెస్టిండీస్‌ తలపడ్డ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కేరళ బ్యాటర్‌ సంజూకు మంచి రికార్డు ఉంది. వెస్టిండిస్ తో మ్యాచ్ కు ముందు ఇక్కడ సంజూ 11 ఇన్నింగ్స్‌లలో 141.2 స్ట్రైక్ రేట్‌తో 332 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అందుకే అతడిని వెస్టిండిస్ తో కీలకమైన మ్యాచ్ లో బరిలోకి దింపారు... దీంతో మరోసారి ఈడెన్ గార్డెన్ కింగ్ గా నిరూపించుకుని 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.

66
స్పిన్నర్లను ఎదుర్కోవడంతో సంజూ రికార్డు..
Image Credit : X/BCCI

స్పిన్నర్లను ఎదుర్కోవడంతో సంజూ రికార్డు..

వెస్టిండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలోనూ సంజూ శాంసన్ కు మంచి రికార్డు ఉంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ కు ముందు గుడాకేష్ మోతీ 6 మ్యాచ్‌లలో 10 వికెట్లు, అకీల్ హోసేన్ 5 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీశారు. క్రిక్‌మెట్రిక్ డేటా ప్రకారం, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లపై సంజూ 150 స్ట్రైక్ రేట్‌తో 429 పరుగులు చేశాడు. ఇలా స్పిన్నర్లు ఎదుర్కోవడంతో మంచి రికార్డు ఉండటం సంజూకు అదనపు బలం... అదే అతడిని వెస్టిండిస్ మ్యాచ్ లో అవకాశం కల్పించింది. అనుకున్నట్లుగానే సంజూ శాంసన్ వెస్టిండిస్ బౌలర్లను ఉతికారేశాడు... టీమిండియాకు అద్భుత విజయం అందించాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
Now Playing
Sanju Samson 97: Kohli రికార్డు బ్రేక్ చేసిన సంజూ | IND vs WI T20 World Cup 2026 | Asianet Telugu
Recommended image2
Now Playing
Sanju Samson 97 Secret: రోహిత్, కోహ్లీ స్ఫూర్తితో మాస్ ఇన్నింగ్స్ | IND vs WI T20 World Cup 2026
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved