MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు

T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌ 2026లో నమీబియాతో జరగనున్న రెండో మ్యాచ్‌కు ముందు టీమిండియాలో గాయాల కలకలం రేగుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా ప్రాక్టీస్‌కు దూరం కావడంతో, సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 10 2026, 11:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్ శర్మ ఔట్.. బుమ్రా రీఎంట్రీపై క్లారిటీ
Image Credit : Getty

అభిషేక్ శర్మ ఔట్.. బుమ్రా రీఎంట్రీపై క్లారిటీ

2026 టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యంతో ఇబ్బంది పడ్డ భారత్, ఇప్పుడు గాయాలు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. 

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరగనున్న రెండో గ్రూప్-A మ్యాచ్‌కు ముందు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌కు గైర్హాజరు కావడం ఆందోళన కలిగిస్తోంది. అభిషేక్ శర్మ కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ తెలిపారు.

మరోవైపు, తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కోలుకోవడం జట్టుకు ఊరటనిచ్చే అంశం. జ్వరం కారణంగా యూఎస్‌ఏతో మ్యాచ్ ఆడని బుమ్రా, మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. సుమారు 25 నిమిషాల పాటు నెట్స్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు బౌలింగ్ చేసిన బుమ్రా, తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని స్పష్టమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్?
Image Credit : Getty

సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్?

ఓపెనర్ అభిషేక్ శర్మ అందుబాటుపై సందిగ్ధత నెలకొనడంతో, కేరళ స్టార్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు మెరుగయ్యాయి. న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైన సంజూ, తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే, మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో సంజూ శాంసన్ చాలా సమయం పాటు నెట్స్‌లో గడిపాడు.

ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనింగ్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం. ప్రారంభంలో కొంత తడబడినప్పటికీ, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో అద్భుతమైన షాట్లతో అలరించాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో సంజూ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అభిషేక్ కోలుకోకపోతే ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.

35
వాషింగ్టన్ సుందర్ రాకతో పెరిగిన బలం
Image Credit : Getty

వాషింగ్టన్ సుందర్ రాకతో పెరిగిన బలం

భారత శిబిరంలో మరో సానుకూల అంశం ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుతో చేరడం. సైడ్ స్ట్రెయిన్ గాయం కారణంగా గత నెల రోజులుగా ఆటకు దూరమైన సుందర్, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. మంగళవారం అతను నెట్స్‌లో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే సుందర్ కీలక పాత్ర పోషించగలడని కోచ్ టెన్ డోషేట్ పేర్కొన్నారు. అతని రాకతో జట్టు కాంబినేషన్ మరింత బలంగా మారనుంది.

45
బ్యాటర్ల వైఫల్యం.. స్ట్రాటజీలో మార్పులు?
Image Credit : AFP

బ్యాటర్ల వైఫల్యం.. స్ట్రాటజీలో మార్పులు?

యూఎస్‌ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును సూర్యకుమార్ యాదవ్ తన అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ముంబై పిచ్‌పై బ్యాటర్లు అనుసరించిన దూకుడు వ్యూహం బెడిసికొట్టిందని కోచ్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలని చూడకుండా, కండిషన్స్‌కు తగ్గట్లుగా ఆడటం ముఖ్యమని ఆయన హెచ్చరించారు. అక్షర్ పటేల్‌ను లోయర్ ఆర్డర్‌లో పంపడంపై విమర్శలు రావడంతో, ఇకపై వికెట్లు పడితే అక్షర్‌ను ఫ్లోటర్ గా ముందు వరుసలో పంపే అవకాశం ఉందని కోచ్ స్పష్టం చేశారు.

55
నమీబియా తర్వాత పాకిస్థాన్‌తో హైవోల్టేజ్ పోరు
Image Credit : AFP

నమీబియా తర్వాత పాకిస్థాన్‌తో హైవోల్టేజ్ పోరు

నమీబియాతో ఫిబ్రవరి 12న జరిగే మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలని భారత్ భావిస్తోంది. దీని తర్వాత ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. 

పాక్ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం మేనేజ్‌మెంట్‌కు ముఖ్యం. నమీబియా మ్యాచ్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, భారత్ ఇద్దరు లేదా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Recommended image2
T20 World Cup : బ్యాట్ పడితే కోట్లు.. ఫోజు కొడితే లక్షలు! టీ20 వరల్డ్ కప్ రిచెస్ట్ ప్లేయర్స్ వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved